సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు విషయంలో ఎటువంటి తుదిగడువు లేదని కేంద్ర న్యాయశాఖ పేర్కొంది. విభజన చట్టంలో హైదరాబాద్ పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని పొందుపరిచిన విషయాన్ని సర్వోన్నత న్యాయస్ధానానికి నివేదించింది. ఏపీలో హైకోర్టు ఏర్పాటుకు సంబంధించిన అంశంపై సుప్రీంకోర్టులో గురువారం కేంద్ర న్యాయశాఖ ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేసింది.
ఏపీలో హైకోర్టు ఏర్పాటుకు అవసరమైన భవనాలు, మౌలిక సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలని స్పష్టం చేసింది.రాష్ట్ర ప్రభుత్వం, ఉమ్మడి హైకోర్టు కలిపి దీనిపై ఓ నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. ఏపీ సర్కార్ చొరవ తీసుకుంటే హైకోర్టు ఏర్పాటు ప్రక్రియ వేగవంతమవుతుందనే సంకేతాలు పంపింది.
భవనాలు, మౌలిక వసతులను ఏపీ సర్కార్ కల్పిస్తే కేంద్రం ఏపీకి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్‌ను జారీ చేస్తుందని తెలిపింది. కాగా, కేంద్రం అఫిడవిట్ నేపథ్యంలో హైకోర్టు ఏర్పాటుకు అవసరమైన భవనాలు, మౌలిక వసతుల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment