dalbir singh suhag
-
ఆర్మీ కొత్త చీఫ్‌గా బిపిన్ రావత్
-
ఆర్మీ కొత్త చీఫ్‌గా బిపిన్ రావత్
వాయుసేనకు బీఎస్ ధనోవా ► ఐబీ, ‘రా’ లకూ కొత్త అధిపతులు న్యూఢిల్లీ: ఆర్మీ , వాయుసేనకు ప్రభుత్వం శనివారం కొత్త అధిపతులను ప్రకటించింది. లెఫ్టినెంట్ జనరల్ బిపిన్ రావత్‌ను ఆర్మీ చీఫ్‌గా, ఎయిర్ మార్షల్ బీఎస్ ధనోవాను ఐఏఎఫ్ చీఫ్‌గా నియమించింది. ప్రస్తుత అధిపతులు జనరల్ దల్బీర్ సింగ్, అరూప్ రాహాల స్థానాల్లో వీరు నియమితులయ్యారు. డిసెంబర్ 31న ఇద్దరూ బాధ్యతలు చేపడతారని రక్షణ శాఖ తెలిపింది. ఆర్మీ తదుపరి చీఫ్‌గా రేసులో ఉన్న సీనియర్ లెఫ్టినెంట్ జనరల్ ప్రవీణ్ బక్షిని తోసిరాజని రావత్ ఈ పదవికి ఎంపికవడం ఆశ్చర్యకరమే. రావత్‌కు 30 ఏళ్లుగా భారత సైన్యంలో వివిధ హోదాల్లో, యుద్ధ ప్రాంతాల్లో విధులు నిర్వర్తించిన అనుభవం ఉంది. ప్రస్తుతం నలువైపుల నుంచి ఎదురవుతున్న సవాళ్ల నేపథ్యంలో సైన్యాన్ని నడిపించేందుకు అతనే తగిన వ్యక్తని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఐబీ అధిపతిగా రాజీవ్ జైన్: అలాగే నిఘా సంస్థలు ఐబీ, ‘రా’లకు కూడా నూతన చీఫ్‌లను నియమించారు. జార్ఖండ్ కేడర్ సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ జైన్ ను ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ)కి, అనిల్ ధస్మానాను రా(రీసెర్చీ అండ్ అనాలిసిస్ వింగ్)కు అధిపతులుగా ఎంపికయ్యారు. రాజీవ్, అనిల్ ఈ పదవుల్లో రెండేళ్లు ఉంటారు. ఐబీలో ప్రత్యేక డైరెక్టర్‌గా పనిచేస్తున్న జైన్ జనవరి 1న దినేశ్వర్ శర్మ స్థానంలో బాధ్యతలు చేపడుతారు. 1980 బ్యాచ్ ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన జైన్ రాష్ట్రపతి పోలీసు మెడల్ గెల్చుకున్నారు. ఐబీలో కీలక కశ్మీర్ డెస్కు సహా పలు విభాగాల్లో పనిచేశారు. ఎన్డీఏ హయాంలో కశ్మీర్ వేర్పాటువాదులతో చర్చలు జరిపిన మధ్యవర్తి కేసీ పంత్‌కు సలహాదారుగా వ్యవహరించారు. ‘రా’ చీఫ్‌గా ఈ నెలాఖరున వైదొలగనున్న రాజిందర్ ఖన్నా స్థానంలో అనిల్ పగ్గాలు చేపడుతారు. ఆయన 1981 ఐపీఎస్ బ్యాచ్ మధ్యప్రదేశ్ కేడర్ అధికారి. గత 23 ఏళ్లుగా ‘రా’లో పాకిస్తాన్ డెస్కు సహా పలు కీలక విభాగాల్లో పనిచేశారు. -
స్వస్థలాలకు జవాన్ల మృతదేహాలు
న్యూఢిల్లీ: సియాచిన్‌లో హిమపాతం ప్రమాదంలో వీరమరణం పొందిన తొమ్మిదిమంది సైనికుల మృతదేహాల్ని న్యూఢిల్లీ నుంచి వారి సొంత రాష్ట్రాలకు పంపించారు. అంతకముందు పాలం విమానాశ్రయంలో కేంద్ర రక్షణ శాఖ సహాయమంత్రి ఇందర్జిత్ సింగ్, ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్ సుహాగ్, ఎయిర్‌ఫోర్స్ చీఫ్ అరుప్ రహలు వీరసైనికులకు నివాళులర్పించారు. ఫిబ్రవరి 3న జరిగిన దుర్ఘటనలో వీరమరణం పొందిన వారిలో సుబేదార్ నగేషా(కర్నాటక), హవాల్దార్ ఈలు అలై( తమిళనాడు), లాన్స్ హవాల్దార్ ఎస్.కుమార్(తమిళనాడు), లాన్స్ నాయక్ సుధీష్ (కేరళ), లాన్స్ నాయక్ హనుమంతప్ప ( కర్నాటక ), సిపాయ్ మహేషా(కర్నాటక), సిపాయ్ గణేషన్(తమిళనాడు), సిపాయ్ ముస్తాక్ అహ్మద్(ఆంధ్రప్రదేశ్), సిపాయ్ రామమూర్తి(తమిళనాడు), సిపాయ్ సూర్యవంశీ(మహరాష్ట్ర)లు ఉన్నారు. -
నరేంద్ర మోడీతో ఆర్మీ చీఫ్ భేటీ
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడీతో శుక్రవారం ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్ సమావేశమయ్యారు. చైనా, పాకిస్థాన్ సరిహద్దుల్లో పరిస్థితి గురించి మోడీకి వివరించారు. దల్బీర్ కీలక విషయాలపై ప్రధానికి ప్రజెంటేషన్ సమర్పించినట్టు ఆర్మీ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ కూడా పాల్గొన్నట్టు చెప్పారు. ఆర్మీ చీఫ్ ఈశన్య వాస్తవాధీన రేఖను సందర్శించిన తర్వాత మోడీతో భేటీ అయ్యారు. -
పాకిస్థాన్ కు భారత ఆర్మీ చీఫ్ వార్నింగ్
న్యూఢిల్లీ: పాకిస్థాన్ కు భారత సైనికదళాల కొత్త ప్రధానాధికారి జనరల్ దల్బీర్‌సింగ్ సుహాగ్ గట్టి హెచ్చరిక జారీచేశారు. తమ సైనికులపై దాడులకు పాల్పడితే చూస్తూ ఊరుకోబోమని అన్నారు. తగినరీతిలో జవాబు చెబుతామని వార్నింగ్ ఇచ్చారు. సైనికుల తలలు తీయడం లాంటి ఘటనలు జరిగితే అవసరమైనదానికంటే ఎక్కువగా, వేగంగా, ఘాటుగా స్పందిస్తామని హెచ్చరించారు. పదవి చేపట్టి 24 గంటలు గడవక ముందే ఆయనీ హెచ్చరికలు చేయడం విశేషం. 26వ ఆర్మీ చీఫ్‌గా గురువారం సుహాగ్ బాధ్యతలు చేపట్టారు. ఇద్దరు భారత సైనికుల తలలు నరికివేసిన ఘటనపై తగిన రీతిలోనే స్పందించామని మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ బ్రికమ్ సింగ్ సమర్థించుకున్నారు. -
ఆర్మీ చీఫ్‌గా జనరల్ సుహాగ్
న్యూఢిల్లీ: సైనికదళాల కొత్త ప్రధానాధికారిగా జనరల్ దల్బీర్‌సింగ్ సుహాగ్ గురువారమిక్కడ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఆ పదవిలో ఉన్న జనరల్ బ్రికమ్ సింగ్ నుంచి ఆయన బాధ్యతలు తీసుకున్నారు. 26వ ఆర్మీ చీఫ్‌గా నియమితులైన 59 ఏళ్ల సుహాగ్.. 30 నెలలపాటు ఆ పోస్టులో కొనసాగుతారు. గతేడాది డిసెంబర్లో ఆర్మీ స్టాఫ్ వైస్ చీఫ్‌గా నియమితులైన ఆయన్ను యూపీఏ సర్కారు గద్దె దిగే ముందు హడావుడిగా ఆర్మీ చీఫ్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇలాంటి కీలక నియామకాల విషయంలో అంత తొందర ఎందుకని, ఎన్నికలు పూర్తయ్యాక వచ్చే కొత్త ప్రభుత్వం ఇలాంటి అంశాలను చూసుకుంటుంది కదా అంటూ యూపీఏ నిర్ణయాన్ని బీజేపీ అప్పుడు తప్పుబట్టింది. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత జనరల్ సుహాగ్ నియామకాన్ని కొనసాగిస్తున్నట్టు కేంద్రం స్పష్టం చేసింది. -
నేడు అర్మీ ఛీఫ్‌గా దల్బీర్ సింగ్ సుహాగ్
-
ఆర్మీ చీఫ్‌గా దల్బీర్ సింగ్ నియామకం
న్యూఢిల్లీ: ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ దల్బీర్ సింగ్ నియమితులయ్యారు. రక్షణ శాఖ పంపిన సిఫారసుకు మంగళవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. జనరల్ బిక్రమ్ సింగ్ స్థానంలో దల్బీర్ సింగ్ స్థానంలో బాధ్యతలు చేపడుతారు. జూల్ 31న బిక్రమ్ సింగ్ పదవీ కాలం ముగియనుంది. ఆ తర్వాత దల్బీర్ సింగ్ ఆర్మీ చీఫ్‌గా కొనసాగుతారు. 59 ఏళ్ల దల్బీర్ సింగ్ ప్రస్తుతం ఆర్మీలో డిప్యూటీ చీఫ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 1987లో శ్రీలంకకు పంపిన భారత శాంతి పరిరక్షక దళంలో పనిచేశారు. -
దల్బీర్సింగ్కు లైన్ క్లీయర్
న్యూఢిల్లీ: ఆర్మీ కొత్త చీఫ్ నియామకం విషయంలో ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ అంశంలో ముందుకే వెళ్లాలని రక్షణ శాఖ నిర్ణయించింది. ఈ పదవికి ఆర్మీ స్టాఫ్ వైస్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ దల్బీర్‌సింగ్ సుహాగ్ పేరును సిఫారసు చేస్తూ రక్షణశాఖ కేబినెట్ నియామకాల కమిటీ (ఏసీసీ)కి నివేదించింది. లెఫ్టినెంట్ జనరళ్లలో ఈయనే సీనియర్. ప్రధాని అధ్యక్షతన గల ఏసీసీ దీనిపై తుది నిర్ణయం తీసుకోనుంది. ఎన్నికల సమయంలో ఆర్మీ కొత్త చీఫ్ నియామకాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించడంతో దీనిపై వివాదం నెలకొంది. ఈ నిర్ణయాన్ని ఎన్నికల అనంతరం ఏర్పడే కొత్త ప్రభుత్వానికి వదిలివేయాలని బీజేపీ కోరింది. దీనిపై ఈసీకి కూడా ఫిర్యాదు చేసింది. వాస్తవానికి రక్షణ శాఖకు సంబంధించి నియామకాలు, పదోన్నతులు, టెండర్లు, కొనుగోళ్లు అనేవి ఎన్నికల ప్రవర్తనా నియమావళి కిందకు రావని ఈసీ మార్చి 27నే స్పష్టం చేసింది. అయితే, బీజేపీ అభ్యంతరాల నడుమ ఈ అంశాన్ని కేంద్రం గత వారం ఈసీకి నివేదించింది. ఈసీ అనుమతిస్తేనే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో గత ఆదేశాలకు అనుగుణంగానే ఈ అంశంలో ప్రభుత్వం ముందుకు వెళ్లవచ్చని ఈసీ తాజాగా స్పష్టం చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి.