కార్గిల్ యుద్ద వీరులకు విక్రమ్ సింగ్ నివాళి
Published Thu, Jul 24 2014 9:54 AM | Last Updated on Sat, Sep 2 2017 10:49 AM
జమ్మూ: 1999 కార్గిల్ యుద్ద వీరులకు ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్ విక్రమ్ సింగ్ శుక్రవారం నివాళులర్పించనున్నారు. జూలై 31న రిటైర్ కాబోతున్న విక్రమ్ సింగ్ జమ్మూలోని ద్రాసా ప్రాంతాన్ని సందర్శించనున్నట్టు డిఫెన్స్ అధికారులు తెలిపారు.
కేవలం ద్రాసాలోని విక్రమ్ సింగ్ పర్యటిస్తారని.. ఆ పర్యటన తర్వాత ఢిల్లీకి చేరుకుంటారని అధికారులు స్పష్టం చేశారు. 1999 నుంచి లడక్ ప్రాంతంలోని కార్గిల్ జిల్లాలోని జరిగిన పాకిస్థాన, భారత దేశాల మధ్య జరిగిన యుద్దంలో మరణించిన వీరులకు విజయ్ దివస్ పేరిట నివాళులర్పిస్తున్నామని అధికారులు తెలిపారు.
Advertisement
Advertisement