కైరో: సూడాన్ రాజధాని ఖార్టూమ్‌లోని ఓ మార్కెట్‌పై ఆదివారం జరిగిన డ్రోన్ దాడిలో 43 మంది చనిపోయారు. మరో 55 మంది గాయాలపాలయ్యారని మానవీయ సాయం అందిస్తున్న సంస్థలు వెల్లడించాయి.
దేశంలో మిలటరీ చీఫ్ జనరల్ అబ్దెల్ ఫతాహ్ బుర్హాన్, పారా మిలటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ నేత జనరల్ మహ్మద్ హమ్‌దాన్ దగాలో మధ్య ఏప్రిల్ నుంచి ఆధిపత్య పోరు కొనసాగుతున్న విషయం తెలిసిందే. గ్రేటర్ ఖార్టూమ్ ప్రాంతంలో నివాసాల్లో పారా మిలటరీ బలగాలు తిష్టవేసి పోరాట సాగిస్తున్నారు. వారిని లక్ష్యంగా చేసుకుని మిలటరీ వైమానిక దాడులకు దిగుతోంది. రెండు వర్గాల మధ్య పోరులో సామాన్యులు సమిధలుగా మారుతున్నారు. ఈ పోరులో 4 వేల మందికి పైగా మరణించినట్లు ఐరాస చెబుతోంది.
Comments
Please login to add a commentAdd a comment