Mike Pompeo
-
సుష్మా స్వరాజ్‌పై అమెరికా మాజీ విదేశాంగ మంత్రి సంచలన వ్యాఖ్యలు
భారత మాజీ విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌పై అమెరికా మాజీ విదేశాంగ మంత్రి మైక్ పాంపియా అమర్యాదకరమైన వ్యాఖ్యలు చేశారు. ఆమెను తానెప్పుడూ భారత దేశ రాజకీయాల్లో ప్రముఖమైన నాయుకురాలిగా చూడలేదన్నారు. ఈ మేరకు తాను రాసిన "నెవర్ గివ్ ఏ ఇంచ్ : ఫైటింగ్ ఫర్ ది అమెరికా ఐ లవ్"లో సుష్మా స్వరాజ్‌ని కొన్ని అమెరికన్ పదాలతో అవమానకరంగా వర్ణించారు. అంతేగాదు సుష్మా రాజకీయం పరంగా ఆమె కీలకపాత్రధారి కాకపోవడంతోనే మోదీకి అత్యంత సన్నిహితుడు, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్‌తో సన్నిహితంగా పనిచేశానని తన పుస్తకంలో రాశాడు. వాస్తవానికి సుష్మా స్వరాజ్ మోదీ ప్రభుత్వంలో మే 2014 నుంచి 2019 వరకు విదేశాంగ మంత్రిగా పనిచేశారు. ఆమెతో దౌత్యానికి సంబంధించిన విషయాల్లో తాను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు చెప్పాడు. ఇకపోతే తదుపరి భారత విదేశాంగా మంత్రి.. 2019లో కొత్తగా నియమితులైన జైశంకర్‌ని తాను స్వాగతించానని, పైగా అతను తనకు అత్యంత సన్నిహితుడని చెప్పారు పాంపియో. అతను మాట్లాడే ఏడు భాషల్లో ఇంగ్లీష్ ఒకటని, అది తనకంటే బాగా మెరుగ్గా ఉంటుందని అన్నారు. ఆయనను తాను ఎంతగానో ప్రేమిస్తున్నానని తన పుస్తకంలో చెప్పుకొచ్చాడు. తన పుస్తకంలో జైశంకర్ వచ్చే 20204 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు యత్నిస్తున్నట్లు కూడా చెప్పారు. అతను ఒక గొప్ప ప్రోఫెషనల్, హేతుబద్ధమైన వ్యక్తి మాత్రమే గాదని తన దేశానికే గొప్ప రక్షకుడిగా కూడా అభివర్ణించారు. చివరిగా తాను సుష్మాతో పొలిటకల్‌గా తనతో చాలా ఇబ్బందిపడ్డానని, తనకు ఏవిధంగా సహకరించలేదని చెప్పారు. కానీ జైశంకర్‌తో చాలా సన్నిహితంగా పనిచేయగలిగినట్లు చెప్పుకొచ్చారు. ఐతే ఈ వ్యాఖ్యలకు జైశంకర్ స్పందించి..తాను పాంపియో పుస్తకంలో సుష్మా స్వరాజ్‌ని అవమానిస్తూ రాసిన వ్యాఖ్యలను చూశానన్నారు. ఆమెను తానెప్పుడూ ఎంతో గౌరవంగా చూసుకున్నానని, అలాంటి ఆమె పట్ల ఇలా అవమానపరిచేలా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తానని చెప్పారు. ఆమెతో తాను ఎంతో ఆప్యాయంగా, సన్నిహితంగా ఉండేవాడినన్నారు. ఆమెను అగౌరపరిచేలా చేసిన సంభాషణనను వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. అంతేగాదు పాంపియో తన పుస్తకంలో భారత్ అమెరికాను నిర్లక్ష్యం చేయడం దశాబ్దాల ద్వైపాక్షిక వైఫల్యంగా పేర్కొన్న విషయంపై కూడా శంకర్ ధీటుగా కౌంటరిచ్చారు. ఇదిలా ఉండగా పాంపియో తన పుస్తకంలో... భారత్ అమెరికా, భారత్ సహజ మిత్రులని నొక్కి చెప్పారు. తమ ప్రజలు ప్రజాస్వామ్య చరిత్ర, ఉమ్మడి భాష, సాంకేతికత తదితర వాటిన్నింటిని భారత్‌తో పంచుకున్న విషయాన్ని కూడా గుర్తు చేశారు. అంతేగాదు అమెరికా మేధో సంపత్తి ఉత్పత్తులకు విపరీతమైన డిమాండ్ ఉన్న మార్కెట్ భారతదేశమేనన్న విషయాన్ని కూడా నొక్కి చెప్పారు. దక్షిణాసియాలో వ్యూహాత్మకమైన స్థానం చైనా దురాక్రమణను ఎదుర్కోవడానికి భారత్‌తో దౌత్యాని మూలధారం చేసిందని రాశారు. ఆ పుస్తకంలో తాను ఎంచుకున్న భారతదేశాన్ని అమెరికా తదుపరి గొప్ప మిత్రదేశంగా మార్చడంలో సమయం వెచ్చించండి, కృషి చేయండి అని ప్రత్యేకంగా పేర్కొన్నారు. (చదవండి: మోదీ బీబీసీ డాక్యుమెంటరీపై అమెరికా కీలక వ్యాఖ్యలు) -
రూ.4 లక్షల విస్కీ బాటిల్ ఏమైనట్లు?
వాషింగ్టన్: అగ్రరాజ్యమైన అమెరికాను ప్రసన్నం చేసుకుని తమ సొంత పనులు, సొంత దేశ పనులు విజయవంతంగా పూర్తిచేసుకోవాలని చాలా ప్రపంచ దేశాల నేతలు ఉవ్విళ్లూరుతుంటారు. ఆ ఘన కార్యంలో భాగంగానే తమ దేశాలకు పర్యటన పేరిట విచ్చేసిన అగ్రరాజ్య ముఖ్యనేతలకు జ్ఞాపికలతో సత్కరిస్తాయి. ప్రత్యేక ‘కానుక’లతో మెప్పిస్తారు. అదే తరహాలో అమెరికా విదేశాంగ మంత్రిగా ఉన్నకాలంలో మైక్ పాంపియోకు ఒక ఖరీదైన విస్కీ బాటిల్‌ను జపాన్ ప్రభుత్వం 2019 జూన్ 24న బహూకరించినట్లు అమెరికా ప్రభుత్వ రికార్డుల్లో ఉంది. ఆ విస్కీ బాటిల్ ఖరీదు దాదాపు రూ.4,32,085. ఖరీదైన బహుమానాలను ప్రభుత్వ పదవిలో ఉన్న వ్యక్తులు తమ సొంతానికి తమ వద్ద అట్టిపెట్టుకోవడానికి వీల్లేదు. అమెరికా చట్టాల ప్రకారం దాదాపు రూ.29వేలలోపు విలువైన వస్తువులనే అధికారులు/మంత్రులు తమ వద్ద ఉంచుకోవచ్చు. అంతకుమించి విలువైనవి అమెరికా ప్రభుత్వానికి చెందుతాయి. కనీసం ముట్టుకోలేదు ‘కనీసం నేను ఆ బాటిల్‌ను తాకనైనా తాకలేదు. ఎందుకంటే.. ఆ బాటిల్ సంగతే నాకు తెలియదు. నాకు ఎవరూ బహూకరించలేదు. అయినా, అంతటి ఖరీదైన బాటిల్‌ను స్వాధీనం చేసుకోవడంలో విదేశాంగ విభాగ సిబ్బంది ఎలా మిస్ చేస్తారు?’అని పాంపియో వ్యాఖ్యానించారు. వాస్తవానికి ఆ తేదీన ఆయన జపాన్‌లో లేరని, సౌదీ అరేబియాకు వెళ్తున్నారని న్యూయార్క్ టైమ్స్ ఒక కథనంలో పేర్కొంది. బాటిల్‌ను ఎవరు మాయం చేశారనే దానిపై లోతైన దర్యాప్తు కొనసాగుతోంది. -
ట్రంప్‌ను తొలగించే తీర్మానాన్ని అడ్డుకున్న రిపబ్లికన్లు
వాషింగ్టన్: రాజ్యాంగబద్ధ అధికారాలను వినియోగించుకుని ట్రంప్‌ను అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించాలని ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌ను కోరుతూ సోమవారం డెమొక్రాట్లు తీసుకువచ్చిన తీర్మానాన్ని ప్రతినిధుల సభలో రిపబ్లికన్ సభ్యులు అడ్డుకున్నారు. మద్దతుదారులను రెచ్చగొట్టి క్యాపిటల్ భవనంపై దాడికి ప్రోత్సహించారని, అధ్యక్షుడిగా అధికారంలో కొనసాగేందుకు ట్రంప్ అనర్హుడని పేర్కొంటూ డెమొక్రాట్లు ఈ తీర్మానాన్ని ప్రతిపాదించారు. 25వ రాజ్యాంగ సవరణ ద్వారా, కేబినెట్లోని మెజారిటీ సభ్యుల మద్దతుతో అధ్యక్షుడిని పదవి నుంచి తొలగించే అవకాశముంది. ట్రంప్ పదవీకాలం 20న ముగియనుంది. ఈ లోపే అభిశంసన ద్వారా ఆయనను పదవి నుంచి తొలగించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. -
రైతుల ఆందోళనలపై పాంపియోకు లేఖ
వాషింగ్టన్ : నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ అంశంపై భారత విదేశాంగ శాఖతో చర్చించాలని అమెరికా చట్టసభల్లోని కొంతమంది శానససభ్యులు ఆ దేశ విదేశాంగ మంత్రి మైక్ పాంపియోకు లేఖ రాశారు. అయితే రైతు నిరసల విషయంలో ఇతర దేశాల జోక్యం అనవసరమని, గతంలోనే భారత్ స్పష్టం చేసింది. ఇది భారత అంతర్గత వ్యవహారాలకు సంబంధించిన అంశమని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ ఇదివరకే చెప్పారు.కానీ ఇది భారత్‌తో ముడిపడి ఉన్న అందరికీ ఆందోళన కలిగించే అంశమని, భారత అమెరికన్లపై కూడా ఈ ఉద్యమం ప్రభావం చూపుతుందని వారు లేఖలో పేర్కొన్నారు. (‘రైతులను దేశ ద్రోహులని భావిస్తే పాపం చేసినట్లే’ ) ముఖ్యంగా పంజాబ్‌తో ముడిపడి ఉన్న సిక్కు అమెరికన్లకు ఇది మరింత ఆందోళన కలిగించే అంశమని తెలిపారు. భారత చట్టాలను తాము గౌరవిస్తామని, అయితే రైతుల ఆర్థిక భద్రతపై కూడా తమకు అనుమానం ఉందని పేర్కొన్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని భారత విదేశాంగ శాఖతో చర్చించి, సానుకూలతతో సమస్య పరిష్కరించేలా చూడాలని కోరారు. లేఖ రాసిన వారిలో ప్రవాస భారతీయురాలు ప్రమీలా జయపాల్ కూడా ఉన్నారు. కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా హర్యానా, పంజాబ్ సహా ఇతర రాష్ట్రాల నుండి వేలాది మంది రైతులు నవంబర్26 నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇవి రైతు వ్యతిరేక చట్టాలని, కనీస మద్దతు ధరకు అవకాశం లేకుండా చేస్తాయని, కార్పోరేట్ల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడేలా చేస్తాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీరికి దేశంలోని వివిధ వర్గాల నుంచి సహా అమెరికాకు చెందిన పలువురు శాసనసభ్యులు తమ సంఘీభావాన్ని తెలిపిన సంగతి తెలిసిందే. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు రైతులను అనుమతించాలని ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఈ నిరసనను ఒక్క రాష్ట్రానికే పరిమితమైనదిగా కాకుండా జాతీయ నిరసనగా పరిగణించాలని లేఖలో ప్రధానిని కోరారు. (కేంద్రానికి రైతుల హెచ్చరిక ) -
చైనాపై మరోసారి అమెరికా మండిపాటు
వాషింగ్టన్: ప్రాణాంతక కరోనా వైరస్ పుట్టుకకు చైనాదే బాధ్యతంటూ ఇప్పటికే పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేసిన అగ్రరాజ్యం అమెరికా ఇదే విషయమై మరోసారి పలు తీవ్ర ఆరోపణలు చేసింది. వూహాన్లో వైరస్ జాడను కనుగొనేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) చేపట్టిన విచారణకు కమ్యూనిస్టు ప్రభుత్వం అడ్డంకులు కల్పిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘చైనా తయారు చేస్తున్న వివిధ టీకాల సమర్థత కు సంబంధించి డేటాను బహిర్గతం చేయడం లేదు. క్లినికల్ ట్రయల్స్‌లో పారదర్శకత, ప్రమాణాలు పాటించడం లేదు. ఇటువంటి చర్యలతో చైనా పౌరులతోపాటు ప్రపంచమే ప్రమాదంలో పడుతుంది’అని విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ఆరోపించారు. లక్షలాది మరణాలకు, కోట్లాదిగా ప్రజల జీవనోపాధి దెబ్బతినేందుకు కారణమైన కరోనా వైరస్ పుట్టుక, వ్యాప్తిపై పారదర్శకంగా వ్యవహరించేలా చైనాపై అంతర్జాతీయ సమాజం ఒత్తిడి చేయాలన్నారు. -
హిందూ, క్రైస్తవ స్త్రీలను చైనాకు ఉంపుడుగత్తెలుగా...
ఇస్లామాబాద్: భారతదేశంలో మైనారిటీల హక్కుల గురించి మొసలి కన్నీరు కార్చే పాకిస్తాన్ తన దేశంలోని మైనారిటీలైన హిందూ, క్రైస్తవుల గురించి మాత్రం పెద్దగా పట్టించుకోదు. ఈ క్రమంలో అమెరికా అంతర్జాతీయ మత స్వేచ్ఛ రాయబారి శామ్యూల్ బ్రౌన్బ్యాక్ సంచలన విషయాలు వెల్లడించారు. పాక్‌లోని హిందూ, క్రైస్తవ యువతులను చైనాకు బలవంతపు పెళ్లికూతుళ్లుగా.. ఉంపుడుగత్తెలుగా ఎగుమతి అవుతున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఈ రోజు జరగనున్న వెబినార్ చాలా క్లిషమైనది. చైనాకు పంపబడుతున్న బలవంతపు వధువులకు సంబంధించినది ఈ వెబినార్. పాకిస్తాన్ తన దేశంలోని మైనారిటీలైన క్రైస్తవులు, హిందూ యువతులను ఉంపుడుగత్తెలు, బలవంతపు వధువులుగా చైనాకు అమ్ముతుంది. ఎందుకంటే ఆ దేశంలో వీటిపై ఎవరు నోరు మెదపరు. మతపరమైన మైనారిటీలపై పాక్‌లో వివక్ష ఉంది. ఇది వారికి మరింత హానీ చేస్తుంది. అంతర్జాతీయ మత స్వేచ్ఛా చట్టం ప్రకారం పాకిస్తాన్‌ను ప్రత్యేక ఆందోళన ఉన్న దేశంగా (సీపీసీ) నియమించడానికి ఇది ఒక కారణమని’ ఆయన పేర్కొన్నారు. (పాక్‌ను ఆ లిస్టులోంచి తీసేయండి: టర్కీ) దశాబ్దాలుగా చైనా విధించిన వన్-చైల్డ్ విధానం, అబ్బాయిలకు సాంస్కృతికంగా అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో ప్రస్తుతం డ్రాగన్ దేశంలో మహిళల కొరత ఉంది. దాంతో చైనా పురుషులు ఇతర దేశాల మహిళలను వధువు, ఉంపుడుగత్తెలు, కార్మికులుగా దిగుమతి చేసుకుంటున్నారు. అయితే ఈ విషయంలో అమెరికా విదేశాంగ కార్యదర్శి పాంపియో పాకిస్తాన్‌పై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు ఎందుకు అనే ప్రశ్నకు బ్రౌన్బ్యాక్ ప్రతిస్పందించారు. “పాకిస్తాన్లో మతపరమైన హింస చెలరేగినప్పుడు అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. భారతదేశంలో చాలా మత ఘర్షణలు జరుగుతాయి. ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు సమర్థవంతమైన పోలీసు, న్యాయపరమైన చర్యలు అమలు జరిగియా లేదా అనే విషయాన్ని గుర్తించడానికి మేము ప్రయత్నిస్తాము’’ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా మతభ్రష్టుడు, దైవదూషణ కారణంగా బంధించబడి జైళ్లో ఉన్న జనాభాలో సగం మంది పాకిస్తాన్ జైళ్లలోనే మగ్గుతున్నారని బ్రౌన్బ్యాక్ వెల్లడించారు. (చదవండి: కామాంధులపై పాక్ సర్కారు ఉక్కుపాదం!) అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపియో సోమవారం "మత స్వేచ్ఛ పరంగా క్రమబద్ధమైన, కొనసాగుతున్న, అతిగా ఉల్లంఘనలకు" పాల్పడటం వంటి సంఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్న చైనా, పాక్‌తో సహా 8 దేశాలను సందర్శించారు. యూఎస్ కమిషన్ ఫర్ ఇంటర్నేషనల్ రిలిజియస్ ఫ్రీడం (యూఎస్సీఐఆర్ఎఫ్) భారతదేశాన్ని కూడా ప్రత్యేక ఆందోళన కలిగిన దేశంగా (సీపీసీ) నియమించాలని విదేశాంగ శాఖకు సిఫారసు చేసింది. కానీ స్టేట్ డిపార్ట్మెంట్ ఈ సిఫారసును అంగీకరించలేదు. యూఎస్సీఐఆర్ఎఫ్ దేశానికి వ్యతిరేకంగా చేసిన పరిశీలనలను భారతదేశం తన వార్షిక నివేదికలో తిరస్కరించింది. పాంపియో పాకిస్తాన్‌తో పాటు, చైనా, మయన్మార్ ఎరిట్రియా, ఇరాన్, నైజీరియా, ఉత్తర కొరియా, సౌదీ అరేబియా, తజికిస్తాన్, తుర్క్మెనిస్తాన్లను కంట్రీ ఆఫ్ పర్టిక్యూలర్ కన్సర్న్(సీపీసీ)జాబితాలో చేర్చారు. -
వీసా నిబంధనలు: వారికి అమెరికా షాక్..!
వాషింగ్టన్: చైనాతో విభేదాలు కొనసాగుతున్న వేళ అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది. చైనీస్ కమ్యూనిస్టు పార్టీ(సీసీపీ) సభ్యులు, వారి కుటుంబాలకు వీసా నిబంధనలు కఠినతరం చేసింది. శుక్రవారం నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని పేర్కొంది. వీటి ప్రకారం... ట్రావెల్ వీసాకు నెలరోజుల పాటే గడువు ఉంటుంది. వీసా జారీ చేసిన 30 రోజుల్లోగా దానిని వినియోగించినట్లయితే రద్దైపోతుందని అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే ట్రావెల్ వీసా తప్ప ఇమ్మిగ్రేషన్, ఉద్యోగ వీసాలకు కొత్త విధానం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు. ఇక అమెరికా ప్రస్తుత విదేశాంగ మంత్రి మైక్ పాంపియో మాట్లాడుతూ.. సీసీపీ యునైటెడ్ వర్క్ ఫ్రంట్ డిపార్ట్మెంటుతో కలిసి పనిచేస్తూ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడే వారికే ఈ నిబంధనలు వర్తిస్తాయని తెలిపారు. (చదవండి: విదేశాల్లో ఉన్న వాళ్లపై కూడా చైనా నిఘా!) ‘‘మార్క్సిస్టు- లెనినిస్టు సిద్ధాంతాలను ప్రపంచవ్యాప్తం చేసేందుకు సీసీపీ ప్రయత్నిస్తోంది. అమెరికాతో పాటు ప్రపంచ దేశాల్లో తమ భావజాలాన్ని విస్తరింపజేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా యునైటెడ్ ఫ్రంట్ వర్క్‌తో కలిసి బీజింగ్ విధానాలను వ్యతిరేకించే వారిపై విషం చిమ్ముతున్నారు. చైనా మానవ హక్కుల ఉల్లంఘన గురించి విదేశాల్లో గళమెత్తుతున్న విద్యావేత్తలు, వ్యాపారవేత్తలు, మైనార్టీలపై అక్కసు వెళ్లగక్కుతున్నారు. విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తూ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నారు. వారి వ్యక్తిగత సమాచారాన్ని లీక్ చేసేందుకు కూడా వెనుకాడటం లేదు’’ అని ఆయన ఆరోపించారు. అలాంటి వారికి ఇకపై అమెరికాలో ప్రవేశం మరింత కఠినతరం కానుందని పేర్కొన్నారు. (చదవండి: చైనా సూపర్ సైనికులను సృష్టిస్తోంది: అమెరికా) కాగా ట్రంప్ హయాంలో చైనాతో అమెరికా వాణిజ్య, దౌత్య సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. కరోనా వ్యాప్తి నేపథ్యంలో డ్రాగన్ దేశంపై మండిపడ్డ ట్రంప్.. జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా పలు చైనీస్ యాప్‌లు, వావే వంటి కంపెనీలపై నిషేధం విధించారు. ఈ క్రమంలో అగ్రరాజ్య నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ చైనాతో బంధంపై ఎటువంటి నిర్ణయం తీసుకోనున్నారనే అంశం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో మంగళవారం నాటి ఇంటర్వ్యూలో బైడెన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. చైనాతో బంధాలు మెరుగుపరచుకునే అంశంపై మిత్రపక్షాలతో చర్చిస్తామన్న ఆయన, జింగ్ జియాంగ్‌లో మైనార్టీల పట్ల డ్రాగన్ దుశ్చర్యలు, డిటెన్షన్ సెంటర్లో వారిని బంధిస్తూ మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్న తీరుపై కూడా తమకు అవగాహన ఉందని పేర్కొన్నారు. -
వరుస రాకెట్ దాడులతో వణికిన కాబూల్
కాబూల్: ఆప్గానిస్తాన్ మరోసారి బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. శనివారం ఉదయం వరుస రాకెట్ లాంఛర్ దాడులతో వణికిపోయింది. వరుసగా 23 రాకెట్లు దూసుకొచ్చాయని ఆప్గాన్ అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రతినిధి తారిఖ్ అరియాన్ ధృవీకరించారు. ఈ ఘటనలో దాదాపు ఎనిమిది మంది పౌరులు మృతి చెందినట్లు, 31 మంది గాయపడ్డట్లు తారిఖ్ ప్రకటించారు. ఈ దాడికి తాలిబన్లు కారణం అని ఆయన ఆరోపించారు. కాబూల్ లోని సెంట్రల్,ఉత్తర ప్రాంతాలలో దాడి జరిగింది. ఈ ప్రదేశం అత్యంత భద్రత కలిగిన గ్రీన్ జోన్. అక్కడ విదేశీ రాయబార కార్యాలయాలు కొన్ని అంతర్జాతీయ సంస్థలు కొలువుదీరి ఉన్నాయి. దాడి అనంతరం కూలిన భవనాలు, పగిలిన కిటీకీలతో ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ప్రభుత్వం ఈ దాడి చేసింది తాలిబన్లు అని ప్రకటించగా, తాలిబన్ అధికార ప్రతినిధి జబిహుల్లా ముబాహిద్ ఖండించాడు. గత కొంతకాలంగా కాబూల్‌లో ఉగ్రదాడులు భారీగా పెరిగిపోయాయి. కొన్ని వారాల క్రితం రెండు యూనివర్శిటీపై దాడి జరిగింది. అటు తరువాత జరిగిన మరో దాడిలో దాదాపుగా 50 మంది ప్రజలను కాల్చి చంపారు. ప్రతిసారి దాడులు చేసింది తాలిబన్లు లేదా వారు పోషిస్తున్నజిహద్ శక్తులేనని ప్రభుత్వం ఆరోపణలు గుప్పిస్తోంది. తాలిబన్లు మాత్రం దాడులు చేస్తోందని మా సంస్థలు కాదని, ఇలా చేసే వారు మా పేరును వాడుకుంటున్నారని చెప్తుతున్నారు. మేము ప్రజలపై దాడులు చేయమని అంటున్నాము. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆప్గాన్ నుంచి అమెరికా సేనల ఉపసంహరణ జరుగుతుందని,దానికి సంబంధించిన ఒప్పందంపై సంతకాలు చేసామని, దానికే కట్టుబడి ఉన్నామని తాలిబన్లు వాదిస్తున్నారు. కాగా, ఇటీవల విద్యాసంస్థలపై దాడులు చేసింది భయానక ఉగ్రవాద సంస్థ ఐసిస్ అని తనకు తానే ప్రకటించుకుంది. ఈ రోజు(శనివారం) దాడి చేసింది పాకిస్థాన్ ప్రేరిత ఉగ్ర సంస్థ హక్కానీ నెట్వర్క్ అని తాలిబన్ ప్రకటించారు. ఈ సందర్భంగా గత ఆరు నెలల్లోఉగ్రవాదుల చేసిన మారణహోమం తాలుకూ వివరాలను ప్రకటించారు. తాలిబాన్లు 53 ఆత్మాహుతి దాడులు,1,250 పేలుళ్లు జరిపారని అందులో 1,210 మంది పౌరులు మరణించగా, 2,500 మంది గాయపడ్డారని అంతర్గత వ్యవహారాల శాఖ ప్రతినిధి తారిక్ అరియన్ ప్రకటించారు. మరోవైపు శనివారం ఉదయం రెండు చిన్న "స్టిక్కీ బాంబు" పేలుళ్లు సంభవించాయని అంతర్గత వ్యవహారాల శాఖ తెలిపింది. వీటిలో ఒకటి పోలీసు కారును ఢీకొట్టింది ఈ దాడిలో ఒక పోలీసు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. -
మా మధ్య మీ జోక్యం వద్దు: చైనా
బీజింగ్: భారత్‌తో సరిహద్దు సమస్య ఇరు దేశాలకు సంబంధించిన ద్వైపాక్షిక అంశమని, ఇందులో అమెరికా జోక్యం అనవసరమని చైనా పేర్కొంది. ఇండో పసిఫిక్ పేరిట అమెరికా ఈ ప్రాంతంపై పట్టుకోసం అవలంబిస్తున్న వ్యూహాలను మానుకోవాలని హెచ్చరించింది. భారత్‌లో అమెరికా విదేశాంగ మంత్రి పర్యటన సందర్భంగా చైనా విదేశాంగ శాఖ ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం భారత్, చైనా మధ్య సరిహద్దుల్లో పరిస్థితులు స్థిరంగా ఉన్నాయని, ఇరు పక్షాలు చర్చల ద్వారా సమస్యలు చక్కబెట్టుకునేందుకు యత్నిస్తున్నాయని చైనా ప్రతినిధి వాంగ్ వెంబిన్ చెప్పారు. ఇక ఇండో పసిఫిక్ వ్యూహాల పేరిట అమెరికా చేస్తున్న యత్నాలు ప్రచ్ఛన్న యుద్ధ(కోల్డ్ వార్) మనస్థత్వాన్ని చూపుతున్నాయని, తన ఆధిపత్యం చూపేందుకు యూఎస్ యత్నిస్తోందని, ఇవన్నీ మానుకోవాలని హెచ్చరించారు. కాగా 2+2 చర్చల్లో భాగంగా భారత్‌కు వచ్చిన అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ చైనాను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పొరుగు దేశం కారణంగా భారత సార్వభౌమత్వానికి ఎటువంటి భంగం కలగకుండా తాము తోడుగా ఉంటామని పేర్కొన్నారు. అదే విధంగా.. వుహాన్ నుంచి కరోనా మహమ్మారి ప్రపంచమంతా వ్యాపించిందని డ్రాగన్ దేశంపై మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని, చట్టాలను వ్యతిరేకించే పార్టీగా చైనీస్ కమ్యూనిస్టు పార్టీని అభివర్ణించారు.(చదవండి: చైనాకు చెక్ పెట్టడమే లక్ష్యంగా 2+2 చర్చలు ) చదవండి: ట్విట్టర్‌పై పార్లమెంటరీ కమిటీ ఆగ్రహం -
విబేధాలు రాజేయడం మానుకోవాలి: చైనా
బీజింగ్: భారత్-అమెరికా మధ్య జరగాల్సిన 2+2 చర్చల కోసం అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో, రక్షణ మంత్రి మార్క్ ఎస్పర్ సోమవారం భారత్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనపై డ్రాగన్ దేశం స్పందించింది. బీజింగ్‌తో పాటు ఈ ప్రాంతంలోని ఇతర దేశాల మధ్య విబేధాలు రాజేయడం మానుకోవాల్సిందిగా అమెరికాని కోరింది. చైనా బెదిరింపుల నేపథ్యంలో మైక్ పాంపీయో, భారత్‌తో పాటు ఇతర దక్షిణాసియా దేశాల్లో పర్యటించడం గురించి చైనా స్పందన ఏంటని బీజింగ్ మీడియా సమావేశంలో చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్‌ని ప్రశ్నించగా.. చైనాపై ఆరోపణలు చేయడం మైక్ పాంపియోకు కొత్త కాదని తెలిపారు. ఆయన పదే పదే వాటిని పునరావృతం చేశాడన్నారు. (చదవండి: అమెరికా ‘వ్యూహాత్మక’ చెలిమి) ఈ సందర్భంగా వాంగ్ వెన్బిన్ మాట్లాడుతూ.. ‘పాంపియో ఆరోపణలు నిరాధరమైనవి. ఆయన వ్యాఖ్యలు చూస్తే ప్రచ్ఛన్న యుద్ధ మనస్తత్వం, సైద్ధాంతిక పక్షపాతం భావజాలానికి అతుక్కుపోతున్నట్లు తెలుస్తోంది. కానీ మేం మాత్రం ఆయన ప్రచ్ఛన్న యుద్ధం, జీరో సమ్ గేమ్ మనస్తత్వాన్ని విడనాడాలని కోరుతున్నాము. చైనా, ప్రాంతీయ దేశాల మధ్య అసమ్మతిని రగల్చడం, శాంతి, స్థిరత్వాలను అణగదొక్కాలని చూస్తున్నారు’ అని మండి పడ్డారు. భారత్, అమెరికా రెండు దేశాల మధ్య మైలురాయిగా నిలిచే బేసిక్ ఎక్స్ఛేంజ్ అండ్ కోఆపరేషన్ అగ్రిమెంట్ (బెకా) పై సంతకం చేసిన తర్వాత వాంగ్ వెన్బిన్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇక బెకా ఉన్నత స్థాయి సైనిక సాంకేతిక పరిజ్ఞానం, వర్గీకృత ఉపగ్రహ డేటా మరియు ఇరు దేశాల మధ్య క్లిష్టమైన సమాచారాన్ని పంచుకునేందుకు వీలు కల్పిస్తుంది. (చదవండి: భారత్, అమెరికా మధ్య 2+2 చర్చలు) ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక రక్షణ సంబంధాలను మరింత బలోపేతం చేయడం, ఇండో పసిఫిక్ ప్రాంతంలో రక్షణ సహకారాన్ని పెంచుకోవడం, చైనాకు చెక్ పెట్టడం ముఖ్య ఉద్దేశంగా 2+2 చర్చలు జరగనున్నాయి. ఇటీవల లద్దాఖ్‌లో చైనా నిర్వాకాలు, ఇండో పసిఫిక్ సముద్ర జలాల్లో చైనా దూకుడు.. తదితర అంశాలు ఈ చర్చల్లో కీలకం కావొచ్చని భావిస్తున్నారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత రవాణా ఉండాలని పలు ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. కానీ చైనా మాత్రం ఇవన్నీ తమ సొంత జలాలని వాదిస్తోన్న సంగతి తెలిసిందే. భారత పర్యటన తరువాత, పాంపియో శ్రీలంక, మాల్దీవులను సందర్శించనున్నారు. -
భారత్, అమెరికా మధ్య 2+2 చర్చలు
సాధారణంగా రెండు ప్లస్ రెండు నాలుగవుతుంది. కానీ ఇండో అమెరికా మాత్రం రెండు ప్లస్ రెండు ఈక్వల్టూ ఒకటి అంటున్నాయి. రెండు అతిపెద్ద ప్రజాస్వామ్యాల మధ్య జరిగే ఈ చర్చలు..ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడును నిలువరించేందుకు, దక్షిణాసియాలో ఇండియా స్థానాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో సాగుతున్నాయి. పలు దేశాల పర్యటనలను వర్చువల్ పర్యటనలుగా మార్చుకున్న అమెరికా రక్షణ మంత్రి.. భారత్ పర్యటనకు స్వయంగా రావడం గమనిస్తే ప్రాధాన్యం అర్థమవుతుందని రక్షణ నిపుణులు భావిస్తున్నారు. మంగళవారం భారత్, అమెరికా మధ్య జరగాల్సిన 2+2 చర్చల కోసం అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో, రక్షణ మంత్రి మార్క్ ఎస్పర్ సోమవారం భారత్ వచ్చారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక రక్షణ సంబంధాలను మరింత బలోపేతం చేయడం, ఇండో పసిఫిక్ ప్రాంతంలో రక్షణ సహకారాన్ని పెంచుకోవడం, చైనాకు చెక్ పెట్టడం ముఖ్య ఉద్దేశంగా 2+2 చర్చలు జరగనున్నాయి. కొన్ని రోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలున్నా అమెరికా కీలక మంత్రులు ఈ పర్యటనకు స్వయంగా రావడం విశేషం. జాతీయ భద్రత సలహాదారు అజిత్ ధోవల్‌తో సైతం అమెరికా మంత్రులు సమావేశం కానున్నారు. ఇటీవల లద్దాఖ్‌లో చైనా నిర్వాకాలు, ఇండో పసిఫిక్ సముద్ర జలాల్లో చైనా దూకుడు.. తదితర అంశాలు ఈ చర్చల్లో కీలకం కావొచ్చని భావిస్తున్నారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత రవాణా ఉండాలని పలు ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. కానీ చైనా మాత్రం ఇవన్నీ తమ సొంత జలాలని వాదిస్తోంది. భారత్ నిర్ణయాత్మకం దక్షిణాసియా ప్రాంతంలోనే కాకుండా ప్రపంచంలోనే భారత్ నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతోందని అమెరికా ప్రశంసించింది. భారత్ ఎదుగుదలను స్వాగతిస్తున్నట్లు యూఎస్ రక్షణ, విదేశాంగ శాఖలు తెలిపాయి. 2021 జనవరి నుంచి ఆరంభమయ్యే ఐరాస భద్రతా మండలి టర్మ్‌లో భారత్‌తో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నామని తెలిపాయి. 2017లో ఇండియా, యూఎస్, జపాన్, ఆస్ట్రేలియాలు ఇండో పసిఫిక్ జలాలను స్వేచ్ఛగా ఉంచేందుకు ఉమ్మడిగా వ్యూహరచన చేయాలని భావించాయి. ఇందుకోసం నాలుగు దేశాలు కలిసి క్వాడ్ పేరిట ఒక బృందంగా ఏర్పడ్డాయి. ఇటీవలే ఈ 4 దేశాల మంత్రులు జపాన్‌లో సమావేశమయ్యారు. చైనా దుందుడుకు చేష్టలను ఆపేందుకు కలసికట్టుగా పనిచేయాలని నిర్ణయించారు. ఎకానమీ పరంగానూ భారత్ అత్యంత కీలకమని అమెరికా భావిస్తోంది. ఇప్పటివరకు ఇరుదేశాల మధ్య రక్షణ ఒప్పందాల విలువ 20 బిలియన్ డాలర్లకుపైనే ఉంది. 2+2 చర్చలు, బెకా అంటే.. ఒక దేశ రక్షణ, విదేశీ మంత్రులు మరో దేశ రక్షణ, విదేశీ మంత్రులతో జరిపే చర్చలను టు ప్లస్ టు చర్చలంటారు. ఒక దేశం తనకు అత్యంత కీలకమని భావించే మరో దేశంతో ఇలాంటి సమావేశాలు జరుపుతుంది. రెండు దేశాల మధ్య ఉన్నత స్థాయిలో నిర్ణయాలు తీసుకునేందుకు ఈ చర్చలు కీలకంగా ఉంటాయి. తాజా సమావేశాల్లో భారత్ బెకా(బేసిక్ ఎక్సే్చంజ్ అండ్ కోఆపరేషన్ అగ్రిమెంట్) కోసం ఎదురుచూస్తోంది. శాటిలైట్ సమాచార మార్పిడి ఈ బెకాలో కీలకం. ఈ ఒప్పందం కుదిరితే యూఎస్ జియో శాటిలైట్ ఇంటెలిజెన్స్ సమాచారాన్ని ఇండియా వాడుకునే వీలుంటుంది. 2002లో అమెరికాతో భారత్ జిఎస్‌ఓఎంఐఏ(జనరల్ సెక్యూరిటీ ఆఫ్ మిలటరీ ఇన్ఫర్మేషన్ అగ్రిమెంట్) కుదుర్చుకుంది. ఇందులో భాగంగా లాజిస్టికల్ ఎక్సే్చంజ్ మెమొరాండమ్ అగ్రిమెంట్(లెమొవా)ను 2016లో, కమ్యూనికేషన్, కంపాటబిలిటీ సెక్యూరిటీ అగ్రిమెంట్(కామ్కాసా)ను 2018లో పూర్తి చేసుకుంది. బెకా పూర్తయితే 2002 అగ్రిమెంట్ దశలన్నీ పూర్తయినట్లవుతుంది. -
అమెరికాతో ద్వైపాక్షిక బంధం : కీలక చర్చలు
సాక్షి, న్యూఢిల్లీ : భారత్-అమెరికాల మధ్య రక్షణ, భద్రతా సంబంధాల బలోపేతమే లక్ష్యంగా సంప్రదింపులు జరిపేందుకు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో, రక్షణ మంత్రి మార్క్ ఎస్పర్లు సోమవారం ఢిల్లీకి చేరుకున్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సహకారంపైనా వీరు చర్చలు జరపనున్నారు. పాంపియో, ఎస్పర్ మంగళవారం విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లతో చర్చలు జరుపుతారు. ద్వైపాక్షిక సంబంధాలతో పాటు కీలక ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై సంప్రదింపులు చేపట్టనున్నారు. చైనాతో సరిహద్దు ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో భారత్-అమెరికా మంత్రుల భేటీలో ఈ అంశంపైనా చర్చ జరిగే అవకాశం ఉంది. పాంపియో, ఎస్పర్ లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తోనూ భేటీ అవుతారు. భారత్‌తో సరిహద్దు ప్రతిష్టంభనతో పాటు, దక్షిణ చైనా సముద్రంలో సైనిక పాటవాలు, హాంకాంగ్‌లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలపై బీజింగ్ వైఖరి వంటి పలు అంశాలపై గత కొద్దినెలలుగా అమెరికా చైనా తీరును తప్పుపడుతోంది. ఇక అమెరికన్ మంత్రులతో ద్వైపాక్షిక సంబంధాలపై విస్తృత చర్చలు, ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై సంప్రదింపులు సాగుతాయని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ ఇప్పటికే స్పష్టం చేశారు. చదవండి : చైనాతోనే అమెరికాకు ముప్పు -
చర్చలతో చైనా దారికి రాదు
వాషింగ్టన్: భారత్, చైనా మధ్య గత అయిదారు నెలలుగా నెలకొన్న ఉద్రిక్తతలకు చర్చలతో పరిష్కారం లభించదని అమెరికా అభిప్రాయపడింది. డ్రాగన్ దేశంతో చర్చలు జరిపి ఇక లాభం లేదని భారత్‌కు హితవు పలికింది. ఇరుదేశాల మధ్యనున్న వాస్తవాధీన రేఖను చైనా ఏకపక్షంగా స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తోందని స్పష్టం చేసింది. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఓ బ్రియెన్ చైనాతో ఒప్పందాలు, చర్చలు అంటూ కాలయాపన చేయొద్దని, చర్చలతో పరిష్కారం దొరకదన్న విషయాన్ని భారత్ అర్థం చేసుకోవాల్సిన సమయం వచ్చిందని అన్నారు. మరోవైపు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో కూడా చైనా వైఖరిని తీవ్రంగా తప్పు పట్టారు. భారత్ సరిహద్దుల్లోని వాస్తవాధీన రేఖ వెంబడి ఉత్తరంగా చైనా 60 వేల మందికి పైగా సైనికుల్ని మోహరించి కయ్యానికి కాలు దువ్వుతోందని అన్నారు. చైనాది దురాక్రమణ బుద్ధి కమ్యూనిస్టు పార్టీ దురాక్రమణ బుద్ధితో భారత్, తైవాన్ దేశాల సరిహద్దుల్ని ఆక్రమించుకోవడానికి కుట్రలు పన్నుతోం దని రాబర్ట్ ఓ బ్రియెన్ అన్నారు. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ తైవాన్ సరిహద్దుల్లో నిరంతరాయంగా సైనిక విన్యాసాలకు దిగుతోందని అన్నారు. చైనా వన్ బెల్ట్ వన్ రోడ్ (ఓబీఓఆర్) ప్రాజెక్టు కూడా ఇతర దేశాల ప్రాదేశిక సార్వభౌమత్వాన్ని దెబ్బ తీయడానికేనని ధ్వజమెత్తారు. ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యులైన కంపెనీలకు చైనా బలవంతంగా రుణాలు తీసుకునే పరిస్థితి కల్పిస్తుందని వాటిని చెల్లించలేక అవన్నీ డ్రాగన్ దేశానికి దాసోహం అంటాయని అన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా కల్పించే మౌలిక సదుపాయాలు అంతిమంగా చైనాకే ప్రయోజనం చేకూరుస్తున్నాయని ఆయన అన్నారు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని భారత్ ఇకనైనా చర్చలతో చైనా దారికి రాదు అన్న విషయాన్ని గ్రహించుకోవాలన్నారు. క్వాడ్ దేశాలకు డ్రాగన్‌తో ముప్పు డ్రాగన్ దేశం అత్యంత హీనంగా వ్యవహరిస్తూ క్వాడ్ దేశాలకు ముప్పుగా మారిందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ సరిహద్దుల్లో 60 వేల మందికి పైగా సైనికుల్ని మోహరించి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంద న్నారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో చైనాకు చెక్ పెట్టడానికి ఇండో పసిఫిక్ దేశాలు అమెరికా, జపాన్, భారత్, ఆస్ట్రేలియా క్వాడ్ గ్రూపుగా ఏర్పడ్డాయి. ఇటీవల ఈ దేశాల విదేశాంగ మంత్రులు టోక్యోలో సమావేశమై చర్చించారు. భారత్ విదేశాంగ మంత్రి జై శంకర్‌తో ఫలప్రదమైన చర్చలు జరిపానని టోక్యో నుంచి వాషింగ్టన్కు తిరిగి వచ్చిన అనంతరం ఒక టీవీ చానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. -
‘చైనా 60 వేల మంది సైనికులను మోహరించింది’
వాషింగ్టన్: ‘‘భారత ఉత్తర సరిహద్దులో చైనా 60 వేల మంది సైనికులను మోహరించింది. వుహాన్‌లో ఉద్భవించిన ప్రాణాంతక కరోనా వైరస్ గురించి ప్రశ్నించినందుకు ఆస్ట్రేలియాపై బెదిరింపులకు దిగింది. వేధింపులకు పాల్పడింది. చైనీస్ కమ్యూనిస్టు పార్టీ పాలన వల్ల ప్రపంచానికి ముప్పు పొంచి ఉంది’’ అంటూ అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో డ్రాగన్ దేశం చైనాపై మండిపడ్డారు. గత ప్రభుత్వాల అసమర్థ పాలన వల్ల అమెరికా మేథో సంపత్తిని చైనా దొంగిలించిందని, అయితే అధ్యక్షుడు ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత డ్రాగన్ ఆట కట్టించి పరిస్థితులను చక్కదిద్దారని పేర్కొన్నారు. (చదవండి: చైనాయే లక్ష్యంగా క్వాడ్ దేశాల ప్రకటన) కాగా ఇండో- పసిఫిక్ ప్రాంతంలో ఆధిపత్యం ప్రదర్శించేందుకు డ్రాగన్ దేశం చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టే క్రమంలో క్వాడ్(క్వాడ్రిలాటరల్ సెక్యూరిటీ డైలాగ్) దేశాలు మంగళవారం జపాన్‌లో సమావేశమైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియా దేశాల విదేశాంగ మంత్రులు టోక్యోలో భేటీ అయి, స్వేచ్ఛ, నిజాయితీ, సమ్మిళిత ఇండో పసిఫిక్ ప్రాంతం కోసం ఉమ్మడిగా పనిచేస్తామని పునరుద్ఘాటించారు. ఈ క్రమంలో అమెరికాకు తిరిగి వచ్చిన అనంతరం శుక్రవారం ది గయ్ బెన్సన్ అనే షోలో మైక్ పాంపియో మాట్లాడుతూ.. నాలుగు ప్రజాస్వామ్య దేశాలు, ప్రధాన ఆర్థిక వ్యవస్థలు చైనా కమ్యూనిస్టు పార్టీతో ప్రపంచానికి పొంచి ఉన్న ప్రమాదం గురించి చర్చించాయని పేర్కొన్నారు. (చదవండి: భారత్- అమెరికాల మధ్య కీలక ఒప్పందం..) అదే విధంగా, డ్రాగన్ వేస్తున్న ఎత్తులకు ధీటుగా బదులిచ్చే దిశగా ఉమ్మడి విధానాలు రూపొందించేందుకు సంకల్పించాయని పేర్కొన్నారు. ఇక భారత్- చైనా సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ వెంబడి డ్రాగన్ ఆర్మీ దుందుడుకుగా వ్యవహరిస్తోందన్న పాంపియో, ఉత్తర సరిహద్దులో 60 వేల సైన్యాన్ని మోహరించిందని పేర్కొన్నారు. ఇలాంటి తరుణంలో భారత్‌కు అమెరికా వంటి మిత్ర దేశాల అవసరం ఎంతగానో ఉందని అభిప్రాయపడ్డారు. అదే విధంగా కరోనా వైరస్ విషయంలో నిలదీసినందుకు ఆస్ట్రేలియాను చైనా బెదిరింపులకు గురిచేసిందని, జపాన్ సైతం ఆ దేశ వైఖరిపై అసహనంగా ఉందని చెప్పుకొచ్చారు. వాళ్లు తలవంచారు.. అందుకే.. ‘‘గత నలభై ఏళ్లలో పశ్చిమ దేశాలపై ఆధిపత్యం ప్రదర్శించేందుకు చైనీస్ కమ్యూనిస్టు పార్టీ చేస్తున్న ప్రయత్నాలు చూశాం. గత ప్రభుత్వాల వల్ల చైనా, మేథో సంపత్తిని దొంగిలించిన తీరు, ఉద్యోగాలు కొల్లగొట్టిన వైనం బయటపడింది. క్వాడ్‌లోని మిగిలిన దేశాల్లో ఇలాగే జరుతోందన్న విషయం చర్చకు వచ్చింది. కాబట్టి వాళ్లకు అమెరికా, అమెరికాకు వాళ్ల అవసరం ఉంది. చైనా దుష్ట వైఖరిని ఎదిరించేందుకు మాకు స్నేహితులు, భాగస్వాములు కావాలి’’అని మైక్ పాంపియో పేర్కొన్నారు. అందరం కలిసి డ్రాగన్ ప్రభుత్వ వైఖరి మారే విధంగా విధానాలు అవలంబించబోతున్నామని చెప్పుకొచ్చారు. -
చైనా ఎంట్రీతో ఇక అంతే..!
వాషింగ్టన్: ఇరాన్-చైనా దౌత్య సంబంధాలపై అమెరికా విదేశాంక మంత్రి మైక్ పాంపియా ట్విటర్ వేదికగా ఆదివారం కీలక వ్యాఖ్యలు చేశారు. చైనాతో గనుక ఇరాన్ దోస్తీ చేస్తే మధ్యప్రాచ్యంలో పరిస్థితులు తారుమారవుతాయని హెచ్చరించారు. ఇరాన్ ఇప్పటికే ఉగ్రవాదులకు అడ్డాగా ఉందని, చైనా వ్యూహంలో చిక్కుకుని ఇరాన్ అలాగే మిగిలిపోయే అవకాశముందని జోస్యం చెప్పారు. ఆయుధ వ్యవస్థలు, వాణిజ్యం, చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వచ్చే డబ్బులకు ఆశపడటం అంటే ఆ ప్రాంతాన్ని ప్రమాదంలోకి నెట్టడమేనని పాంపియో ట్విటర్లో పేర్కొన్నారు. ప్రపంచ దేశాలకు చైనా కమ్యూనిస్ట్ పార్టీ నుంచి ముప్పు పొంచి ఉందనేది స్పష్టమవుతోందని అన్నారు. (చదవండి: పరస్పర సహకారంతో ముందుకు సాగుదాం) హాంగ్‌కాంగ్ ప్రజాస్వామ్యవాదులను, ముఖ్యంగా ముస్లిం పౌరుల హక్కులను చైనా కాలరాస్తున్న ఉదంతాలే దీనికి ఉదాహరణ అని పేర్కొన్నారు. అయితే, చాలా దేశాలు డ్రాగన్ పడగ నుంచి బయటపడేందుకు, స్వేచ్ఛ, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి చర్యలు ప్రారంభించాయని చెప్పారు. చైనాలో ఉంటున్న అమెరికన్లు జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా పాంపియో సూచించారు. కాగా, చైనాకు చెందిన పలు యాప్‌లపై అమెరికా ఇటీవల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఇక చాబహార్ రైల్వేలైన్ ఇప్పందం నుంచి భారత్‌ని తప్పించిన ఇరాన్ డ్రాగన్ కంట్రీని దగ్గరవుతుండటం గమనార్హం. (ఈ బాంధవ్యాన్ని చేజారనీయొద్దు) .@SecPompeo: China’s entry into Iran will destabilize the Middle East. Iran remains the world’s largest state sponsor of terror, and to have access to weapons systems and commerce and money flowing from the Chinese Communist Party only compounds that risk for that region. pic.twitter.com/sWlF0rv5mP — Department of State (@StateDept) August 9, 2020 -
జైశంకర్‌తో మైక్ పాంపియో ఫోన్ సంభాషణ
వాషింగ్టన్/న్యూఢిల్లీ: ఇండో- పసిఫిక్ ప్రాంతంలో శాంతి, సుస్థిరత, భద్రతకై భారత్- అమెరికా కలిసి పనిచేస్తాయని ఇరు దేశాల విదేశాంగ మంత్రులు పునరుద్ఘాటించారు. ద్వైపాక్షిక బంధాలను మరింత బలోపేతం చేసుకుంటూ ముందుకు సాగుతాయని స్పష్టం చేశారు. భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్‌తో అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ఫోన్లో సంభాషించారు. ఇందులో భాగంగా మహమ్మారి కోవిడ్-19 కట్టడికై తీసుకోవాల్సిన చర్యలు, అంతర్జాతీయ సమాజంలో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలు(ప్రపంచంపై కరోనా ప్రభావం, అఫ్గనిస్తాన్‌లో తాలిబన్ల బాంబు దాడులు), ద్వైపాక్షిక, బహుళ పాక్షిక సంబంధాలు తదితర అంశాల గురించి చర్చించారు.(ఒక్క రోజే 2 వేలకు పైగా మరణాలు) ఈ క్రమంలో వచ్చే ఏడాది ఇరు వర్గాల మధ్య 2+2 చర్చలు జరిపే అవకాశాలను పరిశీలించారు. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి కేల్ బ్రౌన్ గురువారం ఓ ప్రకటనలో చర్చలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. కాగా 2018 సెప్టెంబరులో న్యూఢిల్లీలో ఇరు దేశాల మధ్య 2+2 చర్చలు జరిగిన విషయం తెలిసిందే. ఇక భారత్- చైనా సరిహద్దుల్లో డ్రాగన్ కవ్వింపు చర్యలు, ఆసియా- పసిఫిక్ ప్రాంతంపై ఆధిపత్యం చాటుకునేందుకు ప్రయత్నిస్తున్న వైఖరి, అమెరికా సహా ఇతర ప్రపంచ దేశాలపై కరోనా ప్రభావం తదితర అంశాల్లో చైనాపై అగ్రరాజ్యం గుర్రుగా ఉన్న నేపథ్యంలో వీరిరువురి చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. (భారత్- అమెరికాల బంధం మరింత బలపడాలి) కాగా సరిహద్దుల్లో దూకుడుగా వ్యవహరిస్తూ, ఇండో- పసిఫిక్ ప్రాదేశిక జలాల విషయంలో చట్టవ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న చైనాకు అడ్డుకట్ట వేసేందుకు భారత్- అమెరికా మధ్య బంధం మరింత బలపడాలని అగ్రరాజ్య చట్టసభ ప్రతినిధులు అభిప్రాయపడిన విషయం తెలిసిందే. సార్వభౌమత్వం, సమగ్రతలను కాపాడుకునే క్రమంలో అమెరికా భారత్‌కు అన్ని విధాలా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. కాగా దక్షిణ చైనా సముద్ర పరిసరాల్లో ఉన్న ఆయిల్, గ్యాస్ నిల్వలపై కన్నేసిన చైనా ఇతర దేశాలతో చైనా గొడవపడుతోందని అమెరికా గతంలో ఆరోపించిన సంగతి తెలిసిందే. మరోవైపు సదరు ప్రాదేశిక జలాల్లోని చమురు నిల్వలపై బ్రూనై, ఫిలిప్పీన్స్, మలేసియా, తైవాన్, వియత్నాం దేశాలు అభ్యంతరం వ్యక్తం చేయడం సహా.. ఈ సహజ నిల్వలపై హక్కు ఉందని వాదిస్తున్నాయి. -
అమెరికాలో టిక్‌టాక్‌ను నిషేధిస్తా
వాషింగ్టన్: చైనాతో విభేదాలు ముదురుతున్న నేపథ్యంలో ఆ దేశానికి చెందిన కంపెనీలపై అధ్యక్షుడు ట్రంప్ మరోసారి కొరడా ఝళిపించారు. చైనాకే చెందిన వీడియో యాప్ టిక్‌టాక్‌పై అమెరికాలో నిషేధం విధించనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అమెరికా టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఈ యాప్‌ను సొంతం చేసుకునేందుకు చర్చలు జరుపుతోందన్న వార్తల నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేయడం గమనార్హం. ‘శనివారం కల్లా ఈ చైనా యాప్‌పై చర్యలు తీసుకుంటా. నాకున్న అత్యవసర అధికారాలను వినియోగించుకుంటా లేదా ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులను జారీ చేస్తా’అని ఆయన శుక్రవారం మీడియాతో అన్నారు. టిక్‌టాక్ హక్కులను అమెరికా కంపెనీ కొనుగోలు చేయడం తనకు ఆమోదయోగ్యం కాదని చెప్పారు. అమెరికాలో టిక్‌టాక్ హక్కుల కోసం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల వేలకోట్ల ఒప్పందం కుదుర్చుకునేందుకు చురుగ్గా చర్చలు జరుపుతున్నారంటూ వాల్‌స్ట్రీట్ జర్నల్‌లో శుక్రవారం ఒక కథనం వెలువడింది. ఈ చర్చల్లో టిక్‌టాక్ మాతృసంస్థ బైట్డ్యాన్స్తోపాటు అధ్యక్ష భవనం ప్రతినిధులు పాల్గొన్నారని తెలిపింది. అమెరికన్ల వ్యక్తిగత గోప్యత, భద్రతకు ప్రమాదకరంగా మారిందంటూ టిక్‌టాక్‌పై విదేశాంగ మంత్రి మైక్ పాంపియో విమర్శలు చేస్తున్నారు. 29 వేల చైనా యాప్‌ల తొలగింపు చైనీస్ యాప్ స్టోర్ నుంచి శనివారం అకస్మాత్తుగా 29,800 యాప్‌లను స్మార్ట్‌ఫోన్ తయారీ దిగ్గజ సంస్థ యాపిల్ తొలగించింది. ఇందులో 26 వేలకు పైగా గేమ్ యాప్‌లే కావడం గమనార్హం. లైసెన్స్ లేని గేమ్ యాప్‌లపై చైనా అధికారులు చర్యలు తీసుకుంటున్నందునే యాపిల్ ఇలా చేసినట్లు క్విమై అనే పరిశోధన సంస్థ అంటోంది. చైనా ఆండ్రాయిడ్ యాప్ స్టోర్స్ ప్రభుత్వ నిబంధనలకు లోబడే చాలాకాలంలో పనిచేస్తున్నాయి. ఈ ఏడాది జూలై మొదటి వారంలో యాపిల్ తన యాప్ స్టోర్ నుంచి 2,500 టైటిళ్లను తొలగించింది. ఇందులో ప్రజాదరణ ఉన్న జింగా, సూపర్సెల్ వంటివి కూడా ఉన్నట్లు సమాచారం. -
‘చైనాను మార్చకుంటే అది మనల్ని మింగేస్తుంది’
వాషింగ్టన్ : చైనా వ్యవహారంలో గుడ్డిగా ముందుకెళ్లడం తగదని డ్రాగన్‌తో నిర్ధిష్ట వ్యూహాలతో అమెరికా సహా మిత్రదేశాలు వ్యవహరించాలని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో అన్నారు. చైనా కమ్యూనిస్ట్ పార్టీ తన ధోరణి మార్చుకునేలా చేయడం ఇప్పుడు మిగతా ప్రపంచం ముందున్న అంశమని స్పష్టం చేశారు. చైనా హోస్టన్ కాన్సులేట్ మూసివేతపై అమెరికా ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో పాంపియో వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. చైనా సైన్యం పటిష్టంగా మరింత దుందుడుకుగా మారిందని డ్రాగన్ పట్ల అపనమ్మకం, నిర్ధారించుకునే ధోరణితోనే ఉండాలని చెప్పారు. 1980ల్లో సోవియట్ యూనియన్ పట్ల అప్పటి అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ ‘విశ్వసించు అయితే నిర్ధారించు’ అనే విధానం అనుసరించిన తీరును గుర్తుచేస్తూ పాంపియో ఈ వ్యాఖ్యలు చేశారు. మన విధానాలు..ఇతర స్వేచ్ఛాయుత దేశాలు పతనమవుతున్న చైనా ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి ఊతమిస్తుంటే తనకు చేయూతనిస్తున్న చేతులను నరకాలని బీజింగ్ చూస్తోందని డ్రాగన్ తీరుపై మండిపడ్డారు. చైనా చర్యలు మన ప్రజలకు, మన సంపదకు ముప్పుగా పరిణమిస్తున్న క్రమంలో స్వేచ్ఛను కాంక్షించే దేశాలు డ్రాగన్ తీరు మారేలా నిర్ధిష్ట పద్ధతుల్లో ముందుకు సాగాలని పిలుపు ఇచ్చారు. స్వేచ్ఛాయుత ప్రపంచం మారనిపక్షంలో కమ్యూనిస్టు చైనా మనల్ని తప్పుకుండా మార్చేస్తుందని ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలను పాంపియో గుర్తుచేశారు. చదవండి : చైనా వక్ర బుద్ధి.. సరిహద్దుల్లో 40 వేల సైన్యం -
భారత్‌కు ఆ అవకాశం ఉంది: అమెరికా
వాషింగ్టన్: చైనాతో విభేదాలు తారస్థాయికి చేరుకున్న వేళ అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో కీలక వ్యాఖ్యలు చేశారు. అగ్రరాజ్యంతో పాటు ప్రపంచంలోని వివిధ దేశాల నమ్మకం చూరగొన్న భారత్‌కు చైనా నుంచి తరలిపోతున్న అంతర్జాతీయ స్థాయి కంపెనీలను ఆకర్షించగల సత్తా ఉందని పేర్కొన్నారు. అదే విధంగా వాణిజ్య అవసరాల కోసం భారత్ డ్రాగన్ కంపెనీలపై ఆధారపడటం తగ్గించుకోవాలని.. అప్పుడే చైనీస్ కమ్యూనిస్టు పార్టీ సృష్టిస్తున్న అవాంతరాలను సులభంగా అధిగమించవచ్చని అభిప్రాయపడ్డారు. (అగ్రదేశాల దౌత్య యుద్ధం) ఈ మేరకు బుధవారం జరిగిన యూఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్(యూఎస్ఐబీసీ)- ‘‘ఇండియా ఐడియాస్ సమ్మిట్’’లో వర్చువల్ సమావేశంలో పాంపియో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్య దేశాలైన అమెరికా- భారత్ కలిసి పనిచేస్తే ఎంతో బాగుంటుందని.. అయితే అనుకున్న లక్ష్యాలు సాధించాలంటే పెట్టుబడులు పెట్టేందుకు భారత్ మరింత సానుకూల వాతావరణం కల్పించాల్సి ఉంటుందన్నారు.(అమెరికా కంపెనీలకు ప్రధాని మోదీ పిలుపు) అదే విధంగా తాము కేవలం ద్వైపాక్షిక సంబంధాలకే పరిమితం కాబోమని.. తమకు ఉన్న అతికొద్ది నమ్మకమైన, ఒకే ఆలోచనా విధానం కలిగిన దేశాల్లో భారత్ కూడా ఒకటి అంటూ ప్రశంసలు కురిపించారు. భారత్‌తో బంధాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు సుముఖంగా ఉన్నామని.. జీ-7 సదస్సుకు భారత ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించిన విషయాన్ని ఈ సందర్భంగా పాంపియో గుర్తు చేశారు. ఇక చట్టాలకు లోబడి పనిచేసే సంస్థలు, పారదర్శకతకు అమెరికా పెద్ద పీట వేస్తుందన్న ఆయన.. జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా టిక్‌టాక్ సహా 59 చైనీస్ యాప్‌లను భారత్ నిషేధం విధించిన విషయాన్ని ప్రస్తావించారు. చైనాలోని వుహాన్ నగరంలో పురుడుపోసుకున్న కరోనా వైరస్ కల్లోలం కారణంగా ఆర్థిక వ్యవస్థలు, ప్రైవేటు రంగం కుదేలైన విషయాన్ని గుర్తు పెట్టుకుని ప్రపంచ దేశాలు ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. కాగా భారత్‌లోని ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాలు, రక్షణ, ఇంధన, వ్యవసాయం, బీమా రంగాల్లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలంటూ అమెరికా కంపెనీలకు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఆహ్వానం పలికిన విషయం తెలిసిందే. -
అమెరికా నిర్ణయం.. చైనాకు భారీ షాక్
వాషింగ్టన్: గల్వాన్ వ్యాలీ ఘర్షణ తర్వాత కేంద్ర ప్రభుత్వం టిక్‌టాక్ సహా 59 చైనా యాప్‌లను బహిష్కరించిన సంగతి తెలిసిందే. భారత్ నిర్ణయానికి అమెరికా మద్దతు తెలిపింది. అంతేకాక ప్రస్తుతం తాము కూడా చైనా యాప్‌లను బహిష్కరించాలనే ఆలోచనలో ఉన్నట్లు ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నేను అధ్యక్షుడి కంటే ముందు బయటపడాలని అనుకోవడం లేదు. కానీ చైనా యాప్‌లను బహిష్కరించాలని భావిస్తున్న మాట మాత్రం వాస్తవం. అధ్యక్షుడి నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాం’ అన్నారు. అమెరికా చట్టసభ సభ్యులు కూడా టిక్‌టాక్ యాప్ పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వ నియంత్రణలో ఉన్న అక్కడి సాఫ్ట్వేర్ కంపెనీలు చైనా ప్రభుత్వానికి సహకరిస్తున్నాయని వారు ఆరోపిస్తున్నారు. అంతేకాక టిక్‌టాక్ అమెరికా యూజర్ల డాటాను నిర్వహించడంపై కూడా అమెరికా చట్టసభ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.(‘బ్యాన్ టిక్‌టాక్’ అమెరికాలోనూ..!) చైనాలో అందుబాటులో లేని టిక్‌టాక్ యాప్‌ను ప్రపంచ నలుమూలలా జనాలు వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో అన్ని దేశాలు చైనాయాప్లను బహిష్కరించాలని పాంపియో కోరారు. చైనా వంచన విధానంతోనే కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా స్వైర విహారం చేస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. అంతేకాక హాంగ్‌కాంగ్ వ్యవహారంలోనూ చైనా తీరుపై ఆగ్రహంగా ఉన్న అమెరికా తాజాగా ఇప్పుడు చైనా యాప్‌ల నిషేధం దిశగా అడుగులు వేయడం గమనార్హం. (టిక్‌టాక్ బ్యాన్ : సెలబ్రిటీల కష్టాలు) -
చైనా ముప్పును ఎదుర్కొందాం
వాషింగ్టన్: ఇండియా, మలేసియా, ఇండోనేíసియా, ఫిలిప్పైన్స్ తదితర దేశాలకు చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) నుంచి ముప్పు పెరుగుతోందని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో చెప్పారు. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి ఆయా దేశాలకు మద్దతుగా తమ సేనలను పంపించే విషయం ఆలోచిస్తున్నామని తెలిపారు. గురువారం జర్మన్ మార్షల్ ఫండ్‌కు చెందిన బ్రసెల్స్ ఫోరమ్–2020 కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆసియాలో పలు దేశాలకు ముప్పుగా పరిణమించిన పీఎల్ఏకు దీటైన సమాధానం చెప్పాలన్నదే తమ ఉద్దేశమని పేర్కొన్నారు. క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులను బట్టి తాము సరైన రీతిలోనే స్పందిస్తామని వ్యాఖ్యానించారు. సవాళ్లను ఎదుర్కొనేందుకు వనరులను ఉపయోగిస్తామని చెప్పారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మార్గదర్శకత్వంలో తమ వ్యూహం ఉంటుందని, అందులో భాగంగానే జర్మనీలో తమ సైనిక బలగాలను 52,000 నుంచి 25,000కు తగ్గిస్తున్నట్లు తెలిపారు. జర్మనీ నుంచి తరలించే తమ బలగాలను నిర్దేశిత ప్రాంతాల్లో మోహరిస్తామన్నారు. ఇండియా, వియత్నాం, మలే సియా, ఇండోనేసియా, ఫిలిప్పైన్స్, దక్షిణ చైనా సముద్రంలో తమ సేనల అవసరం ఉందన్నారు. మనమంతా కలిసికట్టుగా పని చేయాలి శత్రువు విసురుతున్న సవాళ్ల నుంచి మన స్వేచ్ఛాయుత సమాజాలను, మన శ్రేయస్సు, మన భవిష్యత్తును కాపాడుకోవడానికి మనమంతా కలిసికట్టుగా పని చేయాలని మైక్ పాంపియో పిలుపునిచ్చారు. అదంత సులభం కానప్పటికీ మన కృషిని కొనసాగించాలని అన్నారు. చైనా వల్ల ప్రయోజనాలు పొందుతున్న వ్యాపార వర్గాలు భిన్నమైన వాదన వినిపిస్తున్నాయని గుర్తుచేశారు. స్వేచ్ఛ, నియంతృత్వం మధ్య ఎప్పుడూ రాజీ కుదరదని స్పష్టం చేశారు. చైనా ఇతర దేశాలను రెచ్చగొడుతోందని ఆరోపించారు. మన భవిష్యత్తును చైనా కమ్యూనిస్టు పార్టీ నిర్దేశించడం ఏమిటని ప్రశ్నించారు. దక్షిణ చైనా సముద్రంలో, ఇండియాతో సరిహద్దు విషయంలో చైనా దూకుడుగా వ్యవహరిస్తోందని తప్పుపట్టారు. చైనాపై ఇండియన్ అమెరికన్ల నిరసన తూర్పు లద్దాఖ్‌లో చైనా సైనికులు తిష్టవేయడాన్ని నిరసిస్తూ షికాగోలోని చైనా కాన్సులేట్ వద్ద పలువురు ఇండియన్ అమెరికన్లు చైనా వ్యతిరేక నినాదాలు రాసి ఉన్న ప్లకార్డులు చేతబూని ప్రదర్శన చేపట్టారు. చైనా దుందుడుకు చర్యలపై తాము మౌనంగా ఉండబోమని వారు స్పష్టం చేశారు. అలా చేస్తే పర్యవసానాలు తీవ్రం సరిహద్దుల్లో యధాతథ స్థితిని మార్చే ప్రయత్నాలు చేయవద్దు చైనాకు భారత్ హెచ్చరిక బీజింగ్: సరిహద్దుల్లో యధాతథ స్థితిని మార్చాలని ప్రయత్నిస్తే పరిణామాలు, పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని భారత్ చైనాను ఘాటుగా హెచ్చరించింది. అలాంటి ప్రయత్నాలు చేస్తే సరిహద్దుల్లో శాంతికి విఘాతం కలగడమే కాకుండా, విస్తృతమైన ద్వైపాక్షిక సంబంధాలపై పెను ప్రతికూల ప్రభావం పడుతుందని స్పష్టం చేసింది. తూర్పు లద్దాఖ్‌లో కార్యకలాపాలను నిలిపేయాలని చైనాలో భారత రాయబారి విక్రమ్ మిస్త్రీ శుక్రవారం స్పష్టం చేశారు. సరిహద్దుల్లో చైనా దుందుడుకు చర్యలతో ఆ దేశంపై విశ్వాసం సన్నగిల్లిందన్నారు. ద్వైపాక్షిక సంబంధాలు సజావుగా ఉండాలంటే.. సరిహద్దుల్లో శాంతి నెలకొనడం అత్యంతావశ్యకమన్న విషయం చైనా గుర్తించాలని మిస్త్రీ హితవు పలికారు. గల్వాన్ లోయ తమదేనని చైనా పదేపదే చెప్పడం వల్ల పరిస్థితి మరింత దిగజారుతుందని హెచ్చరించారు. వాస్తవాధీన రేఖపై భారత్‌కు పూర్తిగా అవగాహన ఉందని, ఎల్ఏసీకి ఇటువైపు, ఇండియన్ ఆర్మీ పెట్రోలింగ్ చాన్నాళ్లుగా ఎలాంటి అడ్డంకులు లేకుండా కొనసాగుతోందని గుర్తు చేశారు. జూన్ 15 నాటి ఘర్షణకు కారణం భారత సైనికులేనన్న చైనా వాదనను విక్రమ్ మిస్త్రీ తోసిపుచ్చారు. ‘ఏప్రిల్, మే నెలల్లో గల్వాన్ లోయలో చైనా కార్యకలాపాలు పెరిగాయి. భారత పెట్రోలింగ్‌ను పదేపదే అడ్డుకున్నారు. అందుకే ఘర్షణలు చోటు చేసుకున్నాయి’ అని స్పష్టం చేశారు. రాజ్‌నాథ్‌తో ఆర్మీ చీఫ్ భేటీ న్యూఢిల్లీ: చైనా సరిహద్దుల్లోని తూర్పు లద్దాఖ్‌లో వాస్తవ పరిస్థితిని, భారత సైన్యం సన్నద్ధతను ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె శుక్రవారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు వివరించారు. జూన్ 23, 24 తేదీల్లో జనరల్ నరవణె లద్దాఖ్‌లో పర్యటించి, క్షేత్ర స్థాయి పరిస్థితిని సమీక్షించిన విషయం తెలిసిందే. రాజ్‌నాథ్ కూడా 22 నుంచి 24 వరకు రష్యాలో పర్యటించి వచ్చారు. సరిహద్దుల రక్షణ బాధ్యత సర్కారుదే: సోనియా న్యూఢిల్లీ: భారత సరిహద్దులను కాపాడే బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పించుకోలేదని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. లడ్దాఖ్ పరిస్థితుల విషయంలో దేశప్రజల అభిప్రాయాలను విశ్వాసంలోకి తీసుకోవాలని ప్రధాని మోదీకి సూచించారు. భారత్ చైనా సరిహద్దుల్లోని లడ్దాఖ్లో ప్రాణత్యాగాలు చేసిన సైనిక అమరవీరుల స్మారకార్థం కాంగ్రెస్ చేపట్టిన ‘స్పీక్ అప్ ఫర్ అవర్ జవాన్స్’కార్యక్రమంలో సోనియా వీడియో సందేశం ఇచ్చారు. ప్రధాని మోదీ చెప్పినట్టు భారత భూభాగంలోకి చైనా చొచ్చుకొని రాకపోతే, 20 మంది భారత సైనికులు ఎందుకు ప్రాణాలు కోల్పోయారని ప్రశ్నించారు. మన సైన్యానికి సంపూర్ణ సహకారాన్ని, శక్తిని అందించడమే నిజమైన దేశభక్తి అవుతుందని సోనియా అన్నారు. చైనా మన భూభాగాన్ని ఆక్రమించుకోలేదని ప్రధాని చెప్పడం పొరుగు దేశానికి మేలు చేయడమేనని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. తన వీడియో సందేశంలో ఆయన..తూర్పు లడ్దాఖ్లో భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని ఉపగ్రహ చిత్రాలు, రక్షణ రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు. -
డ్రాగన్‌కు చెక్ : రంగంలోకి అమెరికా బలగాలు
వాషింగ్టన్ : భారత్ సహా పలు ఆసియా దేశాలకు చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నుంచి ఎదురవుతున్న ముప్పును నిలువరించేందుకు తమ అంతర్జాతీయ బలగాలను తరలించే అవకాశాన్ని సమీక్షిస్తున్నామని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో పేర్కొన్నారు. చైనా సైన్యాన్ని దీటుగా నిలువరించేందుకు సన్నద్ధంగా ఉన్నామని, అందుకు అవసరమైన వనరులు సిద్ధం చేస్తామని బ్రజెల్స్ ఫోరం 2020ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ పాంపియో ఈ వ్యాఖ్యలు చేశారు. జర్మనీలో అమెరికన్ బలగాలను 52,000 నుంచి 25,000కు తగ్గిస్తున్న క్రమంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలకు అనుగుణంగా సైనిక బలగాల సమీక్షను చేపడతామని చెప్పారు. క్షేత్రస్ధాయి పరిస్థితులకు అనుగుణంగా బలగాల మోహరింపుపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. నిర్ధిష్ట ప్రాంతాల్లో అమెరికన్ దళాలున్నాయని, తాజాగా భారత్, వియత్నాం, మలేషియా, ఇండోనేషియా వంటి దేశాలకు చైనా నుంచి ముప్పు నెలకొందని అన్నారు. ఏ ప్రాంతానికినా ముప్పు ఎదురైతే ఇతర దేశాలు బాధ్యత తీసుకుని వారిని రక్షించాల్సిన అవసరం ఉందని, ఈ అంశాలపై ఐరోపా దేశాలతో పాటు తమ భాగస్వాములందరితో సంప్రదింపులు జరుపుతామని పాంపియో పేర్కొన్నారు. కాగా భారత్, చైనాల మధ్య సరిహద్దు వివాదం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన సంగతి తెలిసిందే. చర్చల్లో శాంతి మంత్రం జపిస్తున్న చైనా మరోవైపు సరిహద్దుల్లో పెద్దసంఖ్యలో సైన్యాన్ని మోహరిస్తుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. చదవండి : నార్త్ కొరియాకు అమెరికా, ద. కొరియా విజ్ఞప్తి! -
భారత్, చైనాలతో మాట్లాడుతున్నాం: ట్రంప్
వాషింగ్టన్: భారత్, చైనాల మధ్య సయోధ్యకు ప్రయత్నిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం పేర్కొన్నారు. గల్వాన్ ఘటన నేపథ్యంలో.. రెండు దేశాల మధ్య నెలకొన్న తీవ్రస్థాయి ఉద్రిక్తతలను తగ్గించేందుకు సహాయపడే ఉద్దేశంతో తమ ప్రభుత్వం భారత్, చైనాలతో మాట్లాడుతోందని ట్రంప్ వ్యాఖ్యానించారు. ‘పరిస్థితి సీరియస్ గానే ఉంది. మేం భారత్‌తో, చైనాతో మాట్లాడుతున్నాం. వాళ్లు పెద్ద సమస్యను ఎదుర్కొంటున్నారు. వాళ్లు ముఖాముఖి తలపడ్డారు. అక్కడేం జరిగిందో చూసాం. వివాద పరిష్కారంలో వారికి సాయం చేయాలని ప్రయత్నిస్తున్నాం’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ‘చైనా సైన్యమైన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ భారత్‌తో సరిహద్దు ఉద్రిక్తతలను పెంచుతోంది. దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో కూడా తనవి కాని ప్రాంతాలను తనవేనని ప్రకటిస్తూ ఉద్రిక్తతలను రాజేస్తోంది’ అని యూఎస్ విదేశాంగ మంత్రి మైక్ పాంపియో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. చైనాలోని అధికార కమ్యూనిస్ట్ పార్టీని ధూర్త వ్యవస్థగా అభివర్ణించారు. ట్రంప్ ప్రభుత్వం గల్వాన్ ఘటనపై భారత్‌కు మద్దతిస్తోంది. -
చైనా కాఠిన్యంపై అమెరికా ఆగ్రహం
వాషింగ్టన్ : భారత్-చైనా సరిహద్దుల్లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనపై అగ్రరాజ్యం అమెరికా మరోసారి ఘాటుగా స్పందించింది. పొరుగు దేశాలతో చైనా వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టింది. ఓ వైపు ప్రపంచ దేశాలన్నీ శాంతిని కోరుతుంటే డ్రాగన్ మాత్రం సరిహద్దు దేశాలతో కయ్యానికి కాలుదువ్వడం సరైనది కాదని ఆక్షేపించింది. ఈ మేరకు శుక్రవారం రాత్రి డెన్మార్క్‌తో నిర్వహించిన ఓ వీడియో కాన్ఫరెన్స్ సదస్సులో అమెరికా విదేశాంగశాఖ మంత్రి మైక్ పాంపియో కీలక ప్రసంగం చేశారు. ప్రస్తుతం ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితుల్లో చైనా అవలంభిస్తున్న విధానం అంత సహేతుకమైనది కాదని విమర్శించారు. (చైనా వ్యతిరేక బాటలో మరో తరం) తాజాగా భారత సైనికులపై ఆ దేశ ఆర్మీ పాల్పడిన కాఠిన్యాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. రెండు అత్యధిక జనాభాగల దేశాల మధ్య ఘర్షణపూరితమైన వాతావరణం ఇరుపక్షాలకు నష్టం చేకూర్చే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా సరిహద్దు దేశాలతో డ్రాగన్ అవలంభిస్తున్న తీరును మైక్ పాంపియా తప్పుబట్టారు. హాంకాంగ్ స్వేచ్ఛా స్వాతంత్ర్యాలపై చైనా గుత్తాధిపత్యం ఆ దేశ పౌరులకు పెను ప్రమాదమని హెచ్చరించారు. పక్క దేశ పౌరుల స్వేచ్ఛను హరించే హక్కు చైనాకు లేదని స్పష్టం చేశారు. అలాగే దక్షిణ చైనా సముద్రం, జపాన్, మలేషియా దేశాలతో చైనా వివాదాలను ఆయన తీవ్రంగా ఖండించారు. (చైనాకు వ్యతిరేకంగా ఒక్కటైన నెటిజన్లు!) కాగా చైనా-అమెరికా మధ్య ఇప్పటికే వాణిజ్యం యుద్ధం తారాస్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతున్న ప్రాణాంతక కరోనా వైరస్‌ను డ్రాగన్ కుట్రపూరితంగానే లీక్ చేసిందనే ఆరోపణలు ఇరు దేశాల మధ్య ఘర్షణ వాతావరణాన్ని సృష్టించాయి. ఇక ఈ ఏడాది చివరిలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో తనను ఓడించేందుకు చైనా పరోక్షంగా కుట్రలు పన్నుతోందంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే గుర్రుగా ఉన్నారు. చైనా విషయంలో మైక్ పాంపియా మొదటి నుంచీ చురుకుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఆ దేశ కుట్రలు, కుతంత్రాలను ఎప్పటికప్పుడు ట్రంప్‌కు చేరవేస్తూ.. యూఎస్ విదేశాంగ విధానంలో కీలకంగా మారారు. -
వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్న ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అగ్రరాజ్యం అధికారాలు మరోసారి చేపట్టడానికి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. చైనాను పదేపదే విమర్శిస్తూ.. రాబోయే ఎన్నికల్లో గెలవాలని ట్రంప్ భావిస్తున్నారా అంటే అవుననే ఊహాగానాలే వినిపిస్తున్నాయి. నవంబర్‌లో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నారు. కాగా.. చైనా- అమెరికా సంబంధాలపై అమెరికా వాణిజ్య ప్రతినిధి రాబర్ట్ లైట్ జైజర్ గురువారం ఓ ట్వీట్ చేస్తూ.. అమెరికా-చైనా వాణిజ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు. వెంటనే దీనిని డొనాల్డ్ ట్రంప్ ఖండిస్తూ.. ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలను పూర్తిస్థాయిలో విడదీయడం సహేతుకమైన విధానం కాదంటూ వ్యాఖ్యానించారు. కాగా.. చైనా- అమెరికా వాణిజ్య ఒప్పందం చాలా గొప్పదని నేను భావిస్తున్నాను. మేము చైనీస్ ప్లేగుతో బాధపడుతున్నప్పటి నుంచి కూడా ఆ దేశంతో ప్రతిదానికీ నేను భిన్నంగా ఉన్నాను. నేను ఎప్పుడూ చైనాపై కఠినంగానే వ్యవహరిస్తున్నాను. అమెరికా- చైనా వాణిజ్య ఒప్పందం ప్రకారం వ్యవసాయ ఉత్పత్తులను చైనా కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉందని చైనా అధికారి యాంగ్ జీజీ, అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపియో పేర్కొన్నారు. అయితే.. అమెరికాలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ట్రంప్.. బీజింగ్‌కు వ్యతిరేకంగా తన మాటల వేడిని పెంచారు. కరోనాని 'చైనా నుండి వచ్చిన ప్లేగు'గా పేర్కొన్నారు. కరోనా వ్యాప్తి ప్రారంభ దశలో ఆ దేశం సమాచారాన్ని ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిందని ఆరోపించారు. చదవండి: ట్రంప్‌పై బోల్టన్ సంచలన వ్యాఖ్యలు దీనిపై ట్రంప్ యొక్క మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ పలు ఆరోపణలు చేశారు. అమెరికా రైతుల నుంచి వ్యవసాయోత్పతులను చైనా కొనుగోలు చేయాలని ఆ దేశాన్ని ట్రంప్ కోరారని, పైగా అధ్యక్ష పదవికి నవంబరులో జరిగే ఎన్నికల్లో తనకు సాయం చేయాల్సిందిగా చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ ని కోరినట్లు ఆయన పేర్కొన్నారు. ఒసాకాలో గత ఏడాది జూన్‌లో జరిగిన జీ-20 సమావేశం సందర్భంగా వాణిజ్య అంశాలపై ఇరు దేశాల అధ్యక్షలు చర్చించారని జాన్ బోల్టన్ తన పుస్తకంలో వెల్లడించాడు. అదే సమయంలో రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలిచేందుకు చైనా అధ్యక్షుడి సాయాన్ని కోరినట్లు ‘ది రూమ్ వేర్ ఇట్ హ్యాపెండ్’ పుస్తకంలో జాన్ బోల్టన్ వివరించాడు. ఈ విమర్శల బారినుంచి బయటపడడానికి జాన్ బోల్టన్ రాసిన ఓ పుస్తకాన్ని డొనాల్డ్ ట్రంప్ బ్యాన్ చేశారు. దీంతో ట్రంప్ చర్యలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. బోల్టన్ వ్యాఖ్యలపై ట్రంప్ స్పందిస్తూ.. ఈ రచయిత చట్టాన్ని ఉల్లంఘించారని, ఇది తప్పుడు సమాచారమంటూ ట్వీట్ చేశారు. ఇందులో అన్నీ అబధ్ధాలు, ఫేక్ స్టోరీస్ ఉన్నాయని అన్నారు. జాన్ బోల్టన్ ప్రచారం చేసుకుంటున్న సంఘటనలేవీ జరగలేదన్నారు. ఆయనను మూర్ఖుడుగా అభివర్ణించారు. చదవండి: డీఏసీఏపై ట్రంప్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ