నంద్యాలలో బీరు బాటిల్స్‌ లోడ్‌ లారీ దగ్ధం | Beer bottles Lorry Catches Fire While Moving in Nandyal | Sakshi
Sakshi News home page

నంద్యాలలో బీరు బాటిల్స్‌ లోడ్‌ లారీ దగ్ధం

Published Mon, May 20 2019 3:57 PM | Last Updated on Thu, Mar 21 2024 11:09 AM

బీరు బాటిల్స్‌ లోడ్‌తో వెళుతున్న ఓ లారీ దగ్ధమైంది. కర్నూలు జిల్లా నంద్యాల ఆర్డీఓ కార్యాలయం వద్ద సోమవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. సాంకేతిక లోపం కారణంగా ఉన్నట్టుండి లారీ ఇంజిన్‌లో నుంచి మంటలు రావడం.. అవి వేగంగా వ్యాపించడంతో చూస్తుండగానే లారీ మొత్తం దగ్ధమైంది. లారీ బీర్‌ బాటిళ్ల లోడ్‌ ఉండటంతో మంటలు మరింత చెలరేగాయి. ఒక్కసారిగా ఈ సంఘటన జరగడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. మరోవైపు మంటలను అదుపు చేసే క్రమంలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. అతడిని స్థానికులు సమీప ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement