125 మందిపై అత్యాచారం | 125 women and girls raped and clubbed in South Sudan over 10 days | Sakshi
Sakshi News home page

125 మందిపై అత్యాచారం

Published Sun, Dec 2 2018 9:50 AM | Last Updated on Sun, Dec 2 2018 7:11 PM

125 women and girls raped and clubbed in South Sudan over 10 days - Sakshi

జుబా: అంతర్యుద్ధంతో అతలాకుతలమవుతున్న దక్షిణ సూడాన్‌లో మహిళలపై లైంగిక హింస కొనసాగుతోంది. గడిచిన పది రోజుల వ్యవధిలో 125 మంది మహిళలు, బాలికలపై అత్యాచారాలు, భౌతిక దాడులు జరిగినట్లు తెలిసింది. బెంటియూ అనే ప్రాంతంలో ఆహార పంపిణీ కేంద్రానికి వెళ్లగా వారిపై ఈ ఘోరం జరిగినట్లు డాక్టర్స్‌ వితౌట్‌ బోర్డర్స్‌ అనే స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది. బాధితుల్లో గర్భిణీలు, వృద్ధులు, బాలికలున్నట్లు సహాయక కార్యకర్తలు తెలిపారు. ఈ ఘోరం గురించి చెప్పేందుకు తనకు మాటలు రావడం లేదని ఓ కార్యకర్త ఆవేదన వ్యక్తం చేశారు.

మహిళల దుస్తులు, పాదరక్షలు, రేషన్‌ కార్డులు లాక్కుని వారిపై భౌతిక దాడికి కూడా పాల్పడినట్లు చెప్పారు. మిలిటరీ సిబ్బంది, సాధారణ పౌరులే ఈ దారుణాలకు ఒడిగడుతున్నట్లు ఐక్యరాజ్య సమితి మిషన్‌ చీఫ్‌ డేవిడ్‌ షీర్‌ వెల్లడించారు. ఇదిలా ఉండగా, ఈ ఏడాది తొలి పది నెలల కాలంలో అదే ప్రాంతంలో 104 మంది లైంగిక దాడి బాధితులకు వైద్యం అందించినట్లు డాక్టర్స్‌ వితౌట్‌ బోర్డర్స్‌ తెలిపింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement