ఢిల్లీ: కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసే అధికారం పార్లమెంట్ కు ఉందని ఏఐసీసీ అధికార ప్రతినిధి సందీప్ దీక్షిత్ అన్నారు. అన్ని పార్టీల సంప్రదింపుల తర్వాతే తెలంగాణపై నిర్ణయం తీసుకున్నామన్నారు. రాష్ట్ర విభజన తర్వాత పార్టీల గందరగోళ పరిస్థితులు సృష్టించడం ఏమాత్రం సబబు కాదని ఆయన తెలిపారు. రాష్ట్ర విభజనకు సంబంధించి ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన పార్టీల వైఖరిస్తున్న వైఖరిపై మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అన్ని పార్టీలు అనుకూలంగా మాట్లాడి..ఇప్పుడు మరో రకంగా మాట్లాడటం మంచిది కాదన్నారు. రాష్ట్ర విభజన విధివిధినాలకు సంబంధించి అన్ని అంశాలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జీవోఎం(కేంద్ర మంత్రుల బృందం) చూసుకుంటుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
రాష్ట్ర విభజన అంశంపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) నిర్ణయంలో మార్పు లేదని ఏఐసీసీ అధికార ప్రతినిధి సందీప్ దీక్షిత్ గతంలో ప్పష్టం చేసిన సంగతి తెలిసిందే.