
కూలిన విమానం.. అందులో 44 మంది
జుబా: దక్షిణ సూడాన్‌లో విమానం కూలిపోయింది. భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 7:30 గంటల ప్రాంతంలో వావు విమానాశ్రయంలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ విమానంలో కనీసం 44 మంది ఉన్నట్టు సమాచారం.
ప్రయాణికుల క్షేమం గురించి భిన్నమైన కథనాలు వినిపిస్తున్నాయి. విమానంలోని 44 మంది మరణించినట్టు వార్తలు రాగా మరికొన్ని వార్త సంస్థలు చాలామంది ప్రయాణికులు గాయపడినట్టు మాత్రమే పేర్కొన్నాయి. ఈ విమానం ఎక్కడికి వెళ్తోంది, ప్రమాదానికి కారణమేంటన్న వివరాలు తెలియాల్సివుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సివుంది.