న్యూఢిల్లీ: నూతన ఆర్మీ చీఫ్‌గా మనోజ్ ముకుంద్ నరవాణే బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఓ జాతీయ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ..ఉగ్రవాదులకు మద్దతిస్తున్న పాకిస్తాన్‌ను కట్టడి చేయడానికి భారత్ వద్ద పకడ్బందీ వ్యూహాలు ఉన్నాయని పేర్కొన్నారు. భారత్ చేపట్టిన దాడుల్లో పెద్ద ఎత్తున ఉగ్రవాదులు హతమవ్వడం పాక్ ఆర్మీకి పెద్ద ఎదురుదెబ్బ అని తెలిపారు. చైనా సరిహద్దులో బధ్రతా వ్యవస్థను మరింత పటిష్టం చేయనున్నామని తెలిపారు.
ఉగ్రవాదులపై పాక్ చూపిస్తున్న అలసత్వానికి ప్రపంచ దేశాలు కూడా పాక్‌కు దూరమైన విషయం తెలిసిందే. ఉగ్రవాదం ఏ విధంగా నష్టదాయకమొ ప్రపంచ దేశాలు గ్రహించాయని తెలిపారు. దేశంలో భద్రత వ్యవస్థను పటిష్టం చేసి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఆర్మీని సిద్దం చేయడమే తమ లక్ష్యమని..మానవ హక్కులను కాపాడడానికి ప్రత్యేక దృష్టి సారిస్తామని ముకుంద్ నరవాణే తెలిపారు. బిపిన్ రావత్ నుంచి నూతన ఆర్మీ చీఫ్‌గా మంగళవారం మనోజ్ ముకుంద్ నరవాణే బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment