షరీఫ్.. పదవి నుంచి తప్పుకో..! | Pakistan Army Chief General Raheel Sharif meets PM Nawaz Sharif; reports say asked PM to step down | Sakshi
Sakshi News home page

షరీఫ్.. పదవి నుంచి తప్పుకో..!

Published Tue, Sep 2 2014 1:42 AM | Last Updated on Sat, Sep 2 2017 12:43 PM

షరీఫ్.. పదవి నుంచి తప్పుకో..!

షరీఫ్.. పదవి నుంచి తప్పుకో..!

పాక్ ప్రధానికి ఆర్మీ చీఫ్ రషీద్ సలహా?

* మీడియాలో వార్తలు
* ఖండించిన ప్రభుత్వం, ఆర్మీ
* సచివాలయం, ప్రభుత్వ టీవీ కార్యాలయాల్లోకి దూసుకెళ్లిన ఆందోళనకారులు

 
ఇస్లావూబాద్: పాకిస్థాన్‌లో తలెత్తిన రాజకీయు సంక్షోభం రోజుకో లుపు తిరుగుతోంది. శనివారం ప్రారంభమైన ఉద్రిక్తత ఇంకా సద్దువుణగలేదు. తెహ్రీకేఇన్సాఫ్, పాకిస్థాన్ అవామీ తెహ్రీక్ పార్టీలకు కార్యకర్తలు సోవారం కేంద్ర సచివాలయుం, ప్రభుత్వ టీవీ చానల్ కార్యాలయూలను ముట్టడించి లోపలికి దూసుకెళ్లారు. రో పక్క తాజా సంక్షోభ పరిస్థితులపై చర్చించేందుకు ఆర్మీ చీఫ్ జనరల్ రషీద్ షరీఫ్, ప్రధాని నవాజ్ షరీఫ్‌తో భేటీ అయ్యూరు. సంక్షోభ నివారణకోసం పదవినుంచి తప్పుకోవాల్సిందిగా ఆర్మీ చీఫ్, ప్రధాని నవాజ్ షరీప్‌కు సలహా ఇచ్చినట్టు టీవీల్లో వార్తలు రావడంతో పాక్‌లో వాతావరణం వేడెక్కింది. అరుుతే దీనిని ప్రభుత్వంతోపాటు మిలిటరీ కూడా ఖండించింది.
 
ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందన్న ఆరోపణలను నిగ్గుతేల్చడానికి స్వతంత్య్ర కమిషన్ విచారణకు వీలుగా మూడునెలలపాటు తాత్కాలికంగా పదవినుంచి తప్పుకోవాలని ఆర్మీ చీఫ్ ప్రధానికి సలహా ఇచ్చినట్టు దునియూ టీవీ వార్తలు ప్రసారం చేసింది. ఇవన్నీ నిరాధార వార్తలని ప్రధాని కువూర్తె రియుమ్, ప్రభుత్వ ప్రతినిధి, మిలిటరీ ప్రతినిధి స్పష్టంచేశారు. ఉదయుం ఆందోళనకారులు గేట్లను విరగ్గొట్టి సచివాలయుంలోకి దూసుకెళ్లారు. భవనంలోకి రాకూడదని మిలిటరీ సిబ్బంది హెచ్చరించినప్పటికీ ఆందోళనకారులు పట్టించుకోలేదు. దాంతో ఆర్మీ జవాన్లు రబ్బరు బుల్లెట్లు, బాష్పవాయుువు ప్రయోగించారు.
 
అరుునప్పటికీ ఆందోళనకారులను నిలువరించలేకపోయూరు. ఆందోళనకారులు పలు ప్రభుత్వ వాహనాలను, ఉద్యోగుల వాహనాలను ధ్వంసం చేశారు. తర్వాత ఆందోళనకారులు ప్రభుత్వ ఆధ్వర్యంలోని పాకిస్థాన్ టెలివిజన్ చానల్ కార్యాలయుంలోకి దూసుకెళ్లారు. అక్కడ వారు కెమెరాలను ధ్వంసం చేయుడంతో కొద్దిసేపు ప్రసారాలకు అంతరాయుం ఏర్పడింది. అరుుతే ఆర్మీ సిబ్బంది వారిని బయుటకు తరిమేసి ఆఫీసును ఆధీనంలోకి తీసుకున్నారు.  ఇదిలా ఉండగా తెహ్రీకే ఇన్సాఫ్ చైర్మన్ ఇవ్రూన్ ఖాన్ వూట్లాడుతూ, ప్రధాని నవాజ్ షరీఫ్ గద్దెదిగాల్సిన సవుయుం వచ్చిందని అన్నారు. కాగా, తావుు హింసను ప్రేరేపించడం లేదని, ప్రధాని నివాసంలోకి, లేదా ప్రభుత్వ కార్యాలయూల్లోకి వెళ్లాల్సిందిగా కార్యకర్తలకు పిలుపునివ్వలేదని  స్పష్టంచేశారు. ఆర్మీ వుధ్యవర్తిత్వాన్ని తావుు కోరుకోవడం లేదని స్పష్టంచేశారు.
 
రో పక్క పాకిస్థాన్ అవామీ తెహ్రీక్ పార్టీ అధినేత ఖాద్రీ మాట్లాడుతూ, సంయనంతో ఉండాలని కార్యకర్తలను కోరారు.  కాగా, తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని షరీఫ్ మరోసారి స్పష్టం చేశారు. పాక్ రాజకీయ పరిణామాలపై భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తంచేసింది. పరిస్థితిని క్షుణ్ణంగా గమనిస్తున్నామని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement