ఢిల్లీ: దక్షిణ సుడాన్ లోని భారతీయులను స్వదేశానికి తరలించేందుకు ఆపరేషన్ సంకట్ మోచన్ చేపట్టినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. శుక్రవారం రెండు విమానాలలో సుడాన్ నుంచి స్వదేశానికి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తెలంగాణకు చెందిన 54 మంది, ఏపీకి చెందిన 11 మందిని కేంద్ర విదేశాంగశాఖ భారత్కు తీసుకురానుంది. గత కొంతకాలం నుంచి దక్షిణ సుడాన్ లో ప్రభుత్వంపై సైన్యం తిరుగుబాటు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ తిరుగుబాటులో ఇప్పటివరకే రెండు వందల మందికి పైగా పౌరులు మరణించారు. తిరుగుబాటు నేపథ్యంలో భారతీయులను సురక్షితంగా ఇక్కడికి తీసుకొస్తామని విదేశాంగమంత్రి సుష్మస్వరాజ్ ఇదివరకే పేర్కొన్నారు.