one seat
-
First general elections: ఒక్క స్థానం.. ఇద్దరు ఎంపీలు!
ఒక్క లోక్సభ నియోజకవర్గానికి ఇద్దరు ఎంపీలుంటారా? ఇద్దరేం ఖర్మ... ముగ్గురు కూడా ఉన్నారు! ఎప్పుడు? ఎలా?మన దేశంలో రాజకీయాలు చాలా క్లిష్టంగా ఉ న్నాయని ఇప్పుడనుకుంటున్నాం. కానీ స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో జరిగిన ఎన్నికల సమయంలో మరింత సంక్లిష్టంగా ఉన్నాయి. సాధారణంగా ఒక్క నియోజకవర్గానికి ఒక్కరే ప్రాతినిధ్యం వహిస్తారు. ఎన్నికలు జరిగేదే ఆ ప్రతినిధిని ఎన్నుకోవడానికి. కానీ తొలి రెండు సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం పలు నియోజకవర్గాలకు ఇద్దరేసి ఎంపీల ను ఎన్నుకున్నారు. 1961లో రద్దయ్యే దాకా ఇది కొనసాగింది. కొన్ని నియోజకవర్గాలకైతే ముగ్గురు ఎంపీలూ ఉన్నారు! దళితులు, గిరిజన సమూహాల వంటి అణగారిన వర్గాలకు పార్లమెంటులో ప్రాతినిధ్యం పెంచేందుకు ఈ ఏర్పాటు కలి్పంచారు.తొలి ఎన్నికల్లో...మొట్టమొదటి ఎన్నికల సమయంలో లోక్సభలో 400 స్థానాలున్నాయి. వీటిలో 314 స్థానాలకు ఒక్క ఎంపీ ఉండగా, 86 నియోజకవర్గాలకు ఒక జనరల్, మరొక షెడ్యూల్ కులాల ప్రతినిధి చొప్పున ఇద్దరేసి ఎంపీలు ఎన్నికయ్యారు. ఇలా ఇద్దరు ఎంపీలున్న నియోజకవర్గాలు యూపీలో 17, నాటి మద్రాసు రాష్ట్రంలో 13, బిహార్లో 11, బాంబేలో 8 ఉన్నాయి. పశి్చమబెంగాల్లోని నార్త్ బెంగాల్ నియోజకవర్గానికయితే ఏకంగా ముగ్గురు ఎంపీలు ప్రాతినిధ్యం వహించారు!1957లో...సీట్ల పునరి్వభజన అనంతరం 1957 సార్వత్రి క ఎన్నికల్లో 494 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో ఇద్దరు ఎంపీల స్థానాలు 57కు తగ్గాయి. వీటిలో అత్యధికంగా ఉత్తరప్రద్రేశ్లో 18, ఆంధ్రప్రదేశ్లో 8, బిహార్లో 8, పశి్చమబెంగాల్లో 8, బాంబేలో 8, మద్రాసులో 7 స్థానాలకు ఇద్దరు ఎంపీలు ప్రాతినిధ్యం వహించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘మాయ’మైనట్టేనా?
సాక్షి, న్యూఢిల్లీ: యూపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మాయావతి సారథ్యంలోని బహుజన్ సమాజ్ పార్టీ ఉనికినే ప్రశ్నార్థకంగా మార్చేశాయి. 403 అసెంబ్లీ స్థానాల్లో ఒకే ఒక్క స్థానానికి పరిమితమై ఆ పార్టీ కుదేలైంది. తొలినుంచి ఆయువుపట్టుగా ఉన్న ఎస్సీ సామాజిక వర్గం ఆదరించకపోగా మాయా సొంత సామాజికవర్గం జాటవ్లు కూడా బీజేపీ వైపు మొగ్గారు. ఒక దశలో ప్రధాని అయ్యేంతగా వెలుగు వెలిగిన మాయావతి ప్రభ ఈ ఎన్నికలతో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినట్టేనని విశ్లేషకులంటున్నారు. మాయా లేదు..మంత్రం లేదు.. బహుజనుల నేతగా 1995, 1997, 2002, 2007ల్లో నాలుగుసార్లు యూపీ సీఎం పీఠమెక్కిన ఘన చరిత్ర 66 ఏళ్ల మాయావతిది. అలాంటిది బీఎస్పీ ఈసారి ఎన్నడూ లేనంతటి ఘోర అపజయాన్ని మూటగట్టుకుంది. 2017 ఎన్నికల్లో 22.23 శాతం ఓట్లతో 19 స్థానాలు గెలిచిన పార్టీ ఈసారి నెగ్గింది ఒక్కటంటే ఒక్క సీటు! ఓట్ల శాతం కూడా 12.6 శాతానికి దిగజారింది. 2019 లోక్సభ ఎన్నికల్లోనూ బీఎస్పీ కేవలం 19.3 శాతం ఓట్లతో 10 స్థానాలతో సరిపెట్టుకుంది. అప్పటినుంచీ పార్టీ కార్యక్రమాలను మాయా పెద్దగా పట్టించుకోవడం లేదు. దాంతో పార్టీలో క్రియాశీలంగా ఉండే బ్రాహ్మణవర్గం బీజేపీలోకి, ముస్లింలు సమాజ్వాదీలో చేరారు. బీజేపీ, ఎస్పీ, కాంగ్రెస్ పోటాపోటీ సభలు, రోడ్షోలు, ర్యాలీలకు దిగాయి. కాంగ్రెస్ నుంచి ప్రియాంకా గాంధీ 209 ర్యాలీలు, సభలు; బీజేపీ నుంచి యోగి 203 సభలు, ర్యాలీలు; ఎస్పీ అధినేత అఖిలేశ్ 139 ర్యాలీలు, సభలు జరిపితే మాయా కేవలం 18 మీటింగులతో ముగించారు. ఎస్సీలూ దూరమయ్యారు యూపీలో 21 శాతమున్న దళిత ఓటర్లు తొలినుంచీ బీఎస్పీకే దన్నుగా నిలిచారు. సుమారు 4.2 కోట్ల దళితుల్లో 2.25 కోట్లు మాయా సామాజికవర్గం జాటవ్కే చెందిన వారు. పాసీలు 70 నుంచి 80 లక్షల దాకా (16 శాతం)ఉంటారు. కోటికి పైగా మిగతా కులాల వారున్నారు. రాష్ట్రంలోని 84 ఎస్సీ స్థానాల్లో 2007లో బీఎస్పీ ఏకంగా 61 గెలుచుకోగా 2012లో 14కు పడిపోయింది. 2017 ఎన్నికల నాటికి ఎస్సీలు దాదాపుగా బీజేపీ వైపు మొగ్గారు. 2017లో బీజేపీ అధికారంలోకి వచ్చాక జాటవేతర వర్గాలను విఛ్చిన్నం చేయడంతో దళితులు బీఎస్పీకి దూరమయ్యారు. ఈ ఎన్నికల్లోనూ బీజేపీ అదే ఫార్ములా వాడింది. దాంతో దళితులంతా మరోసారి బీజేపీవైపే నిలిచారు. గడిచిన ఎన్నికల్లో బీఎస్పీ సాధించిన సీట్లు, ఓట్లు ఎన్నికలు గెలిచిన ఓట్ల సీట్లు శాతం 2002 98 23.06 2007 206 30.43 2012 80 25.97 2017 19 22.23 2022 1 12.66 -
ఎక్కువ చోట్ల పోటీపై ‘సుప్రీం’ విచారణ
న్యూఢిల్లీ: సాధారణ ఎన్నికల్లో అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ చోట్ల పోటీ చేయకుండా నివారించాలంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు వాదనలు విననుంది. ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేయకుండా నివారించేలా చట్టం తేవాలంటూ 2004లో ఎన్నికల సంస్కరణల్లో భాగంగా చేసిన ప్రతిపాదనలతో ఎన్నికల సంఘం(ఈసీ) మరోసారి సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ ప్రతిపాదనలను అన్ని పార్టీలు ఆమోదించినప్పటికీ, 1998లో అప్పటి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కూడా తోసిపుచ్చిందని తెలిపింది. ఒక వ్యక్తి పోటీ చేసిన రెండు చోట్లా ఎన్నికల్లో గెలిస్తే..రాజీనామా చేసిన స్థానంలో ఎన్నికల నిర్వహణ ఖర్చును ఆ అభ్యర్థి నుంచి శాసనసభకైతే రూ.5 లక్షలు, లోక్సభకైతే రూ.10 లక్షలు రాబట్టాలనే ప్రతిపాదన ఉందని పేర్కొంది. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీలతో నిమిత్తం లేకుండా స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేయకుండా నివారించేలా అధికారులను ఆదేశించాలని పిటిషనర్ కోరారు. -
ఒక్కో సీటుకు ముగ్గురు
వైద్య కళాశాలల్లో పీజీ సీట్లకు తీవ్ర పోటీ ప్రభుత్వ, ప్రైవేటులలో కలిపి అందుబాటులో ఉన్న సీట్లు 2,431 ప్రవేశ పరీక్షలో అర్హత పొందిన వారు 8,100 మంది ఏప్రిల్ మూడో వారం నుంచి కౌన్సెలింగ్ సాక్షి, హైదరాబాద్: ప్రతీ ఏడాదిలాగే ఈసారి కూడా పీజీ వైద్యవిద్య సీట్ల కోసం తీవ్ర పోటీ నెలకొంది. పీజీ వైద్య విద్య ప్రవేశపరీక్షలో అర్హత సాధించిన వారి సంఖ్యను బట్టి ఒక్కో సీటుకు ముగ్గురికిపైగా పోటీ పడుతున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ కళాశాలల్లో 1,139 సీట్లు, ప్రైవేటు కళాశాలల్లో 1,292 సీట్లు మొత్తంగా 2,431 పీజీ సీట్లు ఉన్నాయి. ప్రస్తుతం భారత వైద్య మండలి (ఎంసీఐ) బృందాలు వైద్య కళాశాలల్లో తనిఖీలు నిర్వహిస్తున్నందున మరికొన్ని సీట్లు పెరిగేందుకు లేదా కోత పడేందుకు అవకాశముంది. అయితే, ఈ ఏడాది పీజీ వైద్య ప్రవేశ పరీక్షకు 14వేల మందికి పైగా హాజరుకాగా.. 8,100 మంది (57.5 శాతం) మాత్రమే అర్హత సాధించారు. యాజమాన్య కోటా సీట్లు 646: ప్రైవేటు వైద్య కళాశాలల్లోని 50% సీట్లు అంటే 646 పీజీ సీట్లను యాజమాన్య కోటా కింద యాజమాన్యాలే భర్తీ చేసుకుంటాయి. కౌన్సెలింగ్ నాటికి ఈ సీట్ల సంఖ్య మరికొంత పెరిగే వీలుంది. ప్రైవేటు కళాశాలల్లోని మిగతా సీట్లను, ప్రభుత్వ కళాశాలల్లోని సీట్లను మొత్తంగా 1,825 సీట్లను కన్వీనర్ కోటాకింద భర్తీ చేస్తారు. ఈ లెక్కన చూస్తే ఒక్కో సీటుకు నలుగురుపైనే పోటీపడుతున్నారు. ఆర్థో, రేడియాలజీకి డిమాండ్: పీజీ వైద్య విద్యలో ఆర్థోపెడిక్, రేడియాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జన్, డెర్మటాలజీ సీట్లకు ఎక్కువ డిమాండ్ ఉంది. ఓపెన్ కేటగిరీలో మంచి ర్యాంకు వస్తేగానీ సీటు దక్కే పరిస్థితి లేదు. అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, ఫార్మకాలజీ విభాగాలపై మొగ్గుచూపట్లేదు. ఏప్రిల్ మూడో వారం నుంచి కౌన్సెలింగ్: పీజీ వైద్య సీట్లకు తొలి విడత కౌన్సెలింగ్ ఏప్రిల్ 3వ వారం నుంచి ప్రారంభమవుతుందని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ రవిరాజు చెప్పారు. మే 30 నాటికి ప్రక్రియ ముగియాల్సి ఉన్నా.. దానిని జూన్ 15 వరకూ పొడిగించామన్నారు. ఈ నెల 19 నుంచి మూడు రోజుల పాటు జరుగనున్న ఏఎఫ్ఆర్సీ సమావేశంలో ఫీజులను నిర్ణయిస్తారని తెలిపారు.