సాక్షి, ఢిల్లీ: ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే పదవీ కాలం పొడిగింపు ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే పదవీకాలాన్ని కేంద్రం నెల రోజులు పొడిగించింది. జూన్ 30 వరకు ఆర్మీ చీఫ్‌గా కొనసాగనున్నారు. పదవీకాలం పొడిగింపునకు కేబినెట్ అపాయింట్‌మెంట్ కమిటీ ఆదివారం ఆమోదం తెలిపింది. మనోజ్ పాండే ఈ నెల 31న పదవీ విరమణ చేయాల్సి ఉంది. గతంలోనూ కేంద్రం ఆయన పదవీకాలాన్ని పొడిగించిన సంగతి తెలిసిందే.
మనోజ్ పాండే ఏప్రిల్ 30, 2022న ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన మనోజ్ పాండే.. ఇప్పటి వరకు ఆర్మీ వైస్ చీఫ్‌గా ఉన్న జనరల్ పాండే, కార్ప్స్ ఆఫ్ ఇంజినీర్స్ విభాగం నుంచి ఈ అత్యున్నత పదవికి ఎంపికైన మొదటి వ్యక్తి. జనరల్ మనోజ్ పాండే నేషనల్ డిఫెన్స్ అకాడెమీలో శిక్షణ అనంతరం 1982లో కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్స్‌లో విధుల్లో చేరారు. 39 ఏళ్ల కెరీర్లో పలు కీలక బాధ్యతలు చేపట్టారు.
పశ్చిమ ప్రాంతంలో ఇంజనీర్ బ్రిగేడ్‌కు, నియంత్రణ రేఖ వద్ద ఇన్‌ఫాంట్రీ బ్రిగేడ్‌కు, లదాఖ్ సెక్టార్లో మౌంటేన్ డివిజన్‌కు నేతృత్వం వహించారు. 2001లో పార్లమెంటుపై ఉగ్ర దాడి అనంతరం జమ్మూ కశ్మీర్‌లోని పల్లన్‌వాలా సెక్టార్లో ఆపరేషన్ పరాక్రమ్ సందర్భంగా ఇంజనీర్ రెజిమెంట్‌కు సారథ్యం వహించారు. తూర్పు కమాండ్ బాధ్యతలు చూశారు.
Comments
Please login to add a commentAdd a comment