Army Chief
-
Sarath Fonseka: శ్రీలంక అధ్యక్ష బరిలో మాజీ ఆర్మీ చీఫ్
కొలంబో: శ్రీలంక అధ్యక్ష పదవికి త్వరలో జరగనున్న ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు మాజీ ఆర్మీ చీఫ్, ఫీల్డ్ మార్షల్ శరత్ ఫోన్సెకా(73) ప్రకటించారు. అధ్యక్షుడైతే అవినీతిని రూపుమాపి, దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేస్తానని హామీ ఇచ్చారు. సెప్టెంబర్ 17–అక్టోబర్ 16 తేదీల మధ్య దేశంలో ఎన్నికలు జరిగే అవకాశముంది. ఎన్నికల సంఘం ఈ నెల 26వ తేదీన షెడ్యూల్ ప్రకటించనుంది. 2009లో అప్పటి ఆర్మీ చీఫ్ శరత్ ఫోన్సె సారథ్యంలో చేపట్టిన సైనిక ఆపరేషన్‌లో ఎలీ్టటీఈ చీఫ్ వేలుపిళ్లై ప్రభాకర్ సహా కేడర్ అంతమైంది. కాగా, ప్రధాన ప్రతిపక్ష నేత సజిత్ ప్రేమదాస, మార్క్సిస్ట్ జేవీపీ నేత అనురా కుమార దిస్సనాయకేలు కూడా అధ్యక్ష పదవికి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. -
ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే పదవీకాలం పొడిగింపు
సాక్షి, ఢిల్లీ: ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే పదవీ కాలం పొడిగింపు ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే పదవీకాలాన్ని కేంద్రం నెల రోజులు పొడిగించింది. జూన్ 30 వరకు ఆర్మీ చీఫ్‌గా కొనసాగనున్నారు. పదవీకాలం పొడిగింపునకు కేబినెట్ అపాయింట్మెంట్ కమిటీ ఆదివారం ఆమోదం తెలిపింది. మనోజ్ పాండే ఈ నెల 31న పదవీ విరమణ చేయాల్సి ఉంది. గతంలోనూ కేంద్రం ఆయన పదవీకాలాన్ని పొడిగించిన సంగతి తెలిసిందే.మనోజ్ పాండే ఏప్రిల్ 30, 2022న ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన మనోజ్ పాండే.. ఇప్పటి వరకు ఆర్మీ వైస్ చీఫ్‌గా ఉన్న జనరల్ పాండే, కార్ప్స్ ఆఫ్ ఇంజినీర్స్ విభాగం నుంచి ఈ అత్యున్నత పదవికి ఎంపికైన మొదటి వ్యక్తి. జనరల్ మనోజ్ పాండే నేషనల్ డిఫెన్స్ అకాడెమీలో శిక్షణ అనంతరం 1982లో కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్స్‌లో విధుల్లో చేరారు. 39 ఏళ్ల కెరీర్లో పలు కీలక బాధ్యతలు చేపట్టారు.పశ్చిమ ప్రాంతంలో ఇంజనీర్ బ్రిగేడ్‌కు, నియంత్రణ రేఖ వద్ద ఇన్ఫాంట్రీ బ్రిగేడ్‌కు, లదాఖ్ సెక్టార్లో మౌంటేన్ డివిజన్‌కు నేతృత్వం వహించారు. 2001లో పార్లమెంటుపై ఉగ్ర దాడి అనంతరం జమ్మూ కశ్మీర్‌లోని పల్లన్వాలా సెక్టార్లో ఆపరేషన్ పరాక్రమ్ సందర్భంగా ఇంజనీర్ రెజిమెంట్‌కు సారథ్యం వహించారు. తూర్పు కమాండ్ బాధ్యతలు చూశారు. -
నా భార్యకు ఏమైనా జరిగితే వదలిపెట్టను: ఇమ్రాన్ ఖాన్ వార్నింగ్
ఇస్లామాబాద్: తన భార్య జైలుపాలు కావడానికి ఆర్మీ చీఫ్ జనరల్ ఆసీమ్ మునీర్ కారమంటూ మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్( పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. తన భార్య బుష్రా బీబీ జైలు శిక్ష పడినందుకు ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ బాధ్యత వహించాలన్నారు. అవినీతి కేసుకు సంబంధించి బీబీ బుష్రా జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ప్రస్తుతం ఆమె గృహ నిర్బంధంలో ఉన్నారు. అడియాలా జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్ ఖాన్ మీడియాతో మాట్లాడిన వీడియోను తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘నా భార్య బుష్రాకు జైలు శిక్ష పడటంలో ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ స్వయంగా జోక్యం చేసుకున్నారు. కోర్టులో న్యాయమూర్తిపై అసిమ్ మునీర్ ఒత్తిడి తెచ్చారు. నా భార్యకు ఏదైనా జరిగితే.. అసిమ్‌ను వదిలిపెట్టను. నేను బతికి ఉన్నంతవరకు అసిమ్‌ను అస్సలు వదిలేయను. అసిమ్ చేసిన చట్టవ్యతిరేక చర్యలన్నీ బయటపెడతాను. ..పాకిస్తాన్లో ఆటవిక రాజ్యంలో కొనసాగుతోంది. అడవి(పాకిస్తాన్) రాజు(నవాజ్ షరీఫ్) తల్చుకుంటే అన్ని కేసులు మాఫీ చేయబడుతాయి. లేదంటే ఐదు రోజుల్లో మూడు కేసులు బనాయిస్తారు. శిక్ష కూడా పడుతుంది. ఆటవిక రాజ్యంలో పెట్టుబడలు రావు. పెట్టుబడుల పెట్టడానికి సౌదీ అరేబియా ముందురావటం మంచిదే. కానీ, చట్టబద్ద కల్పించరు’ అని ఇమ్రాన్ మండిపడ్డారు. -
ఎంతకాలం అడుక్కుంటాం.. ముందు చేతిలో చిప్ప విసిరేయాలి
ఇస్లామాబాద్: అసలే అంతంత మాత్రంగా ఉన్న పాకిస్తాన్ దేశ ఆర్ధిక పరిస్థితి ఎప్పటికి కుదుటపడుతుందో తెలీయని అనిశ్చితిలో దొరికిన చోట దొరికినంత అప్పు చేస్తోంది. తాజాగా తన మిత్ర దేశమైన చైనా దగ్గర మరికొంత ఋణం తీసుకునేందుకు అంతా ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు సయ్యద్ అసీం మునీర్ స్పందిస్తూ మన చేతిలో ఉన్న చిప్పను అవతలకు విసిరేసి స్వాభిమానంతో బ్రతకడం అలవాటు చేసుకోవాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ గత కొంతకాలముగా ఆర్ధిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న సంగతి తెలిసిందే. ఒకపక్క ఉన్న ఆస్తులను అమ్ముకోవడంతో పాటు మరోపక్క రుణాల కోసం కూడా ప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రయాణంలో భాగంగా ఇటీవలే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) దగ్గర కొంత ఋణం తీసుకుంది. ఇప్పుడు మళ్లీ మిత్రదేశం చైనా దగ్గర మరికొంత రుణాన్ని పొందనుంది. చైనాకు పాకిస్తాన్ ఇప్పటికే 2.07 బిలియన్ డాలర్ల రుణపడి ఉండగా తాజాగా తీసుకోనున్న మరో 600 మిలియన్ డాలర్ల రుణంతో కలిపి ఆ మొత్తం 2.44 బిలియన్ డాలర్లకు చేరనుంది. దీంతో విపరీతంగా పెరుగుతున్న అప్పుల భారం దృష్ట్యా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ సయ్యద్ అసీం మునీర్ స్పందించారు. పాకిస్తాన్ ఆర్ధిక వ్యవస్థ బలపడేంత వరకు సైన్యం నిద్రపోకుండా పనిచేస్తుందని, అపార ప్రతిభావంతులను, ఉత్సాహవంతులైన వారిని చూసి పాకిస్తాన్ గర్విస్తోందని అన్నారు. ఎంతకాలం ఇలా పొరుగుదేశాల దగ్గర చిప్ప పట్టుకుని తిరుగుతాం. ముందు చేతిలోని ఆ చిప్పను విసిరేయాలి. రుణాల కోసం ఇతర దేశాల మీద మీద ఆధారపడటం మానేయాలి. సొంత కాళ్ళ మీద నిలబడి ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేయటానికి ప్రయత్నించాలని అన్నారు. ఇది కూడా చదవండి: అక్రమ వలసలకు చెక్.. ఐరోపా దేశాలు-ట్యునీషియా మధ్య ఒప్పందం -
యుద్ధం అంతుచూసేదాకా వదలను
ఖార్తూమ్: యుద్ధం అంతుచూసేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదని సంక్షుభిత సూడాన్ సైన్యాధ్యక్షుడు జనరల్ అబ్దెల్ ఫతాహ్ బుర్హాన్ శనివారం ప్రకటించారు. దాంతో అక్కడి తమవారి భద్రతపై అమెరికా, బ్రిటన్, చైనా, తదితర దేశాలు ఆందోళనలో పడ్డాయి. కాల్పుల విరమణ యత్నాలు రెండుసార్లు విఫలమైన దరిమిలా బాంబుల మోతతో దద్దరిల్లుతున్న దేశం నుంచి బయటపడే మార్గంలేక విదేశీయులు బిక్కుబిక్కుమంటున్నారు. బాంబు దాడులు, కాల్పుల ఘటనల్లో ఇప్పటిదాక 400 మందికిపైగా మరణించారు. సూడాన్‌లో చిక్కుకున్న 16 వేల మంది తమ పౌరులను ఎలాగైనా రక్షిస్తామని అమెరికా శుక్రవారం ప్రకటించడం తెల్సిందే. -
Sudan crisis: ఇద్దరి అధికారహం, అంతర్యుద్ధం.. సామాన్యుల ఆకలి కేకలు
ఇద్దరు మిలటరీ నాయకుల మధ్య ఆధిపత్య పోరాటం సూడాన్‌లో సామాన్యుల ఆకలి కేకలకు దారితీస్తోంది. అధికారం కోసం వారు చేస్తున్న పోరాటంతో సామాన్యులు సమిధలుగా మారుతున్నారు. తినడానికి తిండి లేక, తాగడానికి నీళ్లు దొరక్క, కటిక నేలపై నిద్రిస్తూ ఎప్పుడే తూటా తమ ప్రాణాల్ని హరిస్తుందో తెలీని పరిస్థితుల్లో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. సూడాన్‌లో ఎందుకీ ఘర్షణలు ? దశాబ్దాల తరబడి నియంత పాలనలో మగ్గిపోయిన సూడాన్‌లో 2019లో ఆర్మీ తిరుగుబాటు జరిగి ఆనాటి అధ్యక్షుడు, నియంత ఒమర్ అల్– బషీర్‌ని సైన్యం గద్దె దింపడంతో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటైంది. ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారో లేదో రెండేళ్లకే 2021లో ఆ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి కొదమసింహాల్లాంటి ఇద్దరు జనరల్స్ చేతులు కలిపారు. అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఈ క్రమంలో ఘర్షణలు చెలరేగి వందల మంది ప్రాణాలు కోల్పోయారు. మళ్లీ రెండేళ్లకే అధికార బదలాయింపులో సమస్యలు మిత్రులైన ఆ మిలటరీ జనరల్స్‌ను శత్రువులుగా మార్చింది. వారే సూడాన్ ప్రస్తుత పాలకుడు, ఆర్మీ చీఫ్ జనరల్ అబ్దుల్ ఫత్తా అల్ బుర్హాన్, ఉపాధ్యక్షుడు, ఆర్ఎస్ఎఫ్ చీఫ్ జనరల్ మొహమద్ హమ్దాన్ దగలో (హెమెడ్తీ) . వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరాటం తారస్థాయికి చేరుకుంది. ముందుగా జరిగిన ఒప్పందం ప్రకారం గత ఏడాది చివర్లో ప్రజాస్వామ్య పద్ధతుల్లో దేశంలో ఎన్నికలు జరగాలి. కానీ బుర్హాన్ అనుకున్నట్టుగా ఆ పని చేయలేదు. ఈలోగా అధికారాన్ని తన గుప్పిట్లో తీసుకోవడానికి హెమెడ్తీ పౌర పార్టీల కూటమైన ఫోర్సెస్ ఫర్ ఫ్రీడమ్ అండ్ ఛేంజ్ (ఎఫ్ఎఫ్సీ)తో సత్సంబంధాలు పెట్టుకున్నారు. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ తనని తాను ఒక రాజనీతిజ్ఞుడిగా చూపించుకునే ప్రయత్నం మొదలుపెట్టారు. బంగారం గనులు, ఇతర వెంచర్ల ద్వారా హెమెడ్తీ, ఎఫ్ఎఫ్సీలు బాగా సంపద పోగేసుకున్నారు. మాజీ అధ్యక్షుడు బషీర్ అనుచరులు, ఇతర సీనియర్లు, ఆర్మీలో చాలా రోజులుగా పాతుకుపోయి ఉన్న వారిని పక్కకు తప్పించాలని ప్రణాళికలు రచించారు. ఆర్ఎస్ఎఫ్ను దేశవ్యాప్తంగా చాప కింద నీరులా విస్తరించడం ప్రారంభించారు. ఈలోగా లక్ష మంది బలగం ఉన్న ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ (ఆర్ఎస్ఎఫ్)ను సైన్యంలో విలీనం చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. తర్వాత సైన్యాధ్యక్షుడుగా ఎవరు ఉంటారన్నది సవాల్‌గా మారాయి. ఈ పరిణామాలన్నీ తన పదవికి ఎసరు పెడతాయని అధ్యక్షుడు బుర్హానా భావించారు. ఫలితంగా ఈ నెల 15న ఇరు వర్గాల మధ్య పోరు మొదలైంది. అయిదు రోజులుగా నరకం సూడాన్‌లో వారం రోజులుగా సాగుతున్న హింసాకాండలో ఇప్పటివరకు 200 మందికి పైగా మరణించారు. వేలాది మంది గాయపడ్డారు. పోరాటమంతా రాజధారి ఖర్టూమ్ పరిసరాల్లో జనావాస ప్రాంతాల్లో జరుగుతోంది. సూడాన్ జనాభా 4.6 కోట్లు అయితే రాజధాని పరిసర ప్రాంతాల్లోనే 1.2 కోట్ల మంది నివసిస్తారు. ఈ ప్రాంతాలన్నీ కాల్పుల మోతతో దద్దరిల్లిపోతున్నాయి. వీధుల్లోనే శవాలు పడి ఉన్నా పట్టించుకునే వారే లేరు. విద్యుత్ సదుపాయం నిలిచిపోయింది. బేకరీలో బ్రెడ్ కొనుక్కొని తెచ్చుకోవడానికి 3 గంటలు క్యూ లైన్లో నిల్చోవాల్సి వస్తోంది. కిలోమీటర్ దూరంలో ఉండే ఆఫీసుకి వెళ్లడం కూడా అందరికీ కష్టమవుతోంది. ఇల్లు కదిలి కాలు బయట పెడితే ప్రాణాలతో బతికి ఉంటారన్న నమ్మకం లేదు. అత్యవసరంగా ఆస్పత్రికి వెళ్లాలన్నా వీధుల్లో వినిపిస్తున్న కాల్పుల మోతలతో బయటకి అడుగుపెట్టే ధైర్యం చేయడం లేదని 65 ఏళ్ల వయసున్న అబ్బాస్ చెప్పారు. సూడాన్ పాలకులకు ప్రజల ప్రాణాలపై కనీస గౌరవం కూడా లేదని ఆయన మండిపడ్డారు. ‘‘వేలాది మంది ప్రజలు ప్రాణాలు కాపాడుకోవడానికి ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంట్లో సరుకులు అయిపోతున్నా, మంచినీరు, కరెంట్, మందులు వంటివి లేకపోయినా బయటకు వచ్చే పరిస్థితి లేదు’’అని ఐక్యరాజ్య సమితి మానవహక్కుల హై కమిషనర్ వోల్కర్ టిర్క్ చెప్పారు. కొన్ని దశాబ్దాల పాటు బషీర్ పాలనలో అంతర్యుద్ధంలోనే ప్రజలు గడిపారు. పేదరికం, అణచివేతను ఎదుర్కొంటూ దుర్భర పరిస్థితుల్ని చూశారు. ఇప్పుడైనా ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడుతుందన్న వారి ఆశలు అడియాసలుగా మారాయి. ఎవరిది పై చేయి? బుర్హాన్, హెమెడ్తీ మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. ఇద్దరికి ఇద్దరూ తగ్గేదేలే అంటున్నారు. ఆర్ఎస్ఎఫ్ను ఒక తిరుగుబాటు సంస్థగా ముద్రవేసిన బుర్హాన్ వెంటనే దానిని రద్దు చేయాలని పట్టు బడుతున్నారు. మరోవైపు హెమెడ్తీ బుర్హాన్‌ను క్రిమినల్‌గా అభివర్ణిస్తున్నారు. బషారీ పాలన నుంచి విముక్తి పొందినా దేశంలో శాంతి స్థాపన జరగకపోవడానికి ఆయనే కారణమని నిందిస్తున్నారు. సూడాన్ ఆర్మీలో 3 లక్షల మంది సైనికులతో వైమానిక బలగం కూడా దాని సొంతం. ఆర్ఎస్ఎఫ్లో లక్ష మంది సైనికులే ఉన్నారు. అయితే ఆర్ఎస్ఎఫ్కు సూడాన్ పశ్చిమ ప్రాంతంలో గిరిజన తెగల అండదండలు ఉన్నాయి. అంతర్జాతీయ సమాజం కూడా ఇద్దరు బలవంతులు కొట్టుకుంటూ ఉంటే ఎలా స్పందించాలో తెలీక మౌనం వహిస్తోంది. మానవీయ సంక్షోభం రాకుండా చర్యలు తీసుకోవాలని వారికి సలహా ఇవ్వడం మినహా మరేమీ చేయలేకపోతోంది. సూడాన్ జనాభా: 4.6 కోట్లు కాల్పులు జరుగుతున్న ప్రాంతంలో నివసిస్తున్నవారు: 1.2 కోట్లు మానవీయ సాయం కావాల్సిన వారు: 1.6 కోట్ల ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న వారు: 1.17 కోట్లు – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇక్కడ ఆర్మీ చీఫే అత్యంత శక్తిమంతమైన వ్యక్తి: ఇమ్రాన్ ఖాన్
పాకిస్తాన్ రాజకీయాల్లో ఆర్మీ చీఫే అత్యంత శక్తిమంతమైన వ్యక్తి అని, అతని నిర్ణయాలే అందరూ అనుసరిస్తారని మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనను మళ్లీ అధికారంలోకి రాకుండా బహిష్కరించేందుకు అవినీతి మాఫియాకు మద్దతిస్తోందంటూ సైనిక వ్యవస్థపై మండిపడ్డారు. ఈ మేరకు ఖాన్ జమాన్ పార్క్ వద్ద ఉన్న తన నివాసం నుంచి తన మద్దతుదారులను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఈ వ్యాఖ్యలు చేశారు. దిగుమతి చేసుకున్న ప్రభుత్వాన్ని దించడం కోసం ప్రజలు సుప్రీం కోర్టుకి అండగా నిలబడాలని కోరారు. తాను అధికారంలోకి రాకూడదనే ఉద్దేశ్యంతోనే సైనిక వ్యవస్థ అవినీతి మాఫియా అయిన షరీఫ్‌లు, జర్దారీలకు అండగా ఉందని ఆరోపించారు. ఇమ్రాన్ ఖాన్ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో విభజనపై ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని దేశానికి పెను విషాదంగా అభివర్ణించారు. ఈ దిగుమతి చేసుకున్న ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానానికి చెడ్డపేరు తెచ్చే ప్రయత్నం చేస్తోందని, ఈ తరుణంలో సుప్రీం కోర్టుకు అండగా నిలవాలని దేశానికి విజ్ఞప్తి చేస్తున్నాని అన్నారు. ప్రస్తుతం పాక్‌లో ప్రజాస్వామ్యం సుప్రీం కోర్టు అనే దారంతో వేలాడుతోందని, అందువల్ల ప్రజాస్వామ్యాన్ని కోరుకునే వారందరూ దానికి అండగా నిలబడాలని చెప్పారు. ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానానికి వ్యతిరేకంగా కుట్రలు చేయడం మానేయాలని అన్నారు. మే 14న పంజాబ్‌లో ఎన్నికలు నిర్వహించాలన్న నిర్ణయాన్ని దిక్కరిస్తూ ఉంటే ఈద్ తర్వాత వీధుల్లోకి రావడానికి సిద్ధంగా ఉండాలని ఖాన్ పిలుపునిచ్చారు. ముందు నుంచి తాను దీనికి నాయకత్వం వహిస్తున్నట్లు కూడా ప్రకటించారు. అవినీతి పాలకులను అంగీకరించమని ప్రజలను బలవంతం చేయలేమనే విషయాన్ని సైనిక వ్యవస్థ గుర్తుపెట్టుకోవాలన్నారు. అలాగే ఒక దేశం పురోగమిస్తున్నప్పుడూ హింసాత్మక వ్యూహాలు పనిచేయవనే వాస్తవాన్ని గుర్తించుకోవాలి. ఇంతకుముందు తన పార్టీ నాయకులు, కార్యకర్తలు, మద్దతదారులను సైలంట్ చేసేలా హింసాత్మక కార్యకలాపాలకు దిగారని, ఐతే అవి పనిచేయలేదన్నారు. ఇక మీదట కూడా అవి పనిచేయవని నొక్కి చెప్పారు ఖాన్. తనను చంపడానికి కుట్ర జరుగుతోందని కూడా ఆరోపణలు చేశారు. ఇదిలా ఉండగా, పాకిస్తాన్ ముస్లీం లీగ్ నవాజ్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ ప్రసంగాలను ఏ ఎలక్ట్రానిక్ మీడియా ప్రసారం చేయకూడదని అప్రకటిత నిషేధం విధించడం గమనార్హం. (చదవండి: నల్లులు కారణంగా చనిపోయిన ఖైదీ..దర్యాప్తు చేస్తున్న అధికారులు) -
మహోజ్వల భారతి: దేవుడు, దాసుడు
బందా సింగ్ బహదూర్ (1670–1716) సిక్కు సైన్యాధ్యక్షుడు. మహా యోధుడు. లక్ష్మణ్ దేవ్, బందా బహదూర్, లక్ష్మణ్ దాస్, మాధవ్ దాస్ అనే పేర్లతోనూ ఆయన ప్రఖ్యాతి చెందారు. జమ్మూకశ్మీర్‌లోని రాజౌరి ఆయన జన్మస్థలం. పదిహేనవ యేట ఇల్లు విడిచి సన్యసించి, ‘మాధవ్ దాస్’ అన్న దీక్షానామం స్వీకరించారు. గోదావరి తీరంలోని నాందేడ్ ప్రాంతంలో ఒక మఠాన్ని స్థాపించారు. 1708 సెప్టెంబరులో ఆయన ఆశ్రమాన్ని గురు గోవింద సింగ్ సందర్శించారు. అనంతరం ఆయనకు మాధవ్ దాస్ శిష్యుడయ్యారు. ఆ సందర్భంగా బందా సింగ్ బహదూర్ అన్న పేరును గురు గోబింద్ సింగ్ పెట్టారు. గురు గోబింద్ సింగ్ ఇచ్చిన దీవెనలు, అధికారంతో బందా సింగ్ బహదూర్ ఓ సైన్యాన్ని తయారుచేసి, మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడారు. 1709 నవంబరులో మొఘల్ ప్రావిన్షియల్ రాజధాని సమానాను ముట్టడించి, విజయం సాధించి తన తొలి ప్రధాన విజయాన్ని నమోదు చేశారు. పంజాబ్‌లో అధికారాన్ని హస్తగతం చేసుకున్నాక జమీందారీ వ్యవస్థను రద్దుచేసి, సాగుచేసుకుంటున్న రైతులకే భూమిని పంచిపెట్టారు. 1716లో మొఘలులు ఆయన్ను బంధించి, చిత్రహింసలు పెట్టి చంపేశారు. రేపు (జూన్ 9) ఆయన వర్ధంతి. (చదవండి: స్వతంత్ర భారతి: భారత రత్నాలు) -
చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్
న్యూఢిల్లీ: చైనాతో సరిహద్దు వెంబడి అంగుళం భూ భాగాన్ని కూడా పొరుగు దేశానికి వదలబోమని ఆర్మీ కొత్త చీఫ్ జనరల్ మనోజ్ పాండే స్పష్టం చేశారు. యథాతథ స్థితిని మార్చేందుకు జరిగే ప్రయత్నాలను దీటుగా తిప్పికొడతామన్నారు. దేశం ముందున్న సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు అత్యున్నత స్థాయి ప్రమాణాలతో కూడిన కార్యాచరణ సంసిద్ధతకు ప్రాధాన్యమిస్తానన్నారు. ఆదివారం సౌత్‌బ్లాక్‌లో గౌరవవందనం స్వీకరించిన అనంతరం ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌధరి, నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరికుమార్‌తో కలిసి జనరల్ పాండే మీడియాతో మాట్లాడారు. ‘ప్రపంచ భౌగోళిక రాజకీయ పరిస్థితులు వేగంగా మారుతుండటంతో మనకు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. అందుకే, సమకాలీన, భవిష్యత్ సంక్షోభాలను తిప్పికొట్టేందుకు అత్యున్నతస్థాయి ప్రమాణాలతో కూడిన కార్యాచరణ సంసిద్ధతే నా ప్రథమ ప్రాధాన్యం. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ కలిసికట్టుగా ఎటువంటి పరిస్థితులనైనా సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయి. రక్షణ విషయంలో స్వావలంబన సాధించడంతోపాటు ఆర్మీ కార్యాచరణ సన్నద్ధతను మరింత విస్తృతం చేసేందుకు సంస్కరణలు, పునరి్నర్మాణంపై దృష్టి సారిస్తాను’ అన్నారు. ప్రస్తుత త్రివిధ దళాధిపతులు ముగ్గురూ నేషనల్ డిఫెన్స్ అకాడమీ 61వ బ్యాచ్‌లో కలిసి చదువుకున్నవాళ్లే కావడం విశేషం. నేవీ, ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌లు తన క్లాస్‌మేట్లేనని జనరల్ పాండే అన్నారు. త్రివిధ దళాల సమష్టి కార్యాచరణకు, సహకారానికి ఇది శుభారంభమన్నారు. ఇది కూడా చదవండి: అప్పుడే మోదీకి సపోర్ట్ చేశాం: సీఎం ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు -
భారత ఆర్మీకి కొత్త చీఫ్ ఖరారు
న్యూఢిల్లీ: భారత ఆర్మీకి కొత్త చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే నియామకం అయ్యారు. ఇందుకు సంబంధించి రక్షణ మంత్రిత్వ శాఖ సోమవారం ఒక అధికారిక ప్రకటన చేసింది. ప్రస్తుతం ఆర్మీ చీఫ్‌గా ఉన్న జనరల్ ఎంఎం నవరణె స్థానంలో పాండే బాధ్యతలు చేపట్టన్నన్నారు. బిపిన్ రావత్ మరణంతో ఖాళీ అయిన సీడీఎస్ పోస్ట్‌ను ప్రస్తుత ఆర్మీ చీఫ్ నవరణెతో భర్తీ చేస్తారనే ప్రచారం నడిచింది. అయితే నవరణె ఏప్రిల్ చివరినాటికి రిటైర్ కానున్నారు. ఈ నేపథ్యంలో ఆర్మీ కొత్త చీఫ్‌గా.. ప్రస్తుతం వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా ఉన్న మనోజ్ పాండే నియామకం ఖరారు అయ్యింది. విశేషం ఏంటంటే.. ఆర్మీ చీఫ్‌గా నియమితులు కాబోతున్న మొదటి ఇంజనీర్ మనోజ్ పాండేనే కావడం. అంతకు ముందు మనోజ్ పాండే.. ఈశాన్య రాష్ట్రాల సరిహద్దు దేశాల కమాండింగ్ సెక్షన్లో విధులు నిర్వహించారు. సుమారు 39 ఏళ్ల ఆర్మీ అనుభవం ఉన్న మనోజ్ పాండే.. ఏప్రిల్ 30న బాధ్యతలు స్వీకరించనున్నారు. -
కాబూల్ ఎయిర్‌పోర్టులోకి ఎంట్రీ.. వరుసలో ఆర్మీ మాజీ చీఫ్, నెటిజన్ల ఫైర్!
కాబూల్: అఫ్గనిస్తాన్ ఆర్మీ మాజీ చీఫ్ వలీ మహ్మద్ అహ్మద్‌జై దేశం విడిచి వెళ్లేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాబూల్ ఎయిర్‌పోర్టులో ప్రవేశం కొరకు మిగతా ప్రయాణికులతో కలిసి ఆయన వరుసలో నిల్చొని ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ‘‘మీరు కూడా పారిపోతే ఎలా? దేశంలోనే ఉంటూ పంజ్‌షీర్ వంటి రెసిస్టెన్స్ ఫ్రంట్‌కు అండగా నిలవవచ్చు కదా!’’ అని కొందరు సూచిస్తున్నారు. మరికొందరు మాత్రం.. ‘‘ఇలాంటి వాళ్ల అసమర్థ నాయకత్వం వల్లే తాలిబన్లు.. దేశాన్ని ఆక్రమించుకోగలిగారు’’ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక అఫ్గన్ తాలిబన్ల స్వాధీనం అయిన నేపథ్యంలో అమెరికా, మిత్ర దేశాలు చేపట్టిన తరలింపులో భాగంగా ఇప్పటికే ఎంతో మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్న సంగతి తెలిసిందే. ఆర్మీ చీఫ్‌గా పనిచేసిన వలీ సైతం అదే బాటలో నడవడం గమనార్హం. కాగా తాలిబన్ల విజృంభణ నేపథ్యంలో అఫ్గనిస్తాన్ మాజీ అధ్యక్షుడు అశ్రఫ్ ఘనీ.. గత నెలలో వలీని సైన్యాధిపతిగా తొలగించి, ఆయన స్థానంలో హిబాతుల్లా అలీజైని నియమించారు. అయితే, క్రమేణా ఆఫ్గన్ సైన్యంపై పైచేయి సాధించిన తాలిబన్లు ఆగష్టు 15న రాజధాని కాబూల్‌లో ప్రవేశించి దేశాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఈ క్రమంలో అశ్రఫ్ ఘనీ యూఏఈ పారిపోయి ఆశ్రయం పొందుతుండగా.. పలువురు ఇతర నేతలు సైతం దేశం విడిచి వెళ్లిపోయారు. ఇక అఫ్గనిస్తాన్‌లో నివాసం ఉంటున్న విదేశీయులు సహా అఫ్గన్ ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న దృశ్యాలు అక్కడి పరిస్థితికి అద్దం పడుతున్నాయి. చదవండి: Afghanistan Crisis: పాకిస్తాన్ వల్లే ఇదంతా.. ఇండియా మా ఫ్రెండ్.. Former Afghan Army Chief Wali Muhammad Ahmadzai is standing in line at Airport to leave the country. pic.twitter.com/SBaQ3QYmTZ — Megh Updates 🚨™ (@MeghUpdates) August 23, 2021 -
దేనికైనా సిద్ధంగా ఉన్నాం: నరవణే
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి ఉద్రిక్తత నెలకొందని, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు భారత బలగాలు సిద్ధంగా ఉన్నాయని ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం.నరవణే అన్నారు. కొన్ని ప్రాంతాల్లో వ్యూహాత్మక మోహరింపులు చేశామని, మన సరిహద్దులను, ప్రాదేశిక సమగ్రతను కాపాడటానికి పూర్తి సంసిద్ధులై ఉన్నామని తెలిపారు. దేశం తమపై పూర్తి విశ్వాసం ఉంచవచ్చన్నారు. లద్దాఖ్‌లో నరవణే శుక్రవారం రెండోరోజు పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. పలు ఆర్మీ పోస్టులను సందర్శించి... సైనికులు, సీనియర్ కమాండర్లతో మాట్లాడారు. అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ‘మన సైనికులు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. దేశ భౌగోళిక సమగ్రతను కాపాడటానికి వారు పూర్తి సంసిద్ధంగా ఉన్నారనే విశ్వాసం నాకు కలిగింది’అని చెప్పారు. ఉద్రిక్తతలను తగ్గించడానికి దౌత్యపరమైన చర్చలతో సహా అన్ని మార్గాలను ఉపయోగించుకుంటామన్నారు. ఐదురోజుల కిందట తూర్పు లద్ధాఖ్లోని పాంగాంగ్ సరస్సు దక్షిణతీరంలో చైనా దుస్సాహసంతో అతిక్రమణకు దిగగా... భారత సైన్యం గట్టిగా తిప్పికొట్టిన విషయం తెలిసిందే. వేగంగా స్పందించిన భారత్ అదనపు బలగాలను, ఆయుధ సామగ్రిని ఈ ప్రాంతానికి తరలించి పాంగాంగ్ సరస్సు దక్షిణతీరంలోని కీలక పర్వత ప్రాంతాల్లో మోహరించింది. ఫింగర్ 2, ఫింగర్ 3 ప్రాంతాల్లో ఆర్మీపోస్టులను బలోపేతం చేసింది. కమాండర్ల చర్చల్లో దీనిపై చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయగా... తమ భూభాగంలోనే మోహరించామని, వెనక్కితగ్గే ప్రసక్తేలేదని భారత్ తేల్చిచెప్పింది. దశాబ్దాల్లో అతిపెద్ద సవాల్: ష్రింగ్లా లద్దాఖ్‌లో ఉద్రిక్తతలు గడిచిన కొన్ని దశాబ్దాల్లో మనం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్‌గా భారత విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా అభివర్ణించారు. దేశ భౌగోళిక సమగ్రతను, సార్వభౌమాధికారాన్ని కాపాడటానికి పూర్తి కంకణబద్ధులమై ఉన్నామని తెలిపారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవడానికి సిద్ధమని, అన్నిరకాలుగా ప్రయత్నం చేస్తున్నామన్నారు. మరో దఫా మిలిటరీ చర్చలు భారత్– చైనాల మధ్య మరోదఫా మిలిటరీ చర్చలు జరిగాయి. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గించడానికి తూర్పు లద్దాఖ్‌లోని చుషుల్‌లో శుక్రవారం బ్రిగేడ్ కమాండర్ స్థాయి చర్చలు జరిగాయి. చర్చల్లో పురోగతి ఏంటనేది వెంటనే తెలియరాలేదు. -
సరిహద్దు వివాదం: ఆర్మీచీఫ్ క్షేత్రస్థాయి పర్యటన
సాక్షి, న్యూఢిల్లీ : చైనాతో సరిహద్దు ఉద్రికత్తలు తీవ్రమవడంతో క్షేత్రస్ధాయి పరిస్థితులను సమీక్షించేందుకు ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె మంగళవారం లేహ్, కశ్మీర్‌లను సందర్శిస్తారని సమాచారం. బలగాల సన్నద్ధతతో పాటు చైనా, పాకిస్తాన్ సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖల వెంబడి దళాల మోహరింపును ఆర్మీ చీఫ్ సమీక్షిస్తారు. తూర్పు లడఖ్‌లోని గల్వాన్ లోయలో గత వారం భారత్-చైనా సైనికుల ఘర్షణలతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో జనరల్ నరవణే లేహ్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా నరవణే సోమవారం ఢిల్లీలో ఉన్నత సైనికాధికారులతో భద్రత పరిస్థితిపై చర్చించారు. కమాండర్ల సదస్సు సందర్భంగా సైనికాధికారులు, కమాండర్లు దేశ రాజధానిలో అందుబాటులో ఉన్నారు. మరోవైపు సరిహద్దు వివాద పరిష్కారానికి, తూర్పు లడఖ్‌లో ఉద్రిక్తతలను తగ్గించేందుకు చైనా భూభాగంలోని మోల్దో-చుసుల్ లోయలో ఇరు దేశాల కార్ప్స్ కమాండర్ల చర్చలు కొనసాగుతున్నాయి. చదవండి : నోరువిప్పిన చైనా.. కమాండర్ మృతి! -
భారత్‌పై నేపాల్ అభ్యంతరం.. చైనా ప్రమేయం!
న్యూఢిల్లీ: సరిహద్దు ప్రాంతంలో భారత్ చేపట్టిన రోడ్డు నిర్మాణంపై నేపాల్ అభ్యంతరం లేవనెత్తడం వెనుక చైనా ప్రమేయం ఉన్నట్లు భారత ఆర్మీ చీఫ్ ఎంఎం నరవాణే సందేహం వ్యక్తం చేశారు. భారత్ పట్ల నేపాల్ నిరసన వైఖరి ఎందుకు ప్రదర్శిస్తుందో తనకు అర్థంకావడం లేదన్నారు. తాజా పరిణామాలు చూస్తుంటే... వేరొకరి తరఫున ఆ దేశం వకాల్తా పుచ్చుకున్నట్లుగా కనిపిస్తుందని పేర్కొన్నారు. భారత్‌తో చైనా ప్రచ్చన్న యుద్ధంలో ఇదొక భాగమేనన్న సంకేతాలు ఇచ్చారు. కాగా భారత్- చైనా సరిహద్దులో గల లిపూలేఖ్ వెంబడి భారత ప్రభుత్వం ఇటీవల రహదారి నిర్మాణం చేపట్టింది. ఇందుకు అభ్యంతరం తెలిపిన నేపాల్ ప్రభుత్వం లిపులేఖ్ తమ భూభాగానికి చెందినదే అని ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు ఆ దేశంలోని భారత రాయబారికి నోటీసులు సైతం పంపింది.(భారత్, చైనాలతో చర్చించేందుకు సిద్ధం: నేపాల్) ఇక ఈ విషయం గురించి నేపాల్ విదేశాంగ మంత్రి ప్రదీప్ గ్యావాలి మాట్లాడుతూ... లిపూలేఖ్ నేపాల్, భారత్, చైనా ట్రై జంక్షన్లో ఉందని.. ఈ విషయం గురించి భారత్‌తో పాటు చైనాతో చర్చిస్తామని వెల్లడించారు. ఈ నేపథ్యంలో మనోహర్ పారికర్ ఇన్స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలసిస్‌తో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన జనరల్ నరవాణే.. ‘‘కాళీ నది తూర్పు ప్రాంతం నేపాల్‌లో ఉంది. భారత్ చేపట్టిన రహదారి నిర్మాణం నది పశ్చిమ ప్రాంతంలో ఉంది. ఈ విషయంలో వారికి అభ్యంతరం ఏముందో తెలియడం లేదు. వేరొకరి వాదనను వీరు వినిపిస్తున్నారేమో’’అని పేర్కొన్నారు. (తైవాన్‌పై చైనా పెత్తనం.. భారత్ సాయం కావాలి!) అదే విధంగా ఇండో- చైనా సరిహద్దుల్లో ఇరు దేశాల సైనికుల ఘర్షణ గురించి కూడా నరవాణే ఈ సందర్భంగా స్పందించారు. లఢఖ్, సిక్కిం సరిహద్దుల్లో చోటుచేసుకున్న పరిణామాలు తీవ్రంగా పరిగణించదగ్గవి కాదన్నారు. రోజుకు పదిసార్లు ఇరు వర్గాలు తారసపడతాయని.. ఇలాంటి ఘటనలు అక్కడ సాధారణంగా జరుగుతూనే ఉంటాయని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో కమాండర్లను మార్చినపుడు.. కొత్త వాళ్లతో గొడవకు దిగే అవకాశాలు ఉంటాయని వ్యాఖ్యానించారు. (సరిహద్దుల్లో ఉద్రిక్తత: చైనా స్పందన) -
శ్రీలంక ఆర్మీచీఫ్‌కు అమెరికా షాక్
వాషింగ్టన్: శ్రీలంక ఆర్మీ చీఫ్ షవేంద్ర సిల్వను అమెరికాలోకి అనుమతించబోమని ఆ దేశ విదేశాంగ మంత్రి మైక్ పాంపియో చెప్పారు. 2009 అంతర్యుద్ధంలో భారీగా మానవహక్కుల ఉల్లంఘనలకు అతడు పాల్పడినట్లు తమ వద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని చెప్పారు. ఆయా ఆధారాలను ఐక్యరాజ్యసమితి సహా పలు సంస్థలు కూడా గుర్తించాయని అన్నారు. షవేంద్రతో పాటు అతడి కుటుంబ సభ్యులు కూడా అమెరికాలో ప్రవేశించేందుకు అనర్హులని చెప్పారు. శాంతిని, మానవ హక్కులను పెంపొందించాలంటూ శ్రీలంక ప్రభుత్వానికి అమెరికా సూచించింది. (చదవండి: సీక్రెట్ చెప్పేసిన ప్రపంచ కురు వృద్దుడు) -
ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలను సమర్థించిన శివసేన!
ముంబై: పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) భూభాగం భారత్ స్వాధీనంలోకి రావాలని పార్లమెంటు భావిస్తే.. ఆ దిశగా చర్యలు చేపడతామన్న ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణే వ్యాఖ్యలను శివసేన సమర్థించింది. తుక్డే-తుక్డే గ్యాంగ్(వామపక్షాలు, వారికి మద్దతు తెలిపే వారిపై విమర్శల దాడి చేయడానికి బీజేపీ, రైట్ వింగ్ సభ్యులు తరచూ ఉపయోగించే పదం) అంటూ విమర్శలకు దిగే బదులు ఆర్మీ చీఫ్‌కు ఆదేశాలు జారీ చేయవచ్చు కదా అని బీజేపీపై వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ఈ మేరకు..‘జనరల్ వ్యాఖ్యల్లో తప్పేం లేదు. పీఓకేలో చాలా వరకు ఉగ్రవాద క్యాంపులు ఉన్నాయి. పాకిస్తాన్ సైన్యం, ఐఎస్ఐ మద్దతుతో ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. అందుకే నరవాణే కొత్త విధానాన్ని మేం స్వాగతిస్తున్నాం. 1994 ఫిబ్రవరిలో జమ్మూ కశ్మీర్, పీఓకే భారత్‌లో అంతర్భాగమేనని పార్లమెంటు తీర్మానం చేసిందని నరవాణే చెప్పారు. అయితే కేంద్ర ప్రభుత్వం తుక్డే తుక్డే గ్యాంగ్ అంటూ విమర్శలు చేయడంపైనే ఎక్కువ దృష్టి సారిస్తోంది. దానికి బదులు ఆర్మీ చీఫ్‌నకు భారత్ పటం ఇచ్చి ఆదేశాలు జారీ చేస్తే బాగుంటుంది’ అని తన అధికార పత్రిక సామ్నాలో శివసేన కథనం వెలువరించింది.(పార్లమెంటు ఓకే అంటే పీఓకేనూ సాధిస్తాం) అదే విధంగా పీఓకేపై భారత్ జరిపిన మెరుపు దాడులను ప్రస్తావిస్తూ... ఎన్ని దాడులు జరిగినా పాకిస్తాన్ తన అలవాట్లను మార్చుకోలేదని శివసేన విమర్శించింది. ఆర్టికల్ 370ని రద్దు చేసి కేంద్రం మంచి పని చేసిందని.. ఇప్పుడు నరవాణే కోరినట్లు పీఓకేపై కూడా నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ‘ మోదీ- షా నుంచి నరవాణేకు ఆదేశాలు అందిన వెంటనే పీఓకే మనదైపోతుంది. అప్పుడు అఖండ భారత్‌ను కోరుకున్న వీర్ సావర్కర్ విగ్రహం పూలమాలలతో నిండిపోతుంది. కాబట్టి ప్రధాని మోదీ వెంటనే నరవాణేకు వెంటనే ఆదేశాలు ఇవ్వాలి. భారత ప్రజలంతా ఇదే కోరుకుంటున్నారు’ అని శివసేన కథనంలో పేర్కొంది. -
సియాచిన్‌లో ఆర్మీ చీఫ్
-
‘సరిహద్దు’పై ఆర్మీ చీఫ్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ : చైనాతో సరిహద్దు సమస్యలకు త్వరలోనే శాశ్వత సానుకూల పరిష్కారం లభిస్తుందని నూతన ఆర్మీ చీఫ్ జనరల్ ముకుంద్ నరవనే ఆశాభావం వ్యక్తం చేశారు. రెండు ప్రధాన దేశాలతో భారత్ సరిహద్దులు పంచుకుంటోందని..ఇరు దేశాలూ సమాన ప్రాధాన్యత కలిగినవేనని ఆయన అన్నారు. గతంలో మనం పశ్చిమ ప్రాంతంవైపే దృష్టిసారించామని, ఉత్తర ప్రాంతం కూడా అంతే ప్రాధాన్యత కలిగిఉందని గుర్తెరగాలన్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ స్వాధీనంపై రాజకీయ నేతలు తరచూ చేస్తున్న ప్రకటనలపై స్పందిస్తూ అన్ని సవాళ్లు, వ్యూహాలపై సైన్యం విశ్లేషిస్తుందని, ఇది నిరంతర ప్రక్రియ అని జనరల్ నరవనే పేర్కొన్నారు. సేనల ఆధునీకరణ ప్రణాళికలకు కీలక ప్రాధాన్యత ఇస్తామని చెప్పుకొచ్చారు. సవాళ్లకు అనుగుణంగా దీర్ఘకాల వ్యూహాలతో ముందుకెళతామని, సేనలకు ఎదురయ్యే సవాళ్లలో మార్పులకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తామని అన్నారు. కాగా సీడీఎస్‌గా బాధ్యతలు చేపట్టిన జనరల్ బిపిన్ రావత్ స్ధానంలో దేశ 28వ ఆర్మీ చీఫ్‌గా జనరల్ నరవనే మంగళవారం నూతన బాధ్యతలు స్వీకరించారు. -
నూతన ఆర్మీ చీఫ్ నరవాణే కీలక వ్యాఖ్యలు..
న్యూఢిల్లీ: నూతన ఆర్మీ చీఫ్‌గా మనోజ్ ముకుంద్ నరవాణే బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఓ జాతీయ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ..ఉగ్రవాదులకు మద్దతిస్తున్న పాకిస్తాన్‌ను కట్టడి చేయడానికి భారత్ వద్ద పకడ్బందీ వ్యూహాలు ఉన్నాయని పేర్కొన్నారు. భారత్ చేపట్టిన దాడుల్లో పెద్ద ఎత్తున ఉగ్రవాదులు హతమవ్వడం పాక్ ఆర్మీకి పెద్ద ఎదురుదెబ్బ అని తెలిపారు. చైనా సరిహద్దులో బధ్రతా వ్యవస్థను మరింత పటిష్టం చేయనున్నామని తెలిపారు. ఉగ్రవాదులపై పాక్ చూపిస్తున్న అలసత్వానికి ప్రపంచ దేశాలు కూడా పాక్‌కు దూరమైన విషయం తెలిసిందే. ఉగ్రవాదం ఏ విధంగా నష్టదాయకమొ ప్రపంచ దేశాలు గ్రహించాయని తెలిపారు. దేశంలో భద్రత వ్యవస్థను పటిష్టం చేసి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఆర్మీని సిద్దం చేయడమే తమ లక్ష్యమని..మానవ హక్కులను కాపాడడానికి ప్రత్యేక దృష్టి సారిస్తామని ముకుంద్ నరవాణే తెలిపారు. బిపిన్ రావత్ నుంచి నూతన ఆర్మీ చీఫ్‌గా మంగళవారం మనోజ్ ముకుంద్ నరవాణే బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. -
'సీడీఎస్‌గా భవిష్యత్ వ్యూహాలు రచిస్తా
-
'సీడీఎస్‌గా భవిష్యత్ వ్యూహాలు రచిస్తా: బిపిన్ రావత్'
న్యూఢిల్లీ: దేశ తొలి త్రివిధ దళాధిపతిగా జనరల్ బిపిన్ రావత్ నియమితులయ్యారు. జనరల్ బిపిన్ రావత్‌ను సీడీఎస్‌గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. సీడీఎస్ హోదాలో ఆయన కొత్తగా ఏర్పాటయ్యే సైనిక వ్యవహారాల విభాగానికీ నాయకత్వం వహిస్తారు. అంతకుముందు ఆయన ఆర్మీ చీఫ్‌గా పదవీ విరమణ చేశారు. సీడీఎస్‌గా నియమితులైన బిపిన్ రావత్ సైనికుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్త పదవితో తనపై మరిన్ని బాధ్యతలు పెరిగాయని అన్నారు. 28వ ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టనున్న నవరాణేకు రావత్ అభినందనలు తెలిపారు. కాగా, రావత్ మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. చదవండి: సీఏఏకు తొలి షాక్.. కేరళ అసెంబ్లీలో తీర్మానం ప్రస్తుతం ఆయన స్థానంలో ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ ముకుంద్ నవరాణే బాధ్యతలు చేపట్టనున్నారు. పాక్, చైనా సరిహద్దుల వద్ద సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత ఆర్మీ సిద్ధంగా ఉందని బిపిన్ తెలిపారు. ఇవాళే ఆర్మీ చీఫ్‌గా రిటైర్ అయ్యాను, ఆర్మీ చీఫ్‌గా ఎన్నో బాధ్యతలు ఉంటాయి, ఇన్నాళ్లూ వాటిమీదే దృష్టి పెట్టాను. అయితే సీడీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన పాత్రపై కొత్త వ్యూహాన్ని రచించనున్నట్లు ఆయన తెలిపారు. 1978 డిసెంబర్లో ఆర్మీలో చేరిన బిపిన్ రావత్ 2017 జనవరి 1 నుంచి నేటి వరకు ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. కాగా.. కేంద్రం సీడీఎస్ పదవిని సృష్టించేందుకు భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఇటీవల సీడీఎస్ పదవికి ఆమోదం తెలిపింది. త్రివిధ దళాలకు సంబంధించిన అన్ని అంశాలపై రక్షణ మంత్రికి ఏకైక సలహాదారుగా సీడీఎస్ వ్యవహరిస్తారు. చదవండి: '3కోట్ల మంది కస్టమర్లను కోల్పోయిన వొడాఫోన్ ఐడియా' -
మీ పని మీరు చూసుకోండి
తిరువనంతపురం: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా ప్రజలు, విద్యార్థులు చేస్తున్న నిరసనలను ఉద్దేశించి ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పి.చిదంబరం మండిపడ్డారు. తిరువనంతపురంలో నిరసన ర్యాలీలో చిదంబరం మాట్లాడారు. ‘రాజకీయ నాయకులుగా మేమేం చేయాలో మాకు తెలుసు. ఆర్మీ చీఫ్‌గా మీ పని మీరు చూసుకోండి. యుద్ధంలో ఎలా పోరాడాలో మేం మీకు చెబుతున్నామా? మీ ఆలోచనల ప్రకారం మీరు యుద్ధం చేయండి. రాజకీయ నాయకులుగా మా పని మేం చేస్తాం’అని స్పష్టం చేశారు. -
‘బాలాకోట్’ దాడులపై మళ్లీ అనుమానాలు
సాక్షి, న్యూఢిల్లీ : ఈ ఏడాది మొదట్లో పాకిస్థాన్‌లోని బాలాకోట్‌లోకి భారత వైమానికి దళం చొచ్చుకుపోయి ధ్వంసం చేసిన ఉగ్రవాద శిబిరాన్ని ఉగ్రవాదులు ఇటీవల పునుద్ధరించుకున్నారని భారత సైనిక చీఫ్ బిపిన్ రావత్ సోమవారం చేసిన వ్యాఖ్యలపై పలు అనుమానాలు రేగుతున్నాయి. అసలు ఆ రోజున ఉగ్రవాదుల శిబిరం ఏ మేరకు ధ్వంసమయింది? అన్న అనుమానం నేడే కాదు, దాడులు జరిగిన రోజే కలిగాయి. అంతకుముందు, ఆ తర్వాత అంతర్జాతీయ శాటిలైట్లు తీసిన చిత్రాలను కూడా కొన్ని ఆంగ్ల వెబ్సైట్లు ఉదహరిస్తూ భారత వైమానిక దళం దాడులు గురితప్పాయని ఆరోపించాయి. ఆ ఆరోపణలను, ఆ విమర్శలను భారత ప్రభుత్వ వర్గాలు నిర్ద్వంద్వంగా ఖండించాయి. తాజాగా చెన్నైలోని సైనిక అధికారుల శిక్షణా అకాడమీలో బిపిన్ రావత్ మాట్లాడుతూ నాడు భారత ధ్వంసం చేసిన ఉగ్రవాదుల శిబిరాన్ని వారు మళ్లి పునరుద్ధరించుకొని కార్యకలాపాలు సాగిస్తున్నారని చెప్పడం ఎంత మేరకు నిజం? పాకిస్థాన్‌లోని టెర్రరిస్టులకు కోలుకోని దెబ్బపడిందని, బాలాకోట్‌లోని వారి శిబిరాన్ని సమూలంగా నాశనం చేశామంటూ నాడు ప్రభుత్వ వర్గాలు ప్రకటించడంలో నిజం లేదా? ఈ రెండు నిజం అవడానికి ఆస్కారం లేదు. అలాంటప్పుడు ఒక్కటే నిజం కావాలి? 2016లో భారత సైనికులు పాకిస్థాన్ భూభాగంలోకి చొచ్చుకుపోయి సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా టెర్రరిస్టు లాంఛింగ్ పాడ్లను ధ్వంసం చేసినట్లు చెప్పారు. అప్పుడు కూడా సైనిక వర్గాలుగానీ, ప్రభుత్వ వర్గాలుగానీ అందుకు సరైన సాక్ష్యాలు చూపించలేక పోయాయి. మళ్లీ ఈసారి కూడా బాలాకోట్ లాంటి దాడులు జరిపి భారత సైనిక వర్గాలు నెగ్గుకు రావాలంటే చాలా కష్టం. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న రాజ్యాంగంలోని 370వ అధికరణను రద్దు చేసిన నేపథ్యంలో భారత్, పాక్ దేశాల మధ్య ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల కారణంగా పాక్ సరిహద్దుల్లో పాక్ సైనిక భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోపక్క కశ్మీర్ మిలిటెంట్లు ఉగ్రదాడులకు అవకాశాలు వెతుకుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో భారత్ సర్జికల్ దాడులు నిర్వహించలేదు. (చదవండి: బాలాకోట్ ఉగ్రశిబిరం మొదలైంది) -
బాలాకోట్ మళ్లీ యాక్టివేట్ అయింది: ఆర్మీ చీఫ్
చెన్నై: పాకిస్థాన్ బాలాకోట్‌లోని ఉగ్రవాద స్థావరాలు మళ్లీ ఇటీవల యాక్టివేట్ అయ్యాయని, దాయాది దేశం వీటిని యాక్టివేట్ చేసిందని భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ వెల్లడించారు. పూల్వామా ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా గత ఫిబ్రవరిలో బాలాకోట్‌లోని జైషే మహమ్మద్ సంస్థ ఉగ్రవాద స్థావరాలను భారత వైమానిక దళం ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ‘పాకిస్థాన్ ఇటీవలే బాలాకోట్‌ను యాక్టివేట్ చేసింది. బాలాకోట్‌లోని ఉగ్రవాద స్థావరాలు దెబ్బతిని, ధ్వంసమైన విషయాన్ని ఇది చాటుతోంది. భారత వైమానిక దళాలు జరిపిన దాడిలో బాలాకోట్ ధ్వంసమైన సంగతిని ఇది చాటుతోంది. ఇప్పుడు మళ్లీ ప్రజలు అక్కడికి చేరుకుంటున్నారు’ అని రావత్ పేర్కొన్నారు. చెన్నైలో యంగ్ లీడర్స్ ట్రైనింగ్ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. సరిహద్దుల్లో దాదాపు 500 మంది ఉగ్రవాదులు ఉన్నారని, వారు భారత్‌లో చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన వివరించారు. కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూ పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పడటంపై రావత్ స్పందిస్తూ.. ఉగ్రవాదులు చొరబాటుకు వీలుగా పాక్ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతోందని, దీనిని ఎలా ఎదుర్కోవాలో భారత్ సైన్యానికి తెలుసునని అన్నారు. -
ఇథియోపియా ఆర్మీ చీఫ్ హత్య
అదిస్ అబాబా: ఇథియోపియా సైన్యాధిపతి సియరే మెకొన్నెన్ హత్యకు గురయ్యారు. మెకొన్నెన్ అంగరక్షకుల్లో ఒకరు ఆయనను ఇంటిలోనే కాల్చి చంపారని ప్రభుత్వ ప్రతినిధి బిలెనె సియోమ్ తెలిపారు. ఈ ఘటన జరగడానికి కొన్ని గంటల ముందు ఉత్తరాన గల అంహరలో స్వయంప్రతిపత్తి మండలి ప్రభుత్వాన్ని (అటానమస్ రీజన్)కూల్చివేసేందుకు విఫలయత్నం జరిగిందని, ఆ సందర్భంగా జరిగిన కాల్పుల్లో అంహర అధ్యక్షుడు అంబచ్యూ మెకనెన్ చనిపోయారని, పలువురు గాయపడ్డారని ఆమె చెప్పారు. అయితే, ఈ రెండు ఘటనలకు సంబంధం ఉన్నదీ లేనిదీ ఇప్పుడే చెప్పలేమన్నారు. అంహర రాజధాని బహిర్ దార్లో శనివారం మధ్యాహ్నం అధ్యక్షుడు అంబచ్యూ ఉన్నతాధికారులతో సమావేశం జరుపుతుండగా, సైన్యాధికారి అసమిన్యూ నాయకత్వంలో కొందరు వారిపై దాడి చేశారు. ఆ సందర్భంగా జరిగిన కాల్పుల్లో అంబచ్యూతో పాటు ఆయన సలహాదారుడు కూడా చనిపోయారు .అసమిన్యూ తప్పించుకున్నారని ప్రభుత్వం తెలిపింది.ఈ ఘటన జరిగిన కొన్ని గంటలకు మెకొన్నెన్ హత్య జరిగింది. ఆ సమయంలో సైన్యాధిపతితో ఉన్న రిటైర్డ్ సైన్యాధికారి కూడా చనిపోయారు. హంతకుడిని అదుపులోకి తీసుకున్నట్టు ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు. గతంలో ప్రభుత్వంపై తిరుగుబాటు చేసినందుకుగాను అసమిన్యూ అరెస్టయ్యారు. గత ఏడాదే క్షమాభిక్ష కింద విడుదలయ్యారని స్థానిక మీడియా పేర్కొంది. రాజధానిలో కొన్ని గంటల పాటు కాల్పులు జరిగాయని విదేశీ జర్నలిస్టు ఒకరు తెలిపారు. విదేశీ దౌత్యవేత్తలు, అంతర్జాతీయ సంస్థలు ఉండే బోలె జిల్లాలో మెకొన్నెన్ హత్య జరగడంతో ఆయా దేశాలు తమ సిబ్బందిని అప్రమత్తం చేశాయి. అంహరలో పరిస్థితి ప్రస్తుతం పూర్తిగా అదుపులో ఉందని ప్రధాని కార్యాలయం ప్రకటించింది. జనాభా రీత్యా ఆఫ్రికాలో రెండో పెద్ద దేశమైన ఇధియోపియా ఆర్థికంగా ఎదుగుతోంది. ఏడాది క్రితం ప్రధాని పగ్గాలు చేపట్టిన అబి అహ్మద్ పలు సంస్కరణలు చేపట్టారు. అందులో భాగంగా రాజకీయ ఖైదీలను విడుదల చేశారు. రాజకీయ పార్టీలపై నిషేధాన్ని ఎత్తివేశారు. మానవ హక్కులను ఉల్లంఘించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకున్నారు. సైన్యానికి, నిఘా విభాగాలకు ఈ సంస్కరణలు రుచించకపోవడంతో వారు ప్రధానికి శత్రువులుగా మారారు. మరోవైపు అంహరా సహా దేశంలో చాలా ప్రాంతాల్లో తీవ్రమవుతున్న జాతి పోరాటాలు ప్రభుత్వానికి ఇబ్బందులు కలిగిస్తున్నాయి. దేశంలో ఒరోమో, అంహర తెగల ప్రజలు అత్యధికంగా ఉన్నారు. ప్రత్యర్థిపై పోరాటానికి సిద్దంగా ఉండాల్సిందిగా గత వారం అసమిన్యూ అంహర తెగ ప్రజలకు పిలుపునిచ్చారు. దేశంలో అంహర సహా తొమ్మిది అటానమస్ రీజన్లు ఉన్నాయి. సరిహద్దు విషయంలో ఈ మండళ్లలో తెగల మధ్య ఘర్షణలు చెలరేగుతున్నాయి. ఏ తెగకు ఆ తెగ స్వపరిపాలనకు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఘర్షణలు జరుగుతున్నాయి.