జమ్మూకశ్మీర్‌లో ఆర్మీ చీఫ్ పర్యటన | Army Chief arriving in jammu and kashmir to review security situation | Sakshi
Sakshi News home page

జమ్మూకశ్మీర్‌లో ఆర్మీ చీఫ్ పర్యటన

Published Sat, Oct 1 2016 9:41 AM | Last Updated on Mon, Sep 4 2017 3:48 PM

జమ్మూకశ్మీర్‌లో ఆర్మీ చీఫ్ పర్యటన

జమ్మూకశ్మీర్‌లో ఆర్మీ చీఫ్ పర్యటన

జమ్మూ: సర్జికల్ ఆపరేషన్స్ అనంతరం భారత్-పాక్ సరిహద్దులోని పరిస్థితులు వేడిమీద ఉన్న నేపథ్యంలో.. భారత ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ శనివారం కశ్మీర్లో పర్యటిస్తున్నారు. సరిహద్దు ప్రాంతంలోని భద్రతా వ్యవహారాలను ఆయన సమీక్షించనున్నారు.

ఎల్ఓసీని దాటి ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం విరుచుకుపడిన అనంతరం జమ్మూకశ్మీర్‌లో భారత ఆర్మీ చీఫ్ తొలి పర్యటన ఇదే కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఉధంపూర్లోని ఉత్తర కమాండ్ హెడ్ క్వార్టర్స్లో జరిగే సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. ఎల్ఓసీ ప్రాంతంలో సైతం దల్బీర్ సింగ్ పర్యటించే అవకాశం ఉందని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement