సందీప్ దీక్షిత్ వ్యాఖ్యలపై స్పందించిన రాహుల్
బెంగళూరు : ఆర్మీ చీఫ్‌పై సందీప్ దీక్షిత్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ ఆర్మీతో రాజకీయాలు చేయడం సరికాదని, దేశం కోసం సైనికులు పని చేస్తున్నారన్నారు. ఆర్మీ చీఫ్, సైనికుల జోలికి వెళ్లడం మంచిది కాదని రాహుల్ అభిప్రాయపడ్డారు.
మరోవైపు తాను చేసిన వ్యాఖ్యలను సందీప్ దీక్షిత్ ఉపసంహరించుకున్నారు. కాగా ఆయన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. తక్షణమే సందీప్ దీక్షిత్‌ను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసి, సోనియా, రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.