భారత దేశపు మొట్టమొదటి చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ అధికారి బిపిన్ రావత్ బయో వార్ ముప్పు గురించి ప్రకటించిన మరుసటి రోజే హెలికాప్టర్ క్రాష్ ప్రమాదంలో చిక్కుకున్నారు. డిసెంబరు 20 నుంచి 22 వరకు పూనేలో బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్, భూటాన్, థాయ్‌లాండ్, శ్రీలంక, ఇండియా) దేశాల కూటమి బిమ్స్‌టెక్ ఆధ్వర్యంలో విపత్తు నిర్వాహాణకు సంబంధించి పానెక్స్ 21 సదస్సు జరగనుంది. దీనికి కర్టెన్ రైజర్ కార్యక్రమం మంగళవారం న్యూఢిల్లీలో జరిగింది. ఇందులో సీడీఎస్ బిపిన్ రావత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ కారణంగా ప్రపంచం మొత్తం ప్రమాదంలో పడిందన్నారు. కరోనా విపత్తు సమయంలో సాయుధ బలగాలు శ్రమించి పని చేశాయన్నారు. అయితే రాబోయే రోజుల్లో ప్రపంచానికి బయోవార్ ముప్పు ఉందనింటూ రావత్ హెచ్చరించారు. బయోవార్ ఇప్పుడిప్పుడే ఓ రూపు తీసుకుంటోందన్నారు. ఈ బయోవార్‌ని కలిసికట్టుగా ఎదుర్కొవాలంటూ బిమ్స్‌టెక్ దేశాలకు పిలుపునిచ్చారు. ఇందుకోసం పరస్పర సహాకారం అందించుకోవాలని సూచించారు.
ప్రమాదం
పానెక్స్ సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన తమిళనాడు పర్యటనకు వచ్చారు. భార్య, ఇతర ఆర్మీ అధికారులతో కలిసి హెలికాప్టర్‌లో ప్రయాణిస్తుండగా కూనురు దగ్గర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాద ఘటనలో నలుగురు చనిపోయినట్టు అధికారులు ప్రకటించగా.. ఆర్మీ విచారణకు ఆదేశించింది. అయితే ప్రమాదం జరిగిన తర్వాత బిపిన్ రావత్, ఆయన భార్య ఆచూకీ లభించలేదు. అధికారులు ఈ విషయంపై ఎటువంటి స్పష్టమైన ప్రకటన చేయలేదు. దీంతో దేశవ్యాప్తంగా బిపిన్ రావత్ తాజా పరిస్థితిపై ఆందోళన నెలకొంది. చివరకు సాయంత్రం 6 గంటల సమయంలో బిపిన్ రావత్ చనిపోయినట్టు ప్రభుత్వం ప్రకటించింది.
ఉత్తరఖండ్ నుంచి
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా ఉన్న బిపిన్ రావత్ ఉత్తర్‌ఖండ్ రాష్ట్రానికి చెందిన వారు. ఆయన తండ్రి లక్ష్మణ్ సింగ్ రావత్ ఆర్మీలో పని చేసి లెఫ్టినెంట్ జనరల్ హోదాలో రిటైర్ అయ్యారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ ద్వారా ఆయన ఆర్మీలోకి వచ్చారు. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ఇండియన్ ఆర్మీ చీఫ్ స్థాయికి చేరుకున్నారు. ఆ తర్వాత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా త్రివిధ దళలాకు అధిపతిగా 2020 జనవరి 1న పదవీ బాధ్యలు స్వీకరించారు.
చదవండి: కుప్పకూలిన బిపిన్ రావత్ హెలికాప్టర్, 11 మంది మృతి
Comments
Please login to add a commentAdd a comment