
ఒక్క లోక్‌సభ నియోజకవర్గానికి ఇద్దరు ఎంపీలుంటారా? ఇద్దరేం ఖర్మ... ముగ్గురు కూడా ఉన్నారు! ఎప్పుడు? ఎలా?
మన దేశంలో రాజకీయాలు చాలా క్లిష్టంగా ఉ న్నాయని ఇప్పుడనుకుంటున్నాం. కానీ స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో జరిగిన ఎన్నికల సమయంలో మరింత సంక్లిష్టంగా ఉన్నాయి. సాధారణంగా ఒక్క నియోజకవర్గానికి ఒక్కరే ప్రాతినిధ్యం వహిస్తారు. ఎన్నికలు జరిగేదే ఆ ప్రతినిధిని ఎన్నుకోవడానికి. కానీ తొలి రెండు సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం పలు నియోజకవర్గాలకు ఇద్దరేసి ఎంపీల ను ఎన్నుకున్నారు. 1961లో రద్దయ్యే దాకా ఇది కొనసాగింది. కొన్ని నియోజకవర్గాలకైతే ముగ్గురు ఎంపీలూ ఉన్నారు! దళితులు, గిరిజన సమూహాల వంటి అణగారిన వర్గాలకు పార్లమెంటులో ప్రాతినిధ్యం పెంచేందుకు ఈ ఏర్పాటు కలి్పంచారు.
తొలి ఎన్నికల్లో...
మొట్టమొదటి ఎన్నికల సమయంలో లోక్‌సభలో 400 స్థానాలున్నాయి. వీటిలో 314 స్థానాలకు ఒక్క ఎంపీ ఉండగా, 86 నియోజకవర్గాలకు ఒక జనరల్, మరొక షెడ్యూల్ కులాల ప్రతినిధి చొప్పున ఇద్దరేసి ఎంపీలు ఎన్నికయ్యారు. ఇలా ఇద్దరు ఎంపీలున్న నియోజకవర్గాలు యూపీలో 17, నాటి మద్రాసు రాష్ట్రంలో 13, బిహార్‌లో 11, బాంబేలో 8 ఉన్నాయి. పశి్చమబెంగాల్‌లోని నార్త్ బెంగాల్ నియోజకవర్గానికయితే ఏకంగా ముగ్గురు ఎంపీలు ప్రాతినిధ్యం వహించారు!
1957లో...
సీట్ల పునరి్వభజన అనంతరం 1957 సార్వత్రి క ఎన్నికల్లో 494 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో ఇద్దరు ఎంపీల స్థానాలు 57కు తగ్గాయి. వీటిలో అత్యధికంగా ఉత్తరప్రద్రేశ్‌లో 18, ఆంధ్రప్రదేశ్‌లో 8, బిహార్‌లో 8, పశి్చమబెంగాల్‌లో 8, బాంబేలో 8, మద్రాసులో 7 స్థానాలకు ఇద్దరు ఎంపీలు ప్రాతినిధ్యం వహించారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment