సూడాన్లో రెండు తెగల మధ్య జరిగిన ఘర్షణలో కనీసం వంద మంది మరణించగా పదుల సంఖ్యలో గాయపడ్డారు. డార్పర్ రాష్ట్రంలోని ఉమ్ దొఖోన్ ప్రాంతంలో శనివారం మెస్సీరియా, సలామత్ జాతీయుల మధ్య తీవ్ర స్థాయిలో పోరాటం జరిగినట్టు ఆ దేశ అధికారిక రేడియో వెల్లడించింది. దాదాపు నాలుగు వేల మంది ప్రాణ భయంతో ఇళ్లు విడిచి పారిపోయారు.
అధికారులు, భద్రత దళాలు రంగంలోకి అల్లర్లను అదుపు చేశారు. ఈ సంఘటనలో కొందరు చడియన్ సైనికులు కూడా మరణించినట్టు ఓ వార్తా పత్రిక పేర్కొంది. కాగా దీనిపై సూడాన్ ఆర్మీ అధికారులు స్పందించలేదు. సూడాన్లోని డార్ఫర్ రాష్ట్రంలో ఈ రెండు తెగల మధ్య తరచూ ఘర్షణలు జరుగుతుంటాయి. గతేడాది భారీ ప్రాణం నష్టం జరిగింది.
సూడాన్లో తెగల మధ్య ఘర్షణ, 100 మంది మృతి
Published Sun, Nov 17 2013 8:42 AM | Last Updated on Sat, Sep 2 2017 12:42 AM
Advertisement
Advertisement