దేశ రక్షణలో ఏళ్లపాటు గడిపిన ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ వీకే సింగ్ భారతీయ జనతా పార్టీలో చేరారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ సమక్షంలో ఆయన శనివారం కమలం తీర్థం పుచ్చుకున్నారు. ఇందుకు సంబంధించి కొన్ని రోజుల క్రితమే వీకే సింగ్ సంకేతాలు ఇచ్చారు. యనతో పాటు పలువురు ఆర్మీ మాజీ ఉన్నతాధికారులు కూడా కాషాయ కండువా కప్పుకున్నారు. కేంద్ర ప్రభుత్వంపై వీకే సింగ్ సుప్రీంకోర్టులో కేసు వేసి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తన జనన తేదీపై రక్షణ శాఖతో తలెత్తిన వివాదంపై ఆయన 2012లో కేంద్ర ప్రభుత్వంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
Published Sat, Mar 1 2014 8:37 PM | Last Updated on Wed, Mar 20 2024 3:43 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement