వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అగ్రరాజ్యం అధికారాలు మరోసారి చేపట్టడానికి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. చైనాను పదేపదే విమర్శిస్తూ.. రాబోయే ఎన్నికల్లో గెలవాలని ట్రంప్ భావిస్తున్నారా అంటే అవుననే ఊహాగానాలే వినిపిస్తున్నాయి. నవంబర్‌లో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నారు. కాగా.. చైనా- అమెరికా సంబంధాలపై అమెరికా వాణిజ్య ప్రతినిధి రాబర్ట్ లైట్ జైజర్ గురువారం ఓ ట్వీట్ చేస్తూ.. అమెరికా-చైనా వాణిజ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు. వెంటనే దీనిని డొనాల్డ్ ట్రంప్ ఖండిస్తూ.. ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలను పూర్తిస్థాయిలో విడదీయడం సహేతుకమైన విధానం కాదంటూ వ్యాఖ్యానించారు.
కాగా.. చైనా- అమెరికా వాణిజ్య ఒప్పందం చాలా గొప్పదని నేను భావిస్తున్నాను. మేము చైనీస్ ప్లేగుతో బాధపడుతున్నప్పటి నుంచి కూడా ఆ దేశంతో ప్రతిదానికీ నేను భిన్నంగా ఉన్నాను. నేను ఎప్పుడూ చైనాపై కఠినంగానే వ్యవహరిస్తున్నాను. అమెరికా- చైనా వాణిజ్య ఒప్పందం ప్రకారం వ్యవసాయ ఉత్పత్తులను చైనా కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉందని చైనా అధికారి యాంగ్ జీజీ, అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపియో పేర్కొన్నారు. అయితే.. అమెరికాలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ట్రంప్.. బీజింగ్‌కు వ్యతిరేకంగా తన మాటల వేడిని పెంచారు. కరోనాని 'చైనా నుండి వచ్చిన ప్లేగు'గా పేర్కొన్నారు. కరోనా వ్యాప్తి ప్రారంభ దశలో ఆ దేశం సమాచారాన్ని ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిందని ఆరోపించారు. చదవండి: ట్రంప్‌పై బోల్టన్ సంచలన వ్యాఖ్యలు
దీనిపై ట్రంప్ యొక్క మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ పలు ఆరోపణలు చేశారు. అమెరికా రైతుల నుంచి వ్యవసాయోత్పతులను చైనా కొనుగోలు చేయాలని ఆ దేశాన్ని ట్రంప్ కోరారని, పైగా అధ్యక్ష పదవికి నవంబరులో జరిగే ఎన్నికల్లో తనకు సాయం చేయాల్సిందిగా చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ ని కోరినట్లు ఆయన పేర్కొన్నారు. ఒసాకాలో గత ఏడాది జూన్‌లో జరిగిన జీ-20 సమావేశం సందర్భంగా వాణిజ్య అంశాలపై ఇరు దేశాల అధ్యక్షలు చర్చించారని జాన్ బోల్టన్ తన పుస్తకంలో వెల్లడించాడు. అదే సమయంలో రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలిచేందుకు చైనా అధ్యక్షుడి సాయాన్ని కోరినట్లు ‘ది రూమ్ వేర్ ఇట్ హ్యాపెండ్’ పుస్తకంలో జాన్ బోల్టన్ వివరించాడు.
ఈ విమర్శల బారినుంచి బయటపడడానికి జాన్ బోల్టన్ రాసిన ఓ పుస్తకాన్ని డొనాల్డ్ ట్రంప్ బ్యాన్ చేశారు. దీంతో ట్రంప్ చర్యలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. బోల్టన్ వ్యాఖ్యలపై ట్రంప్ స్పందిస్తూ.. ఈ రచయిత చట్టాన్ని ఉల్లంఘించారని, ఇది తప్పుడు సమాచారమంటూ ట్వీట్ చేశారు. ఇందులో అన్నీ అబధ్ధాలు, ఫేక్ స్టోరీస్ ఉన్నాయని అన్నారు. జాన్ బోల్టన్ ప్రచారం చేసుకుంటున్న సంఘటనలేవీ జరగలేదన్నారు. ఆయనను మూర్ఖుడుగా అభివర్ణించారు. చదవండి: డీఏసీఏపై ట్రంప్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
Comments
Please login to add a commentAdd a comment