ఆర్మీ , వాయుసేనకు ప్రభుత్వం శనివారం కొత్త అధిపతులను ప్రకటించింది. లెఫ్టినెంట్ జనరల్ బిపిన్ రావత్‌ను ఆర్మీ చీఫ్‌గా, ఎయిర్ మార్షల్ బీఎస్ ధనోవాను ఐఏఎఫ్ చీఫ్‌గా నియమించింది. ప్రస్తుత అధిపతులు జనరల్ దల్బీర్ సింగ్, అరూప్ రాహాల స్థానాల్లో వీరు నియమితులయ్యారు. డిసెంబర్ 31న ఇద్దరూ బాధ్యతలు చేపడతారని రక్షణ శాఖ తెలిపింది. ఆర్మీ తదుపరి చీఫ్‌గా రేసులో ఉన్న సీనియర్ లెఫ్టినెంట్ జనరల్ ప్రవీణ్ బక్షిని తోసిరాజని రావత్ ఈ పదవికి ఎంపికవడం ఆశ్చర్యకరమే. రావత్‌కు 30 ఏళ్లుగా భారత సైన్యంలో వివిధ హోదాల్లో, యుద్ధ ప్రాంతాల్లో విధులు నిర్వర్తించిన అనుభవం ఉంది. ప్రస్తుతం నలువైపుల నుంచి ఎదురవుతున్న సవాళ్ల నేపథ్యంలో సైన్యాన్ని నడిపించేందుకు అతనే తగిన వ్యక్తని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.