ఆ రాష్ట్రాల గురించి ఎందుకు మాట్లాడరు?
పట్నా: ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న జంగిల్ రాజ్ పాలన గురించి మాట్లాడడం లేదని బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజశ్వి యాదవ్ ప్రశ్నించారు. అసలు జంగిల్ రాజ్ అంటే ఏంటో నిర్వచించాలని డిమాండ్ చేశారు. జేడీ(యూ) ఎమ్మెల్సీ మనోరమా దేవి కొడుకు రాకీ యాదవ్ నడిరోడ్డుపై హత్యకు పాల్పడిన నేపథ్యంలో బిహార్ లో ఆటవిక పాలన కొనసాగుతోందని విపక్షాలు విమర్శిస్తున్నాయి.
దీనిపై తేజశ్వి యాదవ్ మాట్లాడుతూ.. ఇలాంటి ఘటనలు జరిగిన ఇతర రాష్టాల ప్రభుత్వాలపై ఎందుకు దుమ్మెత్తిపోయడం లేదని ప్రశ్నించారు. జరిగిన ఘటన దురదృష్టకరమని, బాధిత కుటుంబాని న్యాయం చేస్తామని చెప్పారు. బాధ్యులను చట్టం ముందు నిలబెడతామని హామీయిచ్చారు.