Sandeep Dikshit
-
సార్వత్రిక ఎన్నికల్లో భారీ ఎత్తున అవకతవకలు
-
పాక్ బద్ధ శత్రువు.. ఒప్పందాలు ఎందుకు?
సాక్షి, న్యూఢిల్లీ : యూరీ ఘటనకు ప్రతీకారంగా భారత ఆర్మీ నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్ అంశాన్ని మళ్లీ కాంగ్రెస్ పార్టీ తెరపైకి తెచ్చి ఆరోపణలు గుప్పించింది. అదంతా ఓ పెద్ద డ్రామాగా అభివర్ణిస్తోంది. పుల్వామా ఎన్కౌంటర్ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సందీప్ దీక్షిత్ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ‘‘విజయవంతంగా సర్జికల్ స్ట్రైక్స్ చేశామని ఎన్డీఏ ప్రభుత్వం, ప్రధాని గర్వంగా చెప్పుకుంటున్నారు. కానీ, ఇప్పుడు జరిగిన పుల్వామా ఎన్కౌంటర్ అదంతా డ్రామాగా తేల్చేసింది. ఉగ్రవాదం విషయంలో పాకిస్థాన్ కట్టిడి చేసేందుకు ఈ ప్రభుత్వం చేపడుతున్న చర్యలేవీ సత్ఫలితాలను ఇవ్వటం లేదు. పైగా పాకిస్థాన్ బద్ధ శత్రువంటూ ఓ వైపు ప్రకటనలు ఇస్తూ.. మరోవైపు వారితో చర్చలు, ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఇదంతా ఎందుకు? బీజేపీ హయాంలో దేశ రక్షణ ప్రశ్నార్థకంగా మారింది. ప్రజలు అభద్రతా భావంతో ఉన్నారు’’ అంటూ దీక్షిత్ పేర్కొన్నారు. కాగా, అవంతిపూర్ సెంటర్ ట్రైనింగ్ వద్ద శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఎన్కౌంటర్లో ఐదుగురు జవాన్లు అమరులు కాగా, ముగ్గురు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. ఇంకా ఎవరైనా ఉగ్రవాదులు దాగున్నారేమోనన్న అనుమానంతో తనిఖీలు చేపట్టినట్లు సీఆర్పీఎఫ్ స్పెషల్ డీజీ ఎస్ఎన్ శ్రీవాస్తవ తెలిపారు. -
‘ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలే ఆజ్యం పోశాయి’
న్యూఢిల్లీ: భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ’వీధి గుండా’లా వ్యవహరిస్తున్నాంటూ కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన నేపథ్యంలో దీనిపై సీపీఎం నేత బృందా కారత్ స్పందించారు. సోమవారం ఢిల్లీలోని సీపీఎం ప్రధాన కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. సందీప్ దీక్షిత్ ఇప్పటికే క్షమాపణలు చెప్పారని, అయితే ఒక నిర్దిష్ట సందర్భాన్ని ఉద్దేశించే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని, క్షమాపణ చెప్పడంతో ఆ వ్యవహారం ముగిసిపోయిందని అన్నారు. అయితే బిపిన్ రావత్ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉండటం వల్లే వివాదం చెలరేగిందన్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ద్వారా తన పదవికి ఉన్న గౌరవాన్ని ఆయన తగ్గించినట్టయిందని, మన సైన్యానికి సంబంధించిన అంశాల విషయంలో ఆయన సంయమనంతో వ్యవహరించాల్సి ఉందని బృందాకారత్ అభిప్రాయపడ్డారు. బిపిన్ రావత్ రెండ్రోజుల క్రితం మాట్లాడుతూ, పాకిస్థాన్‌తో పాటు దేశంలోని ఉగ్రవాదులు, తీవ్రవాదులను సమర్ధవంతంగా ఎదుర్కోగలమన్న అర్ధంలో రెండున్నర యుద్ధాలకు (టూ అండ్ ఆఫ్ వార్ ఫ్రంట్)కు సిద్ధంగా ఉన్నామని అన్నారు. దీనిపై సందీప్ దీక్షిత్ స్పందిస్తూ, రావత్ వ్యాఖ్యలు ఓ వీధి గూండాను తలపిస్తున్నాయని ఆరోపించారు. ఆ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేగడంతో సందీప్ దీక్షిత్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటూ క్షమాపణలు చెప్పారు. అయినప్పటికీ ఈ దుమారం తగ్గలేదు. పేరున్న ఓ కాంగ్రెస్ నేత నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మండిపడ్డారు. దీంతో సందీప్ దీక్షిత్ మరోసారి క్షమాపణలు చెప్పారు. తాను ఎలాంటి అనాగరిక భాష ఉపయోగించలేదని, బిపిన్ రావత్ మరోలా మాట్లాడాల్సి ఉందని చెప్పడమే తన ఉద్దేశమని వివరణ ఇచ్చారు. -
సందీప్ దీక్షిత్ వ్యాఖ్యలపై స్పందించిన రాహుల్
బెంగళూరు : ఆర్మీ చీఫ్‌పై సందీప్ దీక్షిత్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ ఆర్మీతో రాజకీయాలు చేయడం సరికాదని, దేశం కోసం సైనికులు పని చేస్తున్నారన్నారు. ఆర్మీ చీఫ్, సైనికుల జోలికి వెళ్లడం మంచిది కాదని రాహుల్ అభిప్రాయపడ్డారు. మరోవైపు తాను చేసిన వ్యాఖ్యలను సందీప్ దీక్షిత్ ఉపసంహరించుకున్నారు. కాగా ఆయన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. తక్షణమే సందీప్ దీక్షిత్‌ను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసి, సోనియా, రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. -
‘అలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సింది’
న్యూఢిల్లీ : తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో కాంగ్రెస్ పార్టీ నేత, ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ వెనక్కి తగ్గారు. ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. తన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో సందీప్ క్షమాపణలు చెప్పారు. తాను అలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా ‘మాఫియాలాగా హెచ్చరికలు చేసే పాక్ సైన్యానికి మన ఆర్మీకి తేడా ఉంది. మన ఆర్మీ చీఫ్(రావత్) వీధి రౌడీలా మాట్లాడుతుంటే వినడానికి ఇబ్బందిగా ఉంది. ఆయన రాజకీయ వ్యాఖ్యలు చేయడం మానుకోవాలి’ అని సందీప్ దీక్షిత్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సందీప్ దీక్షిత్ వ్యాఖ్యలను కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఖండించారు. ఆర్మీ చీఫ్‌ను సందీప్ దీక్షిత్ కించపరిచేలా మాట్లాడటం దారుణమన్నారు. ఒక పద్ధతి ప్రకారం ఆర్మీ ప్రతిష్టను కాంగ్రెస్ దిగజారుస్తోందని ఆమె ధ్వజమెత్తారు. ఆయనను తక్షణమే కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. మరోవైపు సందీప్ దీక్షిత్ వ్యాఖ్యలను నిరసిస్తూ మాజీ సైనికులు, తమ కుటుంబాలతో కలిసి రాజ్‌ఘాట్ వద్ద ఆందోళనకు దిగారు. -
ఆర్మీ చీఫ్‌పై వివాదస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ నేత, ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ ఆదివారం ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘మాఫియాలాగా హెచ్చరికలు చేసే పాక్ సైన్యానికి మన ఆర్మీకి తేడా ఉంది. మన ఆర్మీ చీఫ్(రావత్) వీధి రౌడీలా మాట్లాడుతుంటే వినడానికి ఇబ్బందిగా ఉంది. ఆయన రాజకీయ వ్యాఖ్యలు చేయడం మానుకోవాలి’ అని అన్నారు. ఆర్మీ చీఫ్‌ను వీధి రౌడీ అనడానికి కాంగ్రెస్ పార్టీకి ఎంత ధైర్యమని హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజుజు మండిపడ్డారు. కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ క్షమాపణ చెప్పడంతో పాటు సందీప్‌ను పార్టీ నుంచి తొలగించాలని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా డిమాండ్ చేశారు. మరోవైపు సందీప్ వ్యాఖ్యలు దురదృష్టకరమని కాంగ్రెస్ పార్టీ స్పందించింది. తన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో సందీప్ క్షమాపణలు చెప్పారు. -
'యూపీలో మా అమ్మను అవమానించారు'
ఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో బీజేపీ దూసుకుపోయింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భారీ మెజార్టీతో విజయం సాధించగా, పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. గోవా, మణిపూర్ లలో కాంగ్రెస్, బీజేపీలకు స్పష్టమైన మెజార్టీ రాలేదు. అయితే ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ 300కు పైగా స్థానాల్లో విజయం సాధించడంతో కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ కూటమికి అనూహ్య ఫలితాలు ఎదురయ్యాయి. యూపీలో దారుణ వైఫల్యంపై ఢిల్లీ మాజీ సీఎం షీలాదిక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ తీవ్ర స్థాయిలో స్పందించారు. కాంగ్రెస్ ఓటమికి రాహుల్ గాంధీ సహా పార్టీ నేతలంగా బాధ్యత వహించాలన్నారు. యూపీలో షీలాదీక్షిత్‌ను అవమానించారని, కాంగ్రెస్ పార్టీ సీనియర్ల వల్లే యూపీలో పార్టీ దారుణ ఓటమి చవిచూసిందని సందీప్ దీక్షిత్ ఆరోపించారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎం అభ్యర్థిగా మొదటగా షీలాదీక్షిత్ పేరును తెరపైకి తీసుకొచ్చారు. ఆ తర్వాత సమాద్ వాదీ పార్టీతో కాంగ్రెస్ జతకట్టడంతో వారి అంచనాలు తారుమారయ్యాయి. యూపీ అసెంబ్లీలో మొత్తం 403 స్థానాలకు గానూ బీజేపీ 322 సీట్లు, ఎస్పీ కూటమి 53 స్థానాలు, బీఎస్పీ 19, ఇతరులు ఐదు స్థానాల్లో విజయం సాధించాయి. మరో నాలుగు స్థానాల ఫలితాలు ఇంకా వెల్లడికాలేదు. ఓటమి అనంతరం అఖిలేశ్ యాదవ్ మీడియాతో మాట్లాడారు.. 'ప్రజల తీర్పును అంగీకరిస్తున్నాను. విజయం సాధించినందుకు మోదీకి అభినందనలు. కాంగ్రెస్‌తో పొత్తు కొనసాగుతుంది. కొత్త ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందని ఆశిస్తున్నానని' అఖిలేశ్ అన్నారు. -
మన్మోహన్ సింగ్.. మీకిది తగునా?
న్యూఢిల్లీ: భారత రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ) గవర్నర్ ఉర్జిత్ పటేల్ ను మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వెనుకేసుకురావడాన్ని కాంగ్రెస్ నేతలు ఆక్షేపిస్తున్నారు. మన్మోహన్ తీరును మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ తనయుడు సందీప్ దీక్షిత్ తప్పుబట్టారు. ఆర్బీఐ గవర్నర్ ను మన్మోహన్ వెనకేసుకురావడం సరికాదని పేర్కొన్నారు. ఆర్బీఐని ప్రశ్నించే అధికారం పార్లమెంట్ కమిటీలకు ఉంటుందని చెప్పారు. ‘మన్మోహన్ సింగ్ అంటే నాకు గౌరవం ఉంది. కానీ ఆర్బీఐ గవర్నర్ ను ఆయన వెనకేసుకురావడం సమంజసం కాదు. ప్రశ్నించే హక్కు ఎంపీలకు ఉంది. చట్టసభ సభ్యులకు ప్రశ్నించే హక్కు లేదని అనుకుంటే.. అవతలివారి నుంచి అటువంటి సమాధానాలే వస్తాయి. ఆర్బీఐ లాంటి సంస్థలు ప్రభుత్వానికి జవాబుదారీగా ఉండాల్సిందే’నని సందీప్ దీక్షిత్ అభిప్రాయపడ్డారు. పాత పెద్ద నోట్ల రద్దుపై వివరణ ఇచ్చేందుకు బుధవారం పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఎదుట హాజరైన ఉర్జిత్ పటేల్ కు మన్మోహన్ సింగ్ దన్నుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇబ్బందికర ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన అవసరం లేదని ఆయనను వెనకేసుకొచ్చారు. -
కాంగ్రెస్‌లో నిఖార్సయిన నాయకుడు లేడు
సందీప్ దీక్షిత్ వివాదాస్పద వ్యాఖ్యలు న్యూఢిల్లీ: తమ పార్టీలో నిఖార్సయిన నాయకుడు లేడని మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈ పార్టీలోని సంస్కృతి నాయకుల్లో అహంకారాన్ని పెంచుతోందన్నారు. ‘కాంగ్రెస్ పార్టీలో సగం మంది నాయకులు చచ్చిపోయిన చెక్కల వంటివారు. ఇంకా ఎన్ఎస్యూఐ, యువజన కాంగ్రెస్‌లో 70 శాతంమందిదీ ఇదే పరిస్థితి. ఇటువంటి పరిస్థితి మావంటి వాళ్లకు భరింపనలవికాకుండా ఉంది. కొత్త నాయకులను తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది’ అని అన్నారు. కాగా తన తల్లి షీలాదీక్షిత్‌పై అజయ్‌మాకెన్, పీసీ చాకో వంటి నాయకులు గురువారం తీవ్రస్థాయిలో మాట్లాడిన నేపథ్యంలో శుక్రవారం సందీప్ పైవిధంగా స్పందించారు. పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువంటూ ఎద్దేవా చేశారు. ‘కొత్త వారిని పార్టీలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అయితే వారు ఎన్నికల ద్వారా రారు. ఎంపికల ద్వారానే వస్తారు. కొత్త ఆలోచనలు, కొత్త అంశాలను తీసుకొస్తారు. ఇటువంటి వారిని గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నరేంద్రమోదీ గురించి ఆందోళన చెందాల్సిన అవసరమేమీ లేదు.’ అని అన్నారు. సుపరిపాలన వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 2013 నాటి తీర్పు కొనసాగింపు షీలాదీక్షిత్‌పై మాకెన్ వ్యంగ్యాస్త్రాలు న్యూఢిల్లీ: ఎన్నికల పరాజయం కాంగ్రెస్‌లో రేపిన చిచ్చు ఇంకా రగులుతూనే ఉంది. మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ తనపై గురువారం చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ నాయకుడు అజయ్ మాకెన్ ఇంకా మరిచిపోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో షీలాపై మళ్లీ వ్యంగ్యాస్త్రాలను సంధించారు.శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ 2013 నాటి విధానసభ ఎన్నికల్లో వచ్చిన తీర్పే పునరావృతమైందన్నారు. ‘నేను వ్యక్తిగతంగా వెళ్లి ఆమెను కలుస్తా. ఎక్కడ తప్పు జరిగిందో తెలియజేయమని అడుగుతా. మున్ముందు అటువంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తపడతా’ అని అన్నారు. -
షీలా మా కీలక ప్రచారకురాలు: చాకో
న్యూఢిల్లీ: ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ తమ కీలకమైన ప్రచారకురాలిగా ఉంటారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పార్టీ ఢిల్లీ ఇన్‌ఛార్జి పీసీ చాకో చెప్పారు. ఎన్నికల సమయంలో కీలక పాత్ర పోషించకుండా ఆమెను పక్కన పెట్టారని, షీలా సైతం కినుక వహించారని వచ్చిన పుకార్లకు దీంతో తెరపడింది. తాను ఆమెను కలుసుకున్నానని, ఈ ఎన్నికల్లో పార్టీ కోసం షీలాదీక్షిత్ చురుకుగా ప్రచారం చేస్తారని చాకో చెప్పారు. ఎటువంటి భేదాభిప్రాయాలు లేవని, తమ ప్రధాన ప్రచారకరురాలు షీలాయేనని ఆయన స్పష్టం చేశారు. అయితే ఈ ఎన్నికల్లో దీక్షిత్ పోటీ చేస్తారా లేదా అన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఎన్నికల ప్రణాళికను రూపొందించేందుకు ఈ నెల 3న జరిగిన సమావేశానికి మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, ఇతర పార్టీ నేతలు హాజరు కాగా, షీలాదీక్షిత్‌తో పాటు ఆమె కుమారుడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్ గైర్హాజరయ్యారు. అది అనధికార సమావేశమని, ముందస్తు నిర్ణయించుకున్న కార్యక్రమాలుండటం వల్లనే షీలా ఆ సమావేశానికి హాజరుకాలేకపోయారని చాకో వివరించారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయబోవడం లేదని షీలాదీక్షిత్ ఇదివరకే స్పష్టం చేశారు. -
మూడోసారీ గెలుస్తారా?
న్యూఢిల్లీ: పదిహేనేళ్ల పాటు ఆమె దేశరాజధాని రాజకీయాలను శాసించింది. 1998 నుంచి 2013 దాకా మూడు దఫాలు ముఖ్యమంత్రిగా పనిచేసింది. చివరికి గత ఏడాది ఆమ్ ఆద్మీ గాలితో బలమైన మద్దతు ఉన్న సొంత నియోజకవర్గంలో కూడా గెలవలేకపోయింది. ఆమె ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత కేరళ గవర్నర్ షీలా దీక్షిత్. మొన్న జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఇప్పుడామె కొడుకు సందీప్ దీక్షిత్ భవితవ్యం ఏమిటో తేలనుంది. సందీప్ దీక్షిత్ తూర్పుఢిల్లీ నుంచి రెండు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. షీలా దీక్షిత్‌పై గట్టి విమర్శలు చేసేవారు సైతం ఆమె లేకుండా ఢిల్లీ రాజకీయాలుంటాయని మాత్రం ఊహించలేకపోయారు. కానీ దీక్షిత్ ఓటమికి పార్టీలోని అంతర్గత కలహాలు కూడా ఒక కారణం. అయితే ఇప్పుడు తిరిగి షీలా దీక్షిత్ కీర్తి పతాకను సందీప్ దీక్షిత్ ఎగరేయగలుగుతారా? ఆమె పేరును నిలబెట్టగలుగుతారా? అనేది మే 16న బయటపడనుంది.షీలా ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కొడుకు నియోజకవర్గం అయిన తూర్పు ఢిల్లీలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించారు. మెట్రోతోపాటు, రోడ్లవంటి మౌలిక సదుపాయాలు, 2010 కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణ విషయంలో ఆమె తోడ్పాటునందించారు. రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందడంతో ఈస్ట్ ఢిల్లీ వేగవంతంగా మార్పు చెందింది. ఇవన్నీ ఇలా ఉంటే... ఇప్పుడు బీజేపీ అభ్యర్థి మహేష్‌గిరి, ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్ధి రాజ్‌మోహన్ గాంధీ సందీప్ దీక్షిత్‌కు గట్టి పోటీ ఇచ్చారు. మోడీ గాలి బీజేపీకి కలిసొచ్చే అంశమయితే... 10 అసెంబ్లీ సీట్లకు గాను 8 స్థానాలతో బలంగా ఉన్న కాంగ్రెస్‌ను 2013 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు స్థానాలకే పరిమితం చేసి, 8 స్థానాలను గెలుచుకోవడం ఆమ్ ఆద్మీ పార్టీ బలం. అయితే ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించకుండా ఫ్లైఓవర్లు, కామన్వెల్త్గేమ్స్ సమయంలో మెట్రో లింక్స్ కోసం వందల కోట్ల రూపాయలను ఖర్చు పెట్టడంతో మురికివాడలు, అనధికారిక కాలనీలు, ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతాలు కొన్ని కాంగ్రెస్‌ను తిరస్కరించాయని చెప్పాలి. దీంతో 64 సీట్లకు గాను మున్సిపల్ ఎన్నికల్లో కేవలం 19 సీట్లను మాత్రమే దక్కించుకుంది కాంగ్రెస్. మున్సిపల్ ఎన్నికలను కోల్పోవడంతో కాంగ్రెస్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. కొన్ని దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన తుర్పు ఢిల్లీ ప్రజలకు ఐటీవో చుంగీ ఫ్లైఓవర్, గీతా కాలనీబ్రిడ్జ్, ఔటర్ రింగ్ రోడ్డును కలుపుతూ షాలీమార్గ్ ్గబైపాస్, గాజీపూర్ ఫ్లైఓవర్ వంటి అనేక వాగ్దానాలు చేశారు షీలా దీక్షిత్. 2008లో మూడోసారి ఆమె అధికారంలోకి రావడానికి ఆ తూర్పుఢిల్లీ, వాయవ్య ఢిల్లీ ప్రజలే కీలక భూమిక పోషించారు కూడా. ఇన్ని బలాలు, లోపాలు ఉన్న కారణంగానే ఇప్పుడు సందీప్ దీక్షిత్ భవితవ్యం ఏమిటనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే తూర్పు ఢిల్లీలో ఉన్న సంప్రదాయక ఓట్ బ్యాంకు కాంగ్రెస్‌కు కలిసొస్తుందంటున్నారు విమర్శకులు. అనధికారిక కాలనీలను క్రమబద్ధీకరించడమే కాదు అభివృద్ధి చేస్తామని, బలహీన వర్గాలకు పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ చేసిన వాగ్దానాలేవీ 2012, 2013 ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేయలేకపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో సందీప్ దీక్షిత్ మూడోసారి విజయం సాధిస్తారా? తిరిగి తన సత్తా నిలుపుకుంటారా? వేచి చూడాలి. -
నాయకులం కాము..
సాక్షి, న్యూఢిల్లీ: అజయ్ మాకెన్, మహాబల్ మిశ్రా, ప్రవేశ్ వర్మ.. వీళ్లంతా నిత్యం రాజకీయాల్లో చురుగ్గా కనిపిస్తుంటారు. అయితే ఎన్నికల నామినేషన్ల పత్రాల్లో తమను తాము వ్యాపారవేత్తలు, సామాజిక సేవకులుగా పేర్కొన్నారు. ఈ విషయాన్ని వారు స్వయంగా తమ అఫిడవిట్లలో వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీపడుతున్న మూడు ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో పలువురు తమ నామినేషన్లతోపాటు సమర్పించిన అఫిడవిట్లలో తమను తాము రాజకీయ నాయకులుగా పేర్కొనలేదు. ఢిల్లీ రాజకీయా ల్లో తలపండిన జైప్రకాశ్ అగర్వాల్ ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్లో తన వృత్తిని ‘సామాజిక సేవకుడు’గా పేర్కొన్నారు. 1984లో ఎంపీగా లోక్‌సభలో అడుగుపెట్టిన ఆయన నార్త్ఈస్ట్ ఢిల్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా రెండోసారి పోటీచేస్తున్నారు. అగర్వాల్ మాత్రమే కాదు ఈస్ట్ ఢిల్లీ నుంచి రెండుసార్లు గెలిచి మూడోసారి పోటీకి సిద్ధపడిన మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ తనయుడు సందీప్ దీక్షిత్ కూడా తనను తాను ‘సామాజిక సంస్కరణవాది’ ‘డెయిరీ రైతు’గా పేర్కొన్నారు. న్యూఢిల్లీ సిట్టింగ్ ఎంపీ అజయ్ మాకెన్, వెస్ట్ఢిల్లీ సిట్టింగ్ ఎంపీ మహాబల్ మిశ్రా తనను వ్యాపారవేత్తగా పేర్కొన్నారు. ఆప్ అభ్యర్థులు రాజ్‌మోహన్ గాంధీ, జర్నైల్ సింగ్ తమను రచయితలుగా పేర్కొన్నారు. చాందినీచౌక్ నుంచి పోటీ చేస్తోన్న కపిల్ సిబల్ తన వృత్తిని కేం ద్రమంత్రిని పేర్కొనగా, ఆయన ప్రత్యర్థి డాక్టర్ హర్షవర్ధన్ తాను వైద్యుడు, ఎమ్మెల్యేనని చెప్పుకున్నారు. మీనాక్షి లేఖి తనను న్యాయవాదిగా పేర్కొనగా, ప్రవేశ్‌వర్మ వ్యాపారవేత్తనని తెలిపారు. చాం దినీచౌక్ నుంచి పోటీచేస్తున్న ఆప్ అభ్యర్థి ఆశుతోష్, న్యూఢిల్లీ నుంచి పోటీచేస్తోన్న ఆశిష్ ఖేతాన్ మాత్ర మే తమను రాజకీయ నేతలుగా పేర్కొన్నారు. -
షీలా కుమారుడిపై గాంధీ మనవడు అమీతుమీ
లోకసభ ఎన్నికల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ గురువారం రెండవ జాబితాను ప్రకటించింది. ప్రస్తుతం సందీప్ దీక్షిత్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈస్ట్ ఢిల్లీ స్థానం నుంచి మహాత్మా గాంధీ మనవడు రాజ్ మోహన్ గాంధీని ఆమ్ ఆద్మీ పార్టీ బరిలోకి దించడానికి సిద్దం చేసింది. 30 అభ్యర్థులతో కూడిన రెండవ జాబితాను ఆప్ వెల్లడించింది. హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రా జిల్లా స్థానం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రాజన్ సుశాంత్ పోటి చేయనున్నారు. వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై సుశాంత్ ను బీజేపీ బహిష్కరించింది. ఇటీవలే ఆయన ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారుడు పందీప్ దీక్షిత్ అన్న సంగతి తెలిసిందే. -
మరో మాటే లేదు: కాంగ్రెస్
సాక్షి, న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కు తమ పార్టీ వెలుపలి నుంచి మద్దతు ఇస్తుందని కాంగ్రెస్ ప్రతినిధి సందీప్ దీక్షిత్ ధ్రువీకరించారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయంలో తమ పార్టీ వైఖరిలో ఎటువంటి మార్పూ లేదని స్పష్టం చేశారు. ఆప్‌కు మద్దతు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ పార్టీలో వెలువడుతోన్న స్వరాలన్నీ కొందరు నేతల వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమేనన్నారు. ఆప్‌కు మద్దతుపై కొందరు నాయకుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయనే విషయాన్ని జనార్దన్ ద్వివేది కుండబద్దలు కొట్టారన్నారు. తమ పార్టీపై ఆప్ ఉపయోగిస్తున్న భాషను నేతలు, కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారన్నారు. అయితే ఇది కొందరు నేతల వ్యక్తిగత అభిప్రాయమేనని, పార్టీ నిర్ణయం ఎటువంటి పరిస్థితుల్లోనూ మారబోదన్నారు. కాగా ఆప్‌కు మద్దతు ఇవ్వకపోతే బాగుండేదని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేది వ్యాఖ్యానించిన సంగతి విదితమే. కాగా ఢిల్లీ విధానసభకు చెందిన ఎనిమిదిమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో అర్విందర్ సింగ్ లవ్లీ, జైకిషన్, హరూన్ యూసఫ్‌లు ఆప్‌కు మద్దతు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నారంటూ వార్త్తలొచ్చాయి. మరోవైపు మద్దతు విషయమై కాంగ్రెస్ పార్టీ పునరాలోచనలో ఉందంటూ వచ్చిన వార్తలపై కేజ్రీవాల్ ప్రతిస్పందిస్తూ అది ఆ పార్టీకి సంబంధించిన వ్యవహారమన్నారు. తమ పార్టీ కాంగ్రెస్‌తోగానీ, బీజేపీతోగానీ పొత్తు పెట్టుకోలేదని స్పష్టం చేశారు. -
'కొత్త రాష్ట్రాల ఏర్పాటు చేసే అధికారం పార్లమెంట్ కు ఉంది'
ఢిల్లీ: కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసే అధికారం పార్లమెంట్ కు ఉందని ఏఐసీసీ అధికార ప్రతినిధి సందీప్ దీక్షిత్ అన్నారు. అన్ని పార్టీల సంప్రదింపుల తర్వాతే తెలంగాణపై నిర్ణయం తీసుకున్నామన్నారు. రాష్ట్ర విభజన తర్వాత పార్టీల గందరగోళ పరిస్థితులు సృష్టించడం ఏమాత్రం సబబు కాదని ఆయన తెలిపారు. రాష్ట్ర విభజనకు సంబంధించి ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన పార్టీల వైఖరిస్తున్న వైఖరిపై మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అన్ని పార్టీలు అనుకూలంగా మాట్లాడి..ఇప్పుడు మరో రకంగా మాట్లాడటం మంచిది కాదన్నారు. రాష్ట్ర విభజన విధివిధినాలకు సంబంధించి అన్ని అంశాలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జీవోఎం(కేంద్ర మంత్రుల బృందం) చూసుకుంటుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాష్ట్ర విభజన అంశంపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) నిర్ణయంలో మార్పు లేదని ఏఐసీసీ అధికార ప్రతినిధి సందీప్ దీక్షిత్ గతంలో ప్పష్టం చేసిన సంగతి తెలిసిందే. -
'సందీప్ దీక్షిత్‌కు టీ.ఎంపీలు ఎలా మద్దతు ఇస్తారు'
న్యూఢిల్లీ : తెలుగువాడిని చంపుతానన్న సందీప్ దీక్షిత్‌కు తెలంగాణ ఎంపీలు ఎలా మద్దతు ఇస్తారని టీడీపీ ఎంపీ శివప్రసాద్ ప్రశ్నించారు. సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ద్వంద్వ విధానం అవలంభిస్తున్నారని ఆయన మండిపడ్డారు. బుధవారం ఉదయం ఓ ఛానల్స్ కార్యక్రమంలో పాల్గొన్న శివప్రసాద్ ....కాంగ్రెస్ నేతలు లోపలొకటి.... బయటొకటీ మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రజల పక్షాన నిలిచేందుకే చంద్రబాబునాయుడు ఆత్మగౌరవ యాత్ర చేపట్టారని ఆయన అన్నారు. చంద్రబాబుపై విమర్శలు చేయటం తగదని ఆయన సూచించారు. ఇందిరాగాంధీ మాస్క్ ధరించి నిరసనకు దిగిన ఎంపీ శివప్రసాద్ వైఖరిపై కాంగ్రెస్ ఎంపీ సందీప్ దీక్షిత్ అభ్యంతరం తెలిపిన విషయం తెలిసిందే. ఢిల్లీలో ఎలా దిగుతావో చూస్తానని దుర్భాషలాడుతూ బెదరింపులకు పాల్పడ్డాడని టీడీపీ నేతలు కూడా ఆరోపించగా, తెలుగు జాతిని అవమానపరిచే విధంగా సందీప్ దీక్షిత్ వ్యాఖ్యలు చేశాడని, తెలుగు వారంటే కాంగ్రెస్ నేతలకు మొదటి నుంచి చులకన భావం ఉందని ఆపార్టీ ఎంపీ నామా నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. సందీప్ దీక్షిత్ దూషణలపై స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తామని ఆయన తెలిపారు కూడా. ఇక శివప్రసాద్ వ్యాఖ్యలపై తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి స్పందించారు. శివప్రసాద్ సభలో వ్యవహరించిన తీరును సీడీలతో సహా బయటపెడతామని అన్నారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేసే ప్రసక్తే లేదని గుత్తా స్పష్టం చేశారు. -
నిండు సభలో బూతు పురాణం
-
మర్యాద మంటగలిపారు
లోక్‌సభలో కాంగ్రెస్, టీడీపీ ఎంపీల బూతుపురాణం నిండుసభలో పరస్పరం దాడులకు సిద్ధపడ్డ వైనం నివ్వెరపోయిన స్పీకర్... నిర్ఘాంతపోయిన సభ్యులు సీమాంధ్ర సభ్యులపై మరో ఐదు రోజుల సస్పెన్షన్ సాక్షి, న్యూఢిల్లీ: ప్రజాస్వామ్యానికి కేంద్ర బిందువైన పార్లమెంటులో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ ఎంపీలు పరస్పర దూషణలతో ముష్టియుద్ధాలకు సిద్ధమవటంతో లోక్‌సభ యావత్తూ నివ్వెరపోయింది. ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు చెందిన కాంగ్రెస్, టీడీపీల ఎంపీలు సోమవారం సమైక్య రాష్ట్రం నినాదాలతో ఆందోళనలకు దిగటం.. అందులో టీడీపీ ఎంపీ పి.శివప్రసాద్ సభలో మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ మాస్కు ధరించి పద్యాలు పాడటం.. దీనికి కాగ్రెస్ ఎంపీలు తీవ్ర ఆగ్రహించి ఆయనపైకి దూసుకురావటం.. ఇదిచూసి దిగ్భ్రాంతి చెందిన స్పీకర్.. సీమాంధ్ర కాంగ్రెస్, టీడీపీ ఎంపీలపై సస్పెన్షన్ వేటు వేయటం.. సభను అర్థంతరంగా వాయిదావేసి వెళ్లిపోవటం.. ఆ తర్వాత కాంగ్రెస్, టీడీపీ ఎంపీలు పరస్పరం బూతులు తిట్టుకుంటూ కొట్టుకునే వరకూ వెళ్లటం.. అన్నీ చకచకా జరిగిపోయాయి. సోమవారం లోక్‌సభ సమావేశం కాగానే.. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ నలుగురు టీడీపీ సభ్యులతో పాటు ఐదుగురు సీమాంధ్ర ప్రాంత కాంగ్రెస్ సభ్యులు కూడా స్పీకర్ పోడియంను చుట్టుముట్టి నినాదాలు మొదలుపెట్టారు. టీడీపీ ఎంపీ శివప్రసాద్ అకస్మాత్తుగా ఇందిరాగాంధీ మాస్క్ ధరించి ఆమె ఆత్మ తనను ఆవహించినట్లుగా నటిస్తూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని ఉద్దేశించి పద్యాలు పాడటం ప్రారంభించారు. స్పీకర్ మీరాకుమార్ ఆగ్రహం వ్యక్తంచేయటంతో ఆయన మాస్క్ తొలగించినప్పటికీ తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలతో పాటు ప్రభుత్వ చీఫ్‌విప్ సందీప్‌దీక్షిత్.. ఆగ్రహావేశాలతో శివప్రసాద్ వైపుకు దూసుకెళ్లారు. దీంతో దిగ్భ్రాంతి చెందిన స్పీకర్ వెల్‌లో ప్రవేశించిన 9 మందిని మరో ఐదు రోజుల పాటు సస్పెండ్ చేసి సభను వాయిదా వేశారు. సభ వాయిదా పడిన తర్వాత కూడా టీడీపీ, కాంగ్రెస్ సభ్యులు పరస్పరం అసభ్యపదజాలంతో వ్యక్తిగత దూషణలకు దిగారు. పరస్పరం ముష్టియుద్ధానికి సిద్ధపడ్డారు. కాంగ్రెస్ తెలంగాణ ఎంపీలు మధుయాష్కీగౌడ్, పొన్నం ప్రభాకర్, సిరిసిల్ల రాజయ్య, ప్రభుత్వ చీఫ్‌విప్ సందీప్దీక్షిత్లను పాలకపక్ష సీనియర్ నాయకులు అడ్డుకోగా.. కాంగ్రెస్ సభ్యులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న శివప్రసాద్‌కు సమాజ్‌వాదీ పార్టీ నేత ములాయంసింగ్‌యాదవ్ తదితర ప్రతిపక్ష నాయకులు సర్దిచెప్పాల్సి వచ్చింది. తమ సుదీర్ఘ పార్లమెంటరీ జీవితంలో ఇంతటి చౌకబారు ప్రవర్తన, పార్లమెంట్ ప్రతిష్టను దిగజార్చే సంఘటనను గతంలో ఎన్నడూ చూడలేదని ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్, బీజేపీ సీనియర్ నాయకుడు యశ్వంత్‌సిన్హా, సీపీఐ పక్ష నాయకుడు గురుదాస్ దాస్‌గుప్తా, తదితరులు ఆ తర్వాత సెంట్రల్హాల్లో ఎదురైన రాష్ట్ర ఎంపీలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.మరోవైపు రాజ్యసభలో కూడా సీమాంధ్ర ప్రాంతానికి చెందిన టీడీపీ ఎంపీలు వై.ఎస్.చౌదరి, సి.ఎం.రమేష్‌లు ఆందోళనకు దిగటంతో చైర్మన్ అన్సారీ వారిపై ఒక రోజు సస్పెన్షన్ విధించారు. స్పీకర్‌కు పరస్పరం ఫిర్యాదులు సభామర్యాదలను మంటగలిపిన శివప్రసాద్ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని, కాంగ్రెస్ అధ్యక్షురాలిపై వ్యక్తిగత విమర్శలు చేసిన మిగిలిన టీడీపీ సభ్యులపై చర్య తీసుకోవాలని ప్రభుత్వ చీఫ్‌విప్ సందీప్‌దీక్షిత్, తెలంగాణ ఎంపీలు స్పీకర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. లోక్‌సభలో టీడీపీ సభ్యుడిపై అసభ్య పదజాలంతో దాడి చేయడానికి ప్రయత్నించారంటూ ప్రభుత్వ ఛీఫ్‌విప్ సందీప్ దీక్షిత్‌పై ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్, బీజేపీ సీనియర్ నాయకుడు షానవాజ్ హుస్సేన్‌లు కూడా స్పీకర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. కాగా, టీడీపీ సీమాంధ్ర పార్టీ ఎంపీలకు దమ్ము, ధైర్యం ఉంటే ముందుగా విభజనపై వైఖరేంటో ఆ పార్టీ అధినేత చంద్రబాబును నిలదీయాలని సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు హితవు పలికారు. సీమాంధ్ర టీడీపీ ఎంపీలు కవ్వింపు చర్యలకు దిగుతున్నారని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఆరోపించారు.