స్వస్థలాలకు జవాన్ల మృతదేహాలు
న్యూఢిల్లీ: సియాచిన్‌లో హిమపాతం ప్రమాదంలో వీరమరణం పొందిన తొమ్మిదిమంది సైనికుల మృతదేహాల్ని న్యూఢిల్లీ నుంచి వారి సొంత రాష్ట్రాలకు పంపించారు. అంతకముందు పాలం విమానాశ్రయంలో కేంద్ర రక్షణ శాఖ సహాయమంత్రి ఇందర్‌జిత్ సింగ్, ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్ సుహాగ్, ఎయిర్‌ఫోర్స్ చీఫ్ అరుప్ రహలు వీరసైనికులకు నివాళులర్పించారు.
ఫిబ్రవరి 3న జరిగిన దుర్ఘటనలో వీరమరణం పొందిన వారిలో సుబేదార్ నగేషా(కర్నాటక), హవాల్దార్ ఈలు అలై( తమిళనాడు), లాన్స్ హవాల్దార్ ఎస్.కుమార్(తమిళనాడు), లాన్స్ నాయక్ సుధీష్ (కేరళ), లాన్స్ నాయక్ హనుమంతప్ప ( కర్నాటక ), సిపాయ్ మహేషా(కర్నాటక), సిపాయ్ గణేషన్(తమిళనాడు), సిపాయ్ ముస్తాక్ అహ్మద్(ఆంధ్రప్రదేశ్), సిపాయ్ రామమూర్తి(తమిళనాడు), సిపాయ్ సూర్యవంశీ(మహరాష్ట్ర)లు ఉన్నారు.