న్యూఢిల్లీ : స్వలింగ సంపర్కం నేరకాదంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఆర్మీలో మాత్రం ఇలాంటివి కుదరవంటున్నారు ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్. మీడియాతో మాట్లాడుతూ.. స్వలింగ సంపర్కుల్ని సైన్యంలోకి అనుమతించం అన్నారు. ఇలాంటి(ఎల్‌జీబీటీ) విషయాలు ఆర్మీలో ఆమోదయోగ్యం కాదని ఆర్మీ యాక్ట్‌లోని పలు సెక్షన్లలో ఉందని తెలిపారు. ‘మేం (ఆర్మీ)సుప్రీం కోర్టుకంటే అధికులమని కూడా కాదు.. దేశంలో ఉన్న చట్టాలు అందరికి సమానంగానే వర్తిస్తాయి. కానీ సైన్యంలోకి వచ్చేవారు మాత్రం కొన్ని హక్కులను, సంతోషాలను వదులుకోవాల్సి ఉంటుంద’న్నారు బిపిన్ రావత్.
అంతేకాక ఎల్‌జీబీటీ వంటి విషయాల్ని జనాలు ఎలా స్వీకరిస్తారు.. అసలు ఇలాంటి వాటిని అంగీకరిస్తారా.. లేదా అనేది భవిష్యత్తులో తెలుస్తుందన్నారు. గత ఏడాది సెప్టెంబరులో సుప్రీంకోర్టు స్వలింగ సంపర్కం నేరం కాదంటూ చరిత్రాత్మక తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. సమానత్వ హక్కును అది ఉల్లంఘిస్తోందంటూ 158ఏళ్ల నాటి చట్టాన్ని కోర్టు కొట్టేసింది.
Comments
Please login to add a commentAdd a comment