బెంగళూరు :
తుమకూరు తాలూకా, నందిహళ్లి జాతీయ రహదారిలో బీరు లారీ బోల్తాపడింది. వేగంగా వస్తున్న లారీ అదుపుతప్పి కారును ఢీకొనడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో పెద్ద ఎత్తున బీరు బాటిళ్లు పగిలి భారీగా నష్టం చోటుచేసుకుంది. ఇదిలా ఉండగా స్థానికులతో పాటు అదే రహదారిలో వెళ్లే ద్విచక్ర వాహనదారులు వాహనాలు నిలిపి బాటిళ్లను పట్టుకుపోవడం కనిపించింది.
ఈ సంఘటనతో రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. క్యాత్సంద్ర పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు.
బీరు లారీ బోల్తా
Published Thu, Apr 20 2017 6:32 PM | Last Updated on Tue, Sep 5 2017 9:16 AM
Advertisement
Advertisement