న్యూఢిల్లీ: సైనిక దళాల ప్రధానాధికారి నియామక ంపై వచ్చే వారంలో ఉన్నతస్థాయి భేటీ జరగనున్న నేపథ్యంలో ఈ అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. దీనికి సంబంధించి రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి సమాచారం అందినట్లు శనివారం పేర్కొంది. ఇప్పటివరకు ఈ అంశం మరో రెండు రోజుల్లో చర్చ కు రావచ్చని ఓ అధికారి వెల్లడించారు.