Khartoum
-
సూడాన్‌లో డ్రోన్ దాడి..43 మంది మృతి
కైరో: సూడాన్ రాజధాని ఖార్టూమ్‌లోని ఓ మార్కెట్‌పై ఆదివారం జరిగిన డ్రోన్ దాడిలో 43 మంది చనిపోయారు. మరో 55 మంది గాయాలపాలయ్యారని మానవీయ సాయం అందిస్తున్న సంస్థలు వెల్లడించాయి. దేశంలో మిలటరీ చీఫ్ జనరల్ అబ్దెల్ ఫతాహ్ బుర్హాన్, పారా మిలటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ నేత జనరల్ మహ్మద్ హమ్దాన్ దగాలో మధ్య ఏప్రిల్ నుంచి ఆధిపత్య పోరు కొనసాగుతున్న విషయం తెలిసిందే. గ్రేటర్ ఖార్టూమ్ ప్రాంతంలో నివాసాల్లో పారా మిలటరీ బలగాలు తిష్టవేసి పోరాట సాగిస్తున్నారు. వారిని లక్ష్యంగా చేసుకుని మిలటరీ వైమానిక దాడులకు దిగుతోంది. రెండు వర్గాల మధ్య పోరులో సామాన్యులు సమిధలుగా మారుతున్నారు. ఈ పోరులో 4 వేల మందికి పైగా మరణించినట్లు ఐరాస చెబుతోంది. -
సూడాన్‌లో వైమానిక దాడి..
కైరో: సూడాన్ రాజధాని ఖార్టూమ్‌పై శనివారం జరిగిన వైమానిక దాడిలో అయిదుగురు చిన్నారులు సహా 17 మంది చనిపోయారు. ఆర్మీకి, శక్తివంతమైన పారా మిలటరీ విభాగం ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్(ఆర్ఎస్ఎఫ్)కు మధ్య ఏప్రిల్ నుంచి ఆధిపత్య పోరు కొనసాగుతున్న విషయం తెలిసిందే. మిలటరీ విమానాలు ఆర్ఎస్ఎఫ్పై దాడులు జరుపుతుండగా, ఆర్ఎస్ఎఫ్ బలగాలు డ్రోన్లతో సైన్యంపై దాడులకు దిగుతోంది. ఖార్టూమ్‌లోని యోర్మౌక్ ప్రాంతంలో ఇరువర్గాల మధ్య భీకరపోరు సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజా దాడికి ఎవరు కారణమనే విషయం స్పష్టం కాలేదు. ఈ దాడిలో మరో 11 మంది వరకు గాయపడినట్లు మానవతా సాయం అందిస్తున్న ఒక సంస్థ అంటోంది. మిలటరీయే అక్కడ దాడి చేసిందని, తాము ఒక మిగ్ యుద్ధ విమానాన్ని కూల్చివేశామని ఆర్ఎస్ఎఫ్ అంటోంది. ఆర్మీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అరబ్ మిలీషియాకు చెందిన జన్జవీద్ సంస్థ ఆర్‌ఎస్‌ఎఫ్‌తో కలిసి పోరాడుతోందని సమాచారం. జన్జవీద్ను విమర్శించినందుకే ఇటీవల పశ్చిమ దర్ఫుర్ గవర్నర్ ఖమిస్ అబ్దల్లా అబ్కర్ను చంపేశారని విమర్శలు వస్తున్నాయి. -
రోడ్డు ప్రమాదంలో 19 మంది మృతి
ఖార్టూమ్ : సూడాన్ ఉమ్ అల్ హసన్ ప్రాంతంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణీకులతో వెళ్తున్న రెండు ట్రక్కులు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో 19 మంది మరణించారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారని స్థానిక మీడియా సోమవారం వెల్లడించింది. మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారని తెలిపింది. క్షతగాత్రులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని పేర్కొంది. ప్రమాదం జరిగిన ప్రదేశం సుడాన్ రాజధాని ఖార్టూమ్‌కు 240 కిలోమీటర్ల దూరంలో ఉందని మీడియా చెప్పింది. -
రోడ్డు ప్రమాదంలో 56 మంది మృతి
కర్తోమ్: దక్షిణ సూడాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మినీ బస్సు ఎదురుగా వస్తున్న ట్రక్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 56 మంది మరణించారని ఉన్నతాధికారులు వెల్లడించారు. ఉగాండ, దక్షిణ సూడాన్ కలిపే రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలిపారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. క్షతగాత్రలను ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నామని... ఈ ప్రమాదంలో మరణించిన మృతదేహాలను ఇప్పటికే పోస్ట్‌మార్టం నిమిత్తం అస్పత్రికి తరలించామని తెలిపారు. దక్షిణ సూడాన్ నుంచి పొరుగు దేశాలకు కలిపే జాతీయ రహదారులపై నిత్యం ట్రాఫిక్‌తో కిటకిటలాడుతుంది. ఈ నేపథ్యంలో తరచు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని వివరించారు. -
బస్సును ఢీ కొన్న ట్రక్: 27 మంది మృతి
ప్రయాణికులతో వెళ్తున్న బస్సును ట్రక్క్ ఢీ కొన్న ఘటనలో 27 మంది మృతి చెందారు. ఆ ఘటన సూడాన్‌లోని కర్తోమ్ పట్టణంలో చోటు చేసుకుంది. ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని ... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని పోలీసులు తెలిపారు. మృతుల్లో ఏడుగురు మహిళలతోపాటు ఓ చిన్నారి ఉందని పోలీసులు వెల్లడించారు. ఆ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. -
సూడాన్‌లో తెగల మధ్య ఘర్షణ, 100 మంది మృతి
సూడాన్‌లో రెండు తెగల మధ్య జరిగిన ఘర్షణలో కనీసం వంద మంది మరణించగా పదుల సంఖ్యలో గాయపడ్డారు. డార్పర్ రాష్ట్రంలోని ఉమ్ దొఖోన్ ప్రాంతంలో శనివారం మెస్సీరియా, సలామత్ జాతీయుల మధ్య తీవ్ర స్థాయిలో పోరాటం జరిగినట్టు ఆ దేశ అధికారిక రేడియో వెల్లడించింది. దాదాపు నాలుగు వేల మంది ప్రాణ భయంతో ఇళ్లు విడిచి పారిపోయారు. అధికారులు, భద్రత దళాలు రంగంలోకి అల్లర్లను అదుపు చేశారు. ఈ సంఘటనలో కొందరు చడియన్ సైనికులు కూడా మరణించినట్టు ఓ వార్తా పత్రిక పేర్కొంది. కాగా దీనిపై సూడాన్ ఆర్మీ అధికారులు స్పందించలేదు. సూడాన్‌లోని డార్ఫర్ రాష్ట్రంలో ఈ రెండు తెగల మధ్య తరచూ ఘర్షణలు జరుగుతుంటాయి. గతేడాది భారీ ప్రాణం నష్టం జరిగింది.