న్యూఢిల్లీ: సాధారణ ఎన్నికల్లో అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ చోట్ల పోటీ చేయకుండా నివారించాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు వాదనలు విననుంది. ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేయకుండా నివారించేలా చట్టం తేవాలంటూ 2004లో ఎన్నికల సంస్కరణల్లో భాగంగా చేసిన ప్రతిపాదనలతో ఎన్నికల సంఘం(ఈసీ) మరోసారి సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ ప్రతిపాదనలను అన్ని పార్టీలు ఆమోదించినప్పటికీ, 1998లో అప్పటి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కూడా తోసిపుచ్చిందని తెలిపింది. ఒక వ్యక్తి పోటీ చేసిన రెండు చోట్లా ఎన్నికల్లో గెలిస్తే..రాజీనామా చేసిన స్థానంలో ఎన్నికల నిర్వహణ ఖర్చును ఆ అభ్యర్థి నుంచి శాసనసభకైతే రూ.5 లక్షలు, లోక్‌సభకైతే రూ.10 లక్షలు రాబట్టాలనే ప్రతిపాదన ఉందని పేర్కొంది. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీలతో నిమిత్తం లేకుండా స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేయకుండా నివారించేలా అధికారులను ఆదేశించాలని పిటిషనర్ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment