న్యూయార్క్: దక్షిణ సుడాన్లోని ఓ సాయుధ బలగాల గ్రూపు నుంచి 250 మంది బాల సైనికులకు విముక్తి కలిగింది. మరో రెండు రోజుల్లో 400 మంది చిన్నారులను విడిపించాల్సి ఉందని ది యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్ ఫండ్ (యూనిసెఫ్) ప్రకటించింది. దక్షిణ సుడాన్లోని డెమొక్రటిక్ ఆర్మీ కోబ్రా ఫ్యాక్షన్ అనే సాయుధ సంస్థ దాదాపు 12,000 మంది బాలబాలికలను బలవంతంగా తమ గ్రూపులో చేర్చుకుంది. అప్పటి నుంచి వారికి కఠిన శిక్షణ ఇస్తూ సైనికులుగా మార్చే పనిని ప్రారంభించింది.
ఈ నేపథ్యంలో వారికి విముక్తి కలిగించేందుకు పూనుకున్న యూనిసెఫ్.. అప్పటి నుంచి ఆ సంస్థతో పలు దఫాలుగా శాంతి చర్చలు జరిపింది. చర్చలు ఫలించడంతో విడతల వారిగా తమ వద్ద ఉన్న బాల సైనికులను సౌత్ సుడాన్ డెమొక్రటిక్ ఆర్మీ కోబ్రా ఫ్యాక్షన్ విడుదల చేస్తోంది. తాజాగా విడుదల చేసిన 250 మంది చిన్నారి సైనికుల్లో బాలికలు కూడా ఉన్నారు. విడుదలైన వారితో యూనిసెఫ్ బుధవారం ప్రత్యేకంగా బహిరంగ సమావేశాన్ని ఏర్పాటుచేసింది. ఇందులో బాధితులైతున్న చిన్నారుల గురించే చర్చించనున్నారు.
హమ్మయ్య.. 250 మంది చిన్నారులకు విముక్తి
Published Tue, Mar 24 2015 10:17 AM | Last Updated on Sat, Sep 2 2017 11:19 PM
Advertisement
Advertisement