భారత్పై అమెరికా ప్రశంసల జల్లు | US praises Indian Air Force | Sakshi

భారత్పై అమెరికా ప్రశంసల జల్లు

Aug 18 2016 9:47 AM | Updated on Aug 24 2018 7:24 PM

భారత్పై అమెరికా ప్రశంసల జల్లు - Sakshi

భారత్పై అమెరికా ప్రశంసల జల్లు

భారత్పై అమెరికా ప్రశంసల జల్లు కురిపించింది.

న్యూఢిల్లీ: భారత్పై అమెరికా ప్రశంసల జల్లు కురిపించింది. సంకట్ మోచన్పేరిట తమ దేశ పౌరులను కాపాడుకునేందుకు భారత ఎయిర్ ఫోర్స్ చేసిన సాహసం అద్భుతం అని అమెరికా ఎయిర్ ఫోర్స్ సెక్రటరీ డెడోరా లీ జేమ్స్ అన్నారు. త్వరలో భారత్ పర్యటనకు రానున్న ఆమె సౌత్ సుడాన్ లో ఇబ్బందుల్లో పడిన భారతీయులను తమ దేశం నుంచి కొనుగోలు చేసిన భారీ యుద్ద విమానం సీ-17 గ్లోబ్ మాస్టర్ ద్వారా సురక్షితంగా తిరిగి తమ మాతృదేశంలోకి సురక్షితంగా చేర్చగలిగారని కొనియాడారు.

ఈ సందర్భంగా భారత్ ను అభినందించకుండ ఉండలేకపోతున్నానని చెప్పారు. త్వరలోనే స్వయంగా తాను వెళ్లి మరోసారి భారత్కు ఈ విషయంలో అభినందనలు చెబుతానని చెప్పారు. అమెరికా నుంచి కొనుగోలు చేసిన సీ-17 గ్లోబ్ మాస్టర్ ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా దక్షిణ సుడాన్ లో సంకంటంలో పడిన 156మంది భారతీయులను సంకట్ మోచన్ ఆపరేషన్ పేరిట సురక్షితంగా గత నెలలో తిరిగి తీసుకొచ్చింది.

భారత్ వైమానిక దళం అత్యంత శక్తిమంతంగా పనిచేస్తుందని, ఇరు దేశాల మధ్య గతంలో ఆగిపోయిన పలు కార్యక్రమాలు తన పర్యటనతో తిరిగి ప్రారంభమవుతాయని చెప్పారు. ఇరు దేశాల సైనికులకు ఉమ్మడి శిక్షణ, కొన్ని ఆపరేషన్లలో కలిసి పనిచేయడం, ప్రమాదాలు ఎదుర్కోవడం వంటివి చేస్తామని ఆమె చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement