New Strategy
-
ప్రీ ప్లానింగ్ ప్రోగ్రామ్ సిద్ధం చేసిన టీ కాంగ్రెస్
-
‘విమోచనం’తో బలపడేందుకు బీజేపీ వ్యూహాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విమోచన అమృతోత్సవాల ద్వారా రాష్ట్రంలో రాజకీయంగా బలపడేందుకు బీజేపీ వ్యూహాలను రూపొందించింది. వచ్చే ఏడాది సెపె్టంబర్ 17 దాకా నిర్వహించే కార్యక్రమాలను పార్టీ విస్తరణకు ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని బీజేపీ చాలా ఏళ్లుగా డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వాలపై వివిధ రూపాల్లో ఒత్తిడి తీసుకొచ్చింది. తమ ప్రయత్నాల వల్లే ఈ ఉత్సవాలకు ప్రాధాన్యం ఏర్పడిందన్న విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. జాతీయ సమైక్యతా దినోత్సవం పేరిట కార్యక్రమం నిర్వహించేందుకు టీఆర్ఎస్ సర్కార్‌ను దిగివచ్చేలా చేశామన్న సందేశాన్ని ప్రజల్లో చాటాలని నిర్ణయించింది. ఏకతాటిపైకి హిందువులు! రాజకీయంగా అధికార టీఆర్ఎస్, ఎంఐఎం, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ వ్యూహాలకు చెక్ పెట్టడమే కాకుండా ఆ మూడు పార్టీలూ ఒక్కటేనన్న సందేశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు బీజేపీ పెద్దలు కార్యాచరణ సిద్ధం చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది. హైదరాబాద్ విమోచన అంశంలో టీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్‌ల వైఖరిని ప్రజల్లో ఎండగట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. జాతీయవాదంతోపాటు తెలంగాణ సెంటిమెంట్ రగిల్చేందుకు, జనంలో బీజేపీ పట్ల సానుకూలత పెంచేందుకు ఈ కార్యక్రమాలు ఉపయోగపడతాయని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు టీఆర్ఎస్–ఎంఐఎం, గతంలో కాంగ్రెస్–ఎంఐఎం రాజకీయ దోస్తీని, అవకాశవాదాన్ని బట్టబయలు చేయాలని నిర్ణయానికొచ్చారు. విమోచనం విషయంలో ఆ మూడు పారీ్టల బాగోతాన్ని బయటపెట్టడంతోపాటు టీఆర్ఎస్కు బీజేపీయే అసలైన రాజకీయ ప్రత్యామ్నాయమన్న సందేశాన్ని ఇచ్చేలా కార్యక్రమాలు చేపట్టబోతున్నారు. రాష్ట్రంలో మెజారిటీ వర్గంగా ఉన్న హిందువులను ఏకతాటిపైకి తీసుకురావడానికి విమోచన ఉత్సవాలు దోహదపడతాయని బీజేపీ నాయకత్వం విశ్వసిస్తోంది. ఏడాది పాటు నిర్వహించే కార్యక్రమాలు బీజేపీకి రాజకీయంగా తప్పనిసరిగా ఉపకరిస్తాయన్న నమ్మకంతో ఆ పార్టీ నేతలున్నారు. ఇదీ చదవండి: అభివృద్ధికి నిధులివ్వవు, కోర్టుకెళ్తేనే నీళ్లిస్తావా? -
కామ్రేడ్... ‘కారెందుకెక్కారో’?
సాక్షి, హైదరాబాద్: పార్టీ సిద్ధాంతాలకి రాష్ట్ర కామ్రేడ్లు కొత్త భాష్యం చెబుతున్నారా? ప్రజల తరఫున అధికార పక్షంపై పోరాటమే కాదని, రాజకీయ అవసరాన్ని బట్టి అధికార పార్టీకి కూడా అండగా నిలవాలని భావిస్తున్నారా? నాగార్జున సాగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్కు మద్దతు ప్రకటన వెనుక సీపీఎం వ్యూహం అదేనా? ఎన్నికలనే తాత్కాలిక ఎత్తుగడలు కూడా పార్టీ దీర్ఘకాలిక ప్రయోజనాలకు ఉపయోగపడాలని రాష్ట్రంలోని మార్క్సిస్టులు నిర్ణయిం చుకున్నారా? అంటే అవుననే అంటున్నాయి సీపీఎం శ్రేణులు. ఇటీవల జరిగిన నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో అనూహ్యంగా టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించడం వెనుక వ్యూహం కూడా అదేనని, తెలంగాణలో బీజేపీని అడ్డుకోవాలంటే తమకు ఉన్న ఎంతో కొంత బలాన్ని టీఆర్ఎస్కు అందించడమే తక్షణ రాజకీయ కర్తవ్యమని సీపీఎం నేతలు నిర్ణయించు కున్నారని తెలుస్తోంది. అవసరమైతే 2023లో జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే వ్యూహాన్ని అవలంబించాలన్న అంచనాకు కూడా ఆ పార్టీ నేతలు వచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. శత్రువుకి శత్రువు... మిత్రుడే.. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయంతో మంచి ఊపు మీదున్న బీజేపీ రానున్న అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్రంలో మరింత పుంజు కుంటుందనే అంచనాకు సీపీఎం రాష్ట్ర నాయకత్వం వచ్చింది. అదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందని, ప్రత్యామ్నాయ రాజ కీయ శక్తి రేసులో ఆ పార్టీని బీజేపీ వెనక్కు నెట్టి వేస్తుందని అభిప్రాయపడుతోంది. ఈ పరిస్థి తుల్లో తాము ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పక్షాన నిలబడి ఉపయోగం లేదని కామ్రేడ్లు ఓ అంచనాకు వచ్చారు. టీఆర్ఎస్ మద్దతుతో చట్టసభల్లో ప్రాతినిథ్యం దక్కించుకునే వ్యూహాన్ని అమలు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ‘రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులను బట్టి ఎన్నికల అంశాన్ని భిన్న కోణంలో ఆలోచించాల్సిందే. ఎన్నికలు జరిగే సమయంలో కేవలం పార్టీ సిద్ధాంతాలే కాదు.. అనేక అంశాలు ఓటర్లను ప్రభావితం చేస్తున్నాయి. ఈ దశలో గుడ్డిగా వెళ్లడం పార్టీకి నష్టం కలిగిస్తుంది. ఇప్పటికి నష్టపోయింది చాలు. ఇంకా మేం నష్టపోకుండా ఉండాలంటే కఠిన నిర్ణయం తీసుకోక తప్పదు’ అని సీపీఎం రాష్ట్ర నాయకుడొకరు వ్యాఖ్యానించడం ఆ పార్టీ మూడ్‌ను తేటతెల్లం చేస్తోంది. ప్రజల్లో చర్చ జరిగితే మంచిదే! కాగా, నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో తాము పోటీ చేయాలా... ఎవరికైనా మద్దతివ్వాలా అనే అంశంపై సీపీఎం పెద్ద కసరత్తే చేసింది. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తే ఎన్ని ఓట్లు వస్తాయన్న దానిపై పార్టీ జిల్లా కమిటీ నుంచి లెక్కలు తెప్పించుకున్న రాష్ట్ర నాయకత్వం తాము పోటీ చేయకపోవడమే మేలనే అంచనాకు వచ్చింది. ఇక, ఎవరికి మద్దతివ్వాలన్న దానిపై పార్టీ రాష్ట్ర కమిటీలో పెద్ద చర్చే జరిగినట్టు తెలుస్తోంది. ఈ విషయమై జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో నేతలు రెండుగా చీలిపోయినట్టు సమాచారం. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్కు మద్దతివ్వాలని పార్టీ చేసిన ప్రతిపాదనను కొందరు నేతలు వ్యతిరేకించారని తెలిసింది. కాంగ్రెస్‌కు మద్దతివ్వడమే రాజకీయంగా ఉపయోగపడుతుందనే అభిప్రాయం వారు వెలిబుచ్చినట్టు వారు సమాచారం. కానీ, పార్టీ రాష్ట్ర నాయకత్వం ఈ అభిప్రాయాలను అంగీకరించలేదు. ‘ఇప్పుడు టీఆర్ఎస్కు మద్దతిస్తే పార్టీ గురించి చాలా రకాలుగా మాట్లాడుకోవచ్చు. అయినా సరే... అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండేళ్లు సమయమున్నందున దీనిపై ప్రజల్లో చర్చ జరగాల్సిందే. బీజేపీ దూసుకొచ్చిన తర్వాత కూడా మనం శషభిషలకు పోతే నష్టపోతాం. దుబ్బాకలో కూడా తప్పుడు అంచనాతో స్వతంత్ర అభ్యర్థికి మద్దతు ప్రకటించి టీఆర్ఎస్ ఓటమికి పరోక్షంగా దోహదపడ్డాం. అందుకే సాగర్‌లో టీఆర్ఎస్కు మద్దతివ్వడమే కరెక్ట్. ఈ ఎన్నికలే కాదు 2023 ఎన్నికలకు కూడా నిర్ణయం ఇదే విధంగా ఉండొచ్చు. పార్టీ శ్రేణులకు, అటు ప్రజలకు సర్దిచెప్పాల్సిందే’ అని రాష్ట్ర నాయకత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు మార్క్సిస్టు వర్గాల్లో ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. కాగా, రానున్న ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్తోనే కలిసి వెళ్లాలనే మార్క్సిస్టు పార్టీ నేతల వ్యూహం చూస్తే ఎప్పటిలాగే 2023లో కూడా వామపక్షాల ఐక్యత ఎండమావేనని, సీపీఐ, సీపీఎంలు మళ్లీ పొత్తు పెట్టుకున్నా, టీఆర్ఎస్ మాటునే పెట్టుకోవాల్సి ఉంటుందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. -
ఫ్లిప్‌కార్ట్ సరికొత్త ఆవిష్కరణ!
ముంబై: ఈ–కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఎప్పటికప్పుడు సరికొత్త ఆవిష్కరణలతో తమ కస్టమర్లకు చేరువ కావడానికి ప్రయత్నిస్తుంటుంది. తాజాగా ఈ కామెర్స్ రంగంలో విపరీతమైన పోటీ నెలకొనడంతో ఫ్లిప్‌కార్ట్ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. ఇది వరకు నిత్యావసర వస్తువులు ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉండేవి కావని, కానీ తాజాగా స్థానిక స్టోర్స్‌ల సహాయంతో కేవలం 90 నిమిషాల్లోనే నిత్వావసర వస్తువులను డెలివరీ చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఈ కామర్స్‌లో జియో మార్ట్, అమెజాన్ సంస్థల రూపంలో ఫ్లిప్‌కార్ట్ తీవ్ర పోటీని ఎదుర్కొంటుంది. ఈ క్రమంలో పోటీ సంస్థలకు దీటుగా ఎదుర్కొవడానికి ఫ్లిక్‌కార్ట్ ప్రణాళికలు రూపొందించినట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. కాగా వినియోగదరులకు మెరుగైన సేవలందించేందుకు లాజిస్టిక్స్ సంస్థ షాడోఫాక్స్‌తో ఫ్లిప్‌కార్ట్ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. మొదటగా అత్యున్నత ప్రమాణాలు కలిగిన గిడ్డంగులు, స్టోర్లతో ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. ఈ ప్రాజెక్ట్ మొదటగా బెంగుళూరులో ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు అభిపప్రాయపడుతున్నారు. (చదవండి: అపుడు లాక్డౌన్ పరిస్థితి వచ్చి వుంటే..) -
జంపింగ్ జపాంగ్‌లకు.. అగ్రిమెంట్ ముకుతాడు!
సాక్షి, నల్లగొండ : ఎన్నికల్లో విజయం సాధించాక.. గెలిపించిన పార్టీని వీడి ఇతర పార్టీల్లో చేరకుండా కాంగ్రెస్ ముందే జాగ్రత్త పడుతోంది. జిల్లాలోని ఏడు మున్సిపాలిటీలపై కన్నేసిన ఆ పార్టీ నాయకత్వం ఒకింత ముందస్తుగానే ఆచితూచి అడుగులు వేస్తోంది. పార్టీ బీ – ఫారంపై గెలిచాక.. అభివృద్ధి పేర అధికార టీఆర్ఎస్లోకి మారుతున్న ప్రజాప్రతినిధుల సంఖ్య పెరిగింది. దీంతో ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఆయా వార్డుల్లో కౌన్సిలర్లుగా గెలిచాక పార్టీ మారకుండా ఉండేలా ముందుగానే ఒప్పందం చేసుకోవాలని, పార్టీ మారబోమని వారితో అగ్రిమెంటు కుదుర్చుకోవాలని కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయించిందని చెబుతున్నారు. ఇవిగో.. గత అనుభవాలు జిల్లాలో జరిగిన ప్రతి ఎన్నికల్లో ఒక పార్టీనుంచి గెలిచిన వారు ఆ తర్వాత అధికార పార్టీలో చేరుతున్నారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో కాంగ్రెస్ రెండు అసెంబ్లీ స్థానాలను గెలుచుకోగా నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నియోజవకర్గ అభివృద్ధి పేర టీఆర్ఎస్ బాట పట్టారు. ఆ తర్వాత జరిగిన పంచాయతీరాజ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ సభ్యులుగా కాంగ్రెస్ గుర్తుపై గెలిచిన వారు పలు మండలాల్లో ఎంపీపీ ఎన్నికల సందర్భంగా పార్టీ మారారు. దీంతో కాంగ్రెస్ కొన్నిచోట్ల ఎంపీపీ పదవులను దక్కించుకోలేకపోయింది. ఇక, 2014లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో నల్లగొండ మున్సిపాలిటీలో 40 వార్డులకుగాను 22 వార్డులను గెలుచుకుని చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంది. కానీ, ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌కు చెందిన పదిహేను మంది కౌన్సిలర్లు టీఆర్ఎస్ గూటికి చేరారు. చైర్‌పర్సన్‌గా ఉన్న లక్ష్మి కూడా టీఆర్ఎస్లోకి వెళ్లి కొద్ది రోజులకే తిరిగి సొంత గూటికి చేరారు. పార్టీ మారిన కౌన్సిలర్లలో మరో నలుగురు కూడా తిరిగి వెనక్కి వచ్చేశారు. మిగతా వారు అధికార పార్టీలోనే ఉన్నారు. మిర్యాలగూడ మున్సిపాలిటీలోనూ ఇదే జరిగింది.. మొత్తం 36 వార్డులకు గాను 30 వార్డులను కాంగ్రెస్ గెలుచుకుని పాలకవర్గాన్ని ఏర్పాటు చేసింది. కానీ, కొన్నాళ్లకు ఈ 30మందిలో ఏకంగా 25మంది టీఆర్ఎస్లోకి మారిపోయారు. గత ఎన్నికల నాటికి నగర పంచాయతీగా ఉన్న దేవరకొండలో కాంగ్రెస్ తరఫున గెలిచిన 11 మంది కౌన్సిలర్లలో 10మంది పార్టీ మారారు. మూడు చోట్లా పాలక వర్గాలను కాంగ్రెస్ ఏర్పాటు చేసినా.. పదవీ కాలం పూర్తయ్యే వరకు నల్లగొండ మాత్రమే కాంగ్రెస్ చేతిలో మిగలగా, మిర్యాలగూడ, దేవరకొండ టీఆర్ఎస్ ఖాతాలో చేరిపోయాయి. ఈ గత అనుభవాలను పరిగణనలోకి తీసుకుని కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ముందుగానే అగ్రిమెంట్ ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఏడు చోట్లా విజయావకాశాలను ఉన్నాయని ఆశిస్తున్న కాంగ్రెస్ నాయకత్వం ఫలితాల తర్వాత పరిస్థితి తారుమారు కాకుండా ఎత్తులు వేస్తోంది. గెలిచాక పార్టీ మారబోమని ఒప్పందాలు చేసుకుంటోంది. పార్టీ బీ– ఫారం ఇచ్చి, కొంత ఖర్చు పెట్టి గెలిపించుకుంటుంటే ఆ తర్వాత పార్టీ మారిపోతున్నారని, ఈసారి ఇలాంటి సంఘటనలను నివారించేందుకు పీసీసీ నాయకత్వమే ఈ ఆలోచన చేసిందని జిల్లా పార్టీ నాయకత్వం చెబుతోంది. అయితే, మున్సిపల్ ఎన్నికల్లో గెలిచాక ఎందరు కౌన్సిలర్లు ఈ అగ్రిమెంట్‌కు కట్టుబడి ఉంటారు..? పార్టీ మారకుండా మాతృపార్టీనే నమ్ముకుని ఎంతమంది నిలబడతారు..? ఈ అగ్రిమెంటుకు ఎంత విలువ ఉంటుంది..? అన్న ప్రశ్నలకు మాత్రం కాంగ్రెస్ నాయకుల వద్ద సరైన సమాధానం లభించడం లేదు. ఒప్పందాన్ని మీరకుండా కట్టుబడి ఉండడం నైతిక విలువలకు సంబంధించిన అంశమని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. బాండ్ పేపర్‌పై అగ్రిమెంటుతోపాటు, ఎన్నికల్లో ఖర్చుల కోసం ఇచ్చే మొత్తానికి చెక్కులు కూడా రాయించుకునే వీలుందని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ ముందుగానే చైర్మన్ అభ్యర్థులను ప్రకటిస్తోంది. దీంతో వార్డు అభ్యర్థులకు.. చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించిన నేతకు మధ్య ఈ ఒప్పందం ఉంటుందా..? లేక, అభ్యర్థికి, పార్టీకి మధ్య ఉంటుందా..? అన్న అంశం తేలాల్సి ఉందని చెబుతున్నారు. -
నూతన ఆర్మీ చీఫ్ నరవాణే కీలక వ్యాఖ్యలు..
న్యూఢిల్లీ: నూతన ఆర్మీ చీఫ్‌గా మనోజ్ ముకుంద్ నరవాణే బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఓ జాతీయ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ..ఉగ్రవాదులకు మద్దతిస్తున్న పాకిస్తాన్‌ను కట్టడి చేయడానికి భారత్ వద్ద పకడ్బందీ వ్యూహాలు ఉన్నాయని పేర్కొన్నారు. భారత్ చేపట్టిన దాడుల్లో పెద్ద ఎత్తున ఉగ్రవాదులు హతమవ్వడం పాక్ ఆర్మీకి పెద్ద ఎదురుదెబ్బ అని తెలిపారు. చైనా సరిహద్దులో బధ్రతా వ్యవస్థను మరింత పటిష్టం చేయనున్నామని తెలిపారు. ఉగ్రవాదులపై పాక్ చూపిస్తున్న అలసత్వానికి ప్రపంచ దేశాలు కూడా పాక్‌కు దూరమైన విషయం తెలిసిందే. ఉగ్రవాదం ఏ విధంగా నష్టదాయకమొ ప్రపంచ దేశాలు గ్రహించాయని తెలిపారు. దేశంలో భద్రత వ్యవస్థను పటిష్టం చేసి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఆర్మీని సిద్దం చేయడమే తమ లక్ష్యమని..మానవ హక్కులను కాపాడడానికి ప్రత్యేక దృష్టి సారిస్తామని ముకుంద్ నరవాణే తెలిపారు. బిపిన్ రావత్ నుంచి నూతన ఆర్మీ చీఫ్‌గా మంగళవారం మనోజ్ ముకుంద్ నరవాణే బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. -
గెలుపు కోసం టీటీడీపీ వ్యూహం
-
టీకెట్ల కోసం '1300' ధరఖాస్తులు
-
సమైక్యరాష్ట్రం కొరకు వైస్సాఆర్ సీపీ ప్రత్యేక కార్యాచరణ
-
కొత్త పల్లవి అందుకున్న చంద్రబాబు
-
రాష్ట్ర విభజనపై చంద్రబాబునాయుడు కొత్త పల్లవి
తెలంగాణ విభజనకు అనుకూలంగా సీడబ్ల్యూసీ నిర్ణయం ప్రకటించిన తర్వాత సీమాంధ్రలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నా పది రోజులుగా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఉన్నట్టుండి కొత్త పల్లవి అందుకున్నారు. సమస్యలు పరిష్కరించకుండా నిర్ణయమెలా తీసుకుంటారంటూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడిన మరుసటి రోజు చంద్రబాబు కూడా మేల్కొన్నారు. సీఎం చెప్పిన విషయాలనే ప్రస్తావిస్తూ శుక్రవారం ప్రధానమంత్రికి లేఖ రాశారు. వాస్తవానికి సీమాంధ్ర ప్రజలు చేస్తున్న ఉద్యమంలో పాల్గొంటామని ఆ ప్రాంత పార్టీ నేతలు కొద్ది రోజులుగా అడుగుతున్నా ఒక్కమాట మాట్లాడటానికి వీలులేదంటూ చంద్రబాబు హుకుం జారీ చేశారు. కానీ వారం రోజులుకు పైగా మౌనం తర్వాత సీఎం మాట్లాడగా.. ఆ మరుసటి రోజే బాబు ప్రధానికి లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న ప్రజల ఆందోళనలకు పరిష్కారం చూపాలని టీడీపీ అధ్యక్షుడు శుక్రవారం రాత్రి ప్రధానికి రాసిన లేఖలో కోరారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులను చూసి తీవ్రమైన మానసిక క్షోభతో ఈ లేఖ రాస్తున్నట్లు పేర్కొన్నారు. ఎనిమిదిన్నర కోట్ల ప్రజల భవిష్యత్తును ప్రభావితం చేసే నిర్ణయం తీసుకునే సమయంలో అన్ని పక్షాలతో చర్చించిన తర్వాతే కేంద్రం సముచిత నిర్ణయం తీసుకుంటుందని భావించామని, కానీ రాష్ట్ర విభజన అంశాన్ని కాంగ్రెస్ తన సొంత నిర్ణయంలా భావించిందని విమర్శించారు. విభజన అంశాన్ని 2004 నుంచి తన సొంత కోణంలోనే కాంగ్రెస్ చూస్తోందని పేర్కొన్నారు. 2009లో చేసిన ప్రకటనల వల్ల రాష్ట్రంలో అశాంతి, అనిశ్చితి ఏర్పడిందని, ఆత్మహత్యలకు పురిగొల్పిందని, తాజాగా తీసుకున్న నిర్ణయం సైతం అలాంటి పరిస్థితుల దిశగా సాగేలా ఉందని వివరించారు. కేంద్రం శ్రీకృష్ణ కమిటీ నివేదికను సైతం పరిగణనలోకి తీసుకోలేదని తెలిపారు. తెలంగాణ అనుకూల లేఖను ప్రస్తావించని బాబు అయితే తెలంగాణకు అనుకూలంగా 2008లో టీడీపీ తీర్మానం చేసి లేఖ పంపిన విషయం ప్రధానికి రాసిన లేఖలో చంద్రబాబు ఎక్కడా ప్రస్తావించలేదు. వాస్తవానికి సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్న తర్వాత, నిర్ణయం తీసుకోవడానికి రెండురోజుల ముందు కూడా తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖకు కట్టుబడి ఉన్నానని చంద్రబాబు చెప్పారు. ఆ విషయాన్ని కూడా ఆయన మాటమాత్రంగానైనా లేఖలో వివరించలేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ, యూపీఏ సమన్వయ కమిటీ గత నెల 30న నిర్ణయం తీసుకున్నాయి. ఆరోజు రాత్రి మీడియాతో మాట్లాడతానని తొలుత సమాచారం పంపిన చంద్రబాబు తర్వాత మనసు మార్చుకుని మొహం చాటేశారు. 31వ తేదీన మీడియా సమావేశంలో సీడబ్ల్యూసీ, యూపీఏ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తున్నట్లు మాట్లాడారు. సీమాంధ్రలో రాజధాని నిర్మాణానికి 4 నుంచి 5 లక్షల కోట్ల రూపాయలు ఖర్చవుతుందని, ఆ మొత్తాన్ని కేంద్రమే భరించాలని చెప్పారు. ఆ విషయాలు కూడా చంద్రబాబు ప్రధానికి రాసిన లేఖలో ప్రస్తావించలేదు. తెలంగాణ అంశాన్ని త్వరగా పరిష్కరించాలని కోరుతూ గత ఏడాది ప్రధానికి రాసిన లేఖ అంశాన్నీ మాటమాత్రంగానైనా తాజా లేఖలో గుర్తు చేయలేదు. సీమాంధ్రలో ప్రజలు పెద్దఎత్తున ఉద్యమబాట పట్టిన నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్ ఎన్జీవోల సంఘం ప్రతినిధులు, సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల సంఘం ప్రతినిధులు వేర్వేరుగా చంద్రబాబును కలిసి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చాననీ, మనవాళ్లు బెంగళూరుకు వెళ్లి అక్కడ బతకడం లేదా? అంటూ ఉద్యోగుల్ని బాబు ప్రశ్నించారు. హైదరాబాద్‌లో మీకేం ఇబ్బంది అంటూ చేతులెత్తేసి ఇప్పుడు ఒక్కసారిగా సీమాంధ్ర సమస్యలను ప్రస్తావిస్తూ ప్రధానికి లేఖ రాయడంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఊహించని విధంగా సీమాంధ్రలో ఆందోళనలు రోజురోజుకూ ఉధృతమవుతుండటం, సీఎం సమైక్యాంధ్ర అనుకూల వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలోనే చంద్రబాబు సీమాంధ్ర ప్రజలపై ప్రేమ ఒలకబోస్తూ కొత్త రాగం అందుకున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాబు ఊసరవెల్లి: కేసీఆర్ చంద్రబాబు సమయాన్నిబట్టి రంగులు మార్చే ఊసరవెల్లి అని టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ దుయ్యబట్టారు. బాబు ప్రధానికి రాసిన లేఖలో తెలంగాణ సమస్యలను, ఆ ప్రాంత ప్రజల ఇబ్బందులను ప్రస్తావించలేదని మండిపడ్డారు. ‘ఎవరినీ సంప్రదించకుండా తెలంగాణ ఇచ్చారన్న ఆయన మాటలు పచ్చి అబద్ధం. అఖిలపక్ష భేటీలో టీడీపీ పాల్గొనలేదా, అభిప్రాయాలు చెప్పలేదా?’ అని ప్రశ్నించారు. విభజనపై సీఎం స్పందించిన తర్వాత ప్రధానికి లేఖ ఇంతకాలం సమైక్యాంధ్ర ఉద్యమాన్ని పట్టించుకోని టీడీపీ అధినేత అకస్మాత్తుగా రాగం మార్చి సీమాంధ్ర ప్రజలపై ప్రేమ ఒలకబోత