వీడియో: ఆకతాయిల ఓవరాక్షన్‌.. వరద నీటిలో మహిళపై వేధింపులు! | Lucknow Mob Over Action On Woman In Flooded Road | Sakshi
Sakshi News home page

వీడియో: ఆకతాయిల ఓవరాక్షన్‌.. వరద నీటిలో మహిళపై వేధింపులు!

Published Thu, Aug 1 2024 9:23 AM | Last Updated on Thu, Aug 1 2024 9:38 AM

Lucknow Mob Over Action On Woman In Flooded Road

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో కొందరు ఆకతాయిలు హద్దులు దాటి రెచ్చిపోయి ప్రవర్తించారు. పట్టపగలే బైక్‌పై వెళ్తున్న ఓ జంటను వేధింపులకు గురిచేశారు. వర్షపు నీటిలో బైక్‌పై వెళ్లున్న వారిపై నీళ్లు చిమ్ముతూ రక్షసానందం పొందారు. ఈ క్రమంలో మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

వివరాల ప్రకారం.. యూపీ రాజధాని లక్నోలో కొన్ని రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు రోడ్లు నదులను తలపిస్తూ నీటి ప్రవాహంతో నిండిపోయి ఉన్నాయి. లక్నోలో తాజ్ హోటల్ బ్రిడ్జ్ దగ్గర కూడా దాదాపుగా ఇలాంటి పరిస్థితే ఉంది. వరద నీటి కారణంగా బ్రిడ్జ్‌పై మోకాళ్ల లోతు నీళ్లు నిలిచిపోయింది. ఆ బ్రిడ్జ్ పైనే వాహనదారులు నానా తిప్పలు పడుతూ వెళుతున్నారు. ఇక, ఆ బ్రిడ్జ్పై వరద నీరు మోకాలు లోతు ఉండటం చూసి కొందరు ఆకతాయిలు రోడ్డుపైకి చేరుకున్నారు. మోకాలి లోతు నీళ్లలో నిల్చుని ఒకరిపై ఒకరు ఆ వరద నీటిని చల్లుకున్నారు.

 

 

ఈ సందర్బంగా బ్రిడ్జి మీదుగా వచ్చేపోయే వాహనదారులపై నీళ్లు చల్లుతూ ఓవరాక్షన్ చేశారు. కాగా, ఆ సమయంలో అదే బ్రిడ్జ్ మీదుగా ఒక వ్యక్తి వెనుక కూర్చున్న మహిళతో కలిసి బైక్పై వస్తున్నాడు. బైక్పై ఒక మహిళ ఉందన్న విషయం కూడా మర్చిపోయి.. బైక్పై ఉన్న  ఆ వ్యక్తిపై, ఆ మహిళపై నీళ్లు కొడుతూ ఆకతాయిలు రెచ్చిపోయారు. ఆ వాహనదారుడు నీళ్లు చిమ్మడం ఆపండని మర్యాదగా చెప్పాడు. ఆ మహిళ కూడా నీళ్లు కొట్టొదని చెప్పింది. అయినా సరే.. ఈ ఆకతాయిలు వాళ్ల మాటను లెక్కచేయలేదు. మరింత రెచ్చిపోయి బైక్పై ఉన్న ఇద్దరిపై నీళ్లు కొట్టారు. దీంతో.. ఆ వ్యక్తి బైక్ అదుపు తప్పి నీటిలో పడిపోయింది. అనంతరం, ఆ మహిళ నీళ్లలో పడిపోయింది. ఆమెను పైకి లేపి ఆ ఆకతాయిలను హెచ్చరించి సదరు వ్యక్తి అక్కడ నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సందర్భంగా ఆకతాయిలపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు వారిని అరెస్ట్‌ చేశారు. అనంతరం, రోడ్డుపై ఓవరాక్షన్‌ చేస్తున్న వారిపై లాఠీ ఝలిపించారు. 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement