
సోషల్ మీడియాలో వీడియోలు పెట్టారో...
న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో వీడియోలు పెడితే చర్యలు తప్పవని జవాన్లకు ఆర్మీ చీఫ్ వార్నింగ్ బిపిన్ రావత్ హెచ్చరిక జారీ చేశారు. సమస్యలు ఉంటే నేరుగా తనను కలవొచ్చని చెప్పారు. ‘ఎవరికి ఏ సమస్య ఉన్నా నేరుగా వచ్చి నన్ను కలవొచ్చ’ని రావత్ స్పష్టం చేశారు. సైనికుల సమస్యలను తెలుసుకునేందుకు హెడ్ క్వార్టర్స్ లో ఫిర్యాదు పెట్టెలను పెడతామని చెప్పారు. వీటి ద్వారా జవానులు తాము ఇబ్బందులను ఉన్నతాధికారుల దృష్టికి తీసురావొచ్చని చెప్పారు.
సోషల్ మీడియోలో వీడియోలు పెట్టొద్దని, సమస్యలను అంతర్గతంగా పరిష్కరించుకునేందుకు ప్రయత్నించాలని సూచించారు. ఆర్మీ జవానుతో పాటు బీఎస్‌ఎఫ్, సీఆర్పీఎఫ్ సైనికులు తాము ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఏకరవుపెడుతూ వీడియోలను సోష్టల్ మీడియా పోస్టు చేయడం కలకలం రేపింది. ఈ వ్యవహారంపై ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించింది.