షీలా కుమారుడిపై గాంధీ మనవడు అమీతుమీ
లోకసభ ఎన్నికల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ గురువారం రెండవ జాబితాను ప్రకటించింది. ప్రస్తుతం సందీప్ దీక్షిత్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈస్ట్ ఢిల్లీ స్థానం నుంచి మహాత్మా గాంధీ మనవడు రాజ్ మోహన్ గాంధీని ఆమ్ ఆద్మీ పార్టీ బరిలోకి దించడానికి సిద్దం చేసింది.
30 అభ్యర్థులతో కూడిన రెండవ జాబితాను ఆప్ వెల్లడించింది. హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రా జిల్లా స్థానం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రాజన్ సుశాంత్ పోటి చేయనున్నారు.
వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై సుశాంత్ ను బీజేపీ బహిష్కరించింది. ఇటీవలే ఆయన ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారుడు పందీప్ దీక్షిత్ అన్న సంగతి తెలిసిందే.