Operation Sankat Mochan
-
భారత్‌పై అమెరికా ప్రశంసల జల్లు
న్యూఢిల్లీ: భారత్‌పై అమెరికా ప్రశంసల జల్లు కురిపించింది. సంకట్ మోచన్పేరిట తమ దేశ పౌరులను కాపాడుకునేందుకు భారత ఎయిర్ ఫోర్స్ చేసిన సాహసం అద్భుతం అని అమెరికా ఎయిర్ ఫోర్స్ సెక్రటరీ డెడోరా లీ జేమ్స్ అన్నారు. త్వరలో భారత్ పర్యటనకు రానున్న ఆమె సౌత్ సుడాన్ లో ఇబ్బందుల్లో పడిన భారతీయులను తమ దేశం నుంచి కొనుగోలు చేసిన భారీ యుద్ద విమానం సీ-17 గ్లోబ్ మాస్టర్ ద్వారా సురక్షితంగా తిరిగి తమ మాతృదేశంలోకి సురక్షితంగా చేర్చగలిగారని కొనియాడారు. ఈ సందర్భంగా భారత్ ను అభినందించకుండ ఉండలేకపోతున్నానని చెప్పారు. త్వరలోనే స్వయంగా తాను వెళ్లి మరోసారి భారత్‌కు ఈ విషయంలో అభినందనలు చెబుతానని చెప్పారు. అమెరికా నుంచి కొనుగోలు చేసిన సీ-17 గ్లోబ్ మాస్టర్ ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా దక్షిణ సుడాన్ లో సంకంటంలో పడిన 156మంది భారతీయులను సంకట్ మోచన్ ఆపరేషన్ పేరిట సురక్షితంగా గత నెలలో తిరిగి తీసుకొచ్చింది. భారత్ వైమానిక దళం అత్యంత శక్తిమంతంగా పనిచేస్తుందని, ఇరు దేశాల మధ్య గతంలో ఆగిపోయిన పలు కార్యక్రమాలు తన పర్యటనతో తిరిగి ప్రారంభమవుతాయని చెప్పారు. ఇరు దేశాల సైనికులకు ఉమ్మడి శిక్షణ, కొన్ని ఆపరేషన్లలో కలిసి పనిచేయడం, ప్రమాదాలు ఎదుర్కోవడం వంటివి చేస్తామని ఆమె చెప్పారు. -
156 మంది భారతీయులు తిరిగొచ్చారు
తిరువనంతపురం: దక్షిణ సూడాన్ అంతర్యుద్ధంలో చిక్కుకున్న 156 మంది భారతీయులు స్వదేశానికి క్షేమంగా తిరిగొచ్చారు. భారత వైమానిక దళానికి చెందిన సీ-17 విమానంలో వీరు శుక్రవారం ఉదయం కేరళ రాజధాని తిరువనంతపురం చేరుకున్నారు. వీరిలో 46 మంది కేరళ, ఇద్దరు నేపాలీలు, ఏడుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు, దక్షిణ రాష్ట్రాలకు చెందిన వారున్నారు. దక్షిణ సూడాన్ లో మొత్తం 500మంది భారతీయులున్నారు. వీరిలో 300 మంది తమ వ్యాపార కార్యకలాపాల నిమిత్తం అక్కడే ఉంటామని తెలిపారని విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ పేర్కొన్నారు. వారి క్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆ దేశ ఉపాధ్యక్షుడు తనకు వివరించారని ఆయన తెలిపారు. దక్షిణ సుడాన్ లోని భారతీయులను స్వదేశానికి తరలించేందుకు 'ఆపరేషన్ సంకట్ మోచన్' ను కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. ఇందుకోసం గురువారం రెండు సీ-17 విమానాలు ఆ దేశానికి బయలుదేరి వెళ్లాయి. ఈ ఆపరేషన్ కు వీకేసింగ్ నాయకత్వం వహించారు. -
భారతీయుల కోసం 'ఆపరేషన్ సంకట్ మోచన్'
ఢిల్లీ: దక్షిణ సుడాన్ లోని భారతీయులను స్వదేశానికి తరలించేందుకు ఆపరేషన్ సంకట్ మోచన్ చేపట్టినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. శుక్రవారం రెండు విమానాలలో సుడాన్ నుంచి స్వదేశానికి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తెలంగాణకు చెందిన 54 మంది, ఏపీకి చెందిన 11 మందిని కేంద్ర విదేశాంగశాఖ భారత్‌కు తీసుకురానుంది. గత కొంతకాలం నుంచి దక్షిణ సుడాన్ లో ప్రభుత్వంపై సైన్యం తిరుగుబాటు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ తిరుగుబాటులో ఇప్పటివరకే రెండు వందల మందికి పైగా పౌరులు మరణించారు. తిరుగుబాటు నేపథ్యంలో భారతీయులను సురక్షితంగా ఇక్కడికి తీసుకొస్తామని విదేశాంగమంత్రి సుష్మస్వరాజ్ ఇదివరకే పేర్కొన్నారు. -
భారతీయుల కోసం 'ఆపరేషన్ సంకట్ మోచన్'
న్యూఢిల్లీ: దక్షిణ సూడాన్ అంతర్యుద్ధంలో చిక్కుకున్న భారతీయులను క్షేమంగా ఇండియాకు రప్పించేందుకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి వీకే సింగ్ నాయకత్వంలో 'ఆపరేషన్ సంకట్ మోచన్' కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఇందుకోసం భారతప్రభుత్వం దక్షిణ సూడాన్ రాజధాని జుబాకు సీ 17 అనే రెండు మిలటరీ విమానాలను గురువారం పంపింది. వీకే సింగ్ తో పాటు విదేశాంగ శాఖకు చెందిన అమర్ సిన్హా, సత్ బిర్ సింగ్, అంజన్ కుమార్ లు వెళ్లారు. దక్షిణ సూడాన్ లోని భారత రాయబారి శ్రీకుమార్ మీనన్ ఈ ఆపరేషను ఆర్గనైజ్ చేస్తున్నారు. సూడాన్ లో 500 మంది భారతీయులున్నారని సమాచారం. ఈ విషయాన్ని విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ ట్వీట్ చేశారు.