
బీర్ బాటిళ్ల కారణంగా అసెంబ్లీ వాయిదా పడటం చర్చనీయాంశంగా మారింది. మహారాష్ట్ర విధాన్ భవన్‌లోని పవర్ హౌజ్ గదిలోకి నీళ్లు చేరటంతో సభను వాయిదా వేస్తున్నట్లు శుక్రవారం అసెంబ్లీ సెక్రెటరీ ప్రకటించారు. అయితే అందుకుగల కారణం తెలిశాక అంతా విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
సాక్షి, ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ గత 57 ఏళ్లలో సమావేశాలు వాయిదా పడటం ఇది రెండోసారి. పవర్ హౌజ్‌లో నీరు చేరటంతో అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా సభను వాయిదా వేశారు. అయితే భారీ వర్షం.. విధాన్ భవన్ డ్రైనేజీ బ్లాక్ కావటంతో నీరంతా టాన్స్‌ఫార్మర్ ఉన్న రూమ్‌లోకి చేరినట్లు అధికారులు తేల్చారు. దీంతో శుక్రవారం స్వయంగా స్పీకర్ హరిబౌ బగాదే స్వయంగా క్లీనింగ్ చర్యలను పర్యవేక్షించారు. తీరా సిబ్బంది డ్రైనేజీని శుభ్రపరుస్తుండగా బీరు బాటిళ్లు, ప్లాస్టిక్ కవర్లు భారీ మొత్తంలో బయటపడటంతో అంతా ఖంగుతిన్నారు. మరోవైపు ఈ వ్యవహారంపై దుమారం మొదలైంది. కాంగ్రెస్‌తోపాటు, శివ సేన.. బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. ప్రభుత్వం పనితీరు ఇదేనని, నాగ్‌పూర్‌లో తొలిసారి వర్షాకాల సమావేశాలను నిర్వహిస్తుండగా ఏర్పాట్లు సరిగ్గా చేయలేకపోయారని ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment