షవేంద్ర సిల్వ
వాషింగ్టన్: శ్రీలంక ఆర్మీ చీఫ్ షవేంద్ర సిల్వను అమెరికాలోకి అనుమతించబోమని ఆ దేశ విదేశాంగ మంత్రి మైక్ పాంపియో చెప్పారు. 2009 అంతర్యుద్ధంలో భారీగా మానవహక్కుల ఉల్లంఘనలకు అతడు పాల్పడినట్లు తమ వద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని చెప్పారు. ఆయా ఆధారాలను ఐక్యరాజ్యసమితి సహా పలు సంస్థలు కూడా గుర్తించాయని అన్నారు. షవేంద్రతో పాటు అతడి కుటుంబ సభ్యులు కూడా అమెరికాలో ప్రవేశించేందుకు అనర్హులని చెప్పారు. శాంతిని, మానవ హక్కులను పెంపొందించాలంటూ శ్రీలంక ప్రభుత్వానికి అమెరికా సూచించింది. (చదవండి: సీక్రెట్ చెప్పేసిన ప్రపంచ కురు వృద్దుడు)
Comments
Please login to add a commentAdd a comment