తేజస్వీ యాదవ్-రబ్రీదేవి (ఫైల్ ఫోటో)
పట్నా : బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ ఛీప్ లాలు ప్రసాద్ యాదవ్ భార్య రబ్రీదేవికి జేడీయూ మహిళా విభాగం నేతలు బహిరంగ లేఖ రాశారు. రబ్రీదేవి నీ కుమారుడు తేజస్వీ యాదవ్ ప్రవర్తన సరిగ్గా లేదు జాగ్రత్త అంటూ లేఖలో పేర్కొన్నారు. ముజఫర్‌పూర్ ఘటనకు నిరసనగా శనివారం తేజస్వీ యాదవ్ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ధర్నా అనంతరం జేడీయూకి చెందిన అంజుం ఆరా, శ్వేతా విశ్వాస్, భారతీ మెహతాలు రబ్రీదేవికి లేఖ రాశారు.
‘మీ కొడుకు, ప్రతిపక్షనేత తేజస్వీ యాదవ్ ప్రవర్తన సరిగ్గా లేదు. తన ప్రవర్తనలో చాలా మార్పు వస్తుంది. తేజస్వీ పీఏగా పనిచేస్తున్న మణిప్రకాశ్ మంచి వాడు కాదు. అతను మహిళల అక్రమ రవాణా కేసులో ప్రధాన నిందితుడు. ఇతనిపై పలు కేసులు కూడా ఉన్నాయి. అలాంటి వారిని మీరు పీఏగా ఎలా నియమించుకుంటారు. అతని మార్గదర్శకత్వంలో తేజస్వీ పక్కదారి పడుతున్నాడు. ఒక మహిళగా మీరు ఆలోచించడండి. మీ కొడుకులను సంస్కారవంతులుగా తీర్చిదిద్దడంలో మీరు విఫలమయ్యారు. ఇప్పటికైన మించింది ఏంలేదు. త్వరగా మేల్కోని మీ కొడుకుని కాపాడుకొండి’ అంటూ ఘాటుగా రాశారు. కాగా ముజఫర్‌ఘటనపై తేజస్వీ యాదవ్ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే. నిందితులకు ఉరిశిక్ష వేయాలని, నితీష్ పాలనలో మహిళలకు భద్రత కరువైందని తేజస్వీ విమరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment