
156 మంది భారతీయులు తిరిగొచ్చారు
దక్షిణ సూడాన్ లో మొత్తం 500మంది భారతీయులున్నారు. వీరిలో 300 మంది తమ వ్యాపార కార్యకలాపాల నిమిత్తం అక్కడే ఉంటామని తెలిపారని విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ పేర్కొన్నారు. వారి క్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆ దేశ ఉపాధ్యక్షుడు తనకు వివరించారని ఆయన తెలిపారు.
దక్షిణ సుడాన్ లోని భారతీయులను స్వదేశానికి తరలించేందుకు 'ఆపరేషన్ సంకట్ మోచన్' ను కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. ఇందుకోసం గురువారం రెండు సీ-17 విమానాలు ఆ దేశానికి బయలుదేరి వెళ్లాయి. ఈ ఆపరేషన్ కు వీకేసింగ్ నాయకత్వం వహించారు.