అంతా నిబంధనల మేరకే | Centre opposes pleas challenging validity of CEC Act in Supreme Court | Sakshi
Sakshi News home page

అంతా నిబంధనల మేరకే

Published Thu, Mar 21 2024 6:20 AM | Last Updated on Thu, Mar 21 2024 6:20 AM

Centre opposes pleas challenging validity of CEC Act in Supreme Court - Sakshi

ఈసీల నియామకంపై సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్‌

న్యూఢిల్లీ: ఇద్దరు నూతన కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామకం నిబంధనల మేరకే జరిగిందని కేంద్రం పేర్కొంది. ఈ ప్రక్రియ హడావుడిగా జరిగిందన్న ఆరోపణలను తోసిపుచి్చంది. ఈసీల ఎంపిక కమిటీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేకపోవడాన్ని సమరి్థంచుకుంది.

ఎంపిక కమిటీలో న్యాయవ్యవస్థ ప్రాతినిధ్యమే ఈసీ స్వతంత్ర ప్రతిపత్తికి ప్రాతిపదిక కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖ సుప్రీంకోర్టులో బుధవారం అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఈసీల ఎంపిక కమిటీ నుంచి సీజేఐని మినహాయించడాన్ని సవాలు చేస్తూ కోర్టులో ఈ కేసులో తదుపరి విచారణ గురువారం జరగనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement