ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరీ సెక్టార్‌లో కాల్పుల ఉల్లంఘనకు పాల్పడి నలుగురు సైనికులను హతమార్చిన పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు భారత సైన్యం సంసిద్ధమైంది. ‘పాక్‌కు భారత్ దీటుగా బదులిస్తుంది..తమ చేతలే దీనిపై పాక్‌కు సమాధానం చెబుతా’యని ఆర్మీ వైస్ చీఫ్ శరత్ చంద్ పేర్కొన్నారు. ‘ప్రతీకారం తప్పకుండా ఉంటుంది..దానిపై నేనేమీ చెప్పను..మేము చేపట్టే చర్యలే దీనిపై మాట్లాడతాయి..పాక్‌కు గట్టిగా బుద్ధి చెప్పేలా ప్రతీకార చర్యలు కొనసాగుతాయి’ అన్నారు. పాక్ కుయుక్తులపై ఎన్‌డీఏ భాగస్వామ్యపక్షం శివసేన ప్రభుత్వ వైఖరిని నిలదీసిన క్రమంలో ఆర్మీ వైస్ చీఫ్ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.
పాక్ మనపై యుద్ధం ప్రకటించిందని..ఆ దేశానికి అదే రీతిలో బుద్ధిచెప్పాలని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ పేర్కొన్నారు. మనం మౌనంగా ఉంటే ప్రపంచం ముంగిట భారత్ జవసత్వాలు కోల్పోతుందని రౌత్ ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment