రోడ్డు ప్రమాదంలో 56 మంది మృతి | 56 killed in South Sudan road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో 56 మంది మృతి

Published Tue, Sep 30 2014 8:28 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

56 killed in South Sudan road accident

కర్తోమ్: దక్షిణ సూడాన్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మినీ బస్సు ఎదురుగా వస్తున్న ట్రక్ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 56 మంది మరణించారని ఉన్నతాధికారులు వెల్లడించారు. ఉగాండ, దక్షిణ సూడాన్ కలిపే రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలిపారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. 

క్షతగాత్రలను ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నామని... ఈ ప్రమాదంలో మరణించిన మృతదేహాలను ఇప్పటికే పోస్ట్మార్టం నిమిత్తం అస్పత్రికి తరలించామని తెలిపారు. దక్షిణ సూడాన్ నుంచి పొరుగు దేశాలకు కలిపే జాతీయ రహదారులపై నిత్యం ట్రాఫిక్తో కిటకిటలాడుతుంది. ఈ నేపథ్యంలో తరచు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement