శ్రీనగర్ : దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి దుందుడుకు చర్యకు పాల్పడింది. మంగళవారం సాయంత్రం మోర్టార్లు విసురుతూ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. జమ్ము కశ్మీర్‌లోని నౌగాం సెక్టార్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. మోర్టార్లు విసురుతూ, ఇతర ఆయుధాలతో కాల్పులకు దిగిన పాక్ సైనికులకు ధీటుగా బదులిచ్చామని భారత ఆర్మీ స్పష్టం చేసింది. ఈ దాడిలో ఎవరూ గాయపడలేదని, ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని తెలిపింది. కాగా పాక్ ఒక్క మంగళవారం నాడే రెండుసార్లు కాల్పులు విరమణ ఒప్పందాన్ని కాలరాసింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. గత పదహారేళ్లతో పోలిస్తే 2019లో అత్యధిక సార్లు(3168) పాకిస్తాన్ కాల్పుల ఉల్లంఘనకు తెగబడింది. (పీవోకే ప్రజలు భారత్‌లో కలవాలనుకుంటారు)
Comments
Please login to add a commentAdd a comment