Manoj Pandey
-
ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే పదవీకాలం పొడిగింపు
సాక్షి, ఢిల్లీ: ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే పదవీ కాలం పొడిగింపు ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే పదవీకాలాన్ని కేంద్రం నెల రోజులు పొడిగించింది. జూన్ 30 వరకు ఆర్మీ చీఫ్‌గా కొనసాగనున్నారు. పదవీకాలం పొడిగింపునకు కేబినెట్ అపాయింట్మెంట్ కమిటీ ఆదివారం ఆమోదం తెలిపింది. మనోజ్ పాండే ఈ నెల 31న పదవీ విరమణ చేయాల్సి ఉంది. గతంలోనూ కేంద్రం ఆయన పదవీకాలాన్ని పొడిగించిన సంగతి తెలిసిందే.మనోజ్ పాండే ఏప్రిల్ 30, 2022న ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన మనోజ్ పాండే.. ఇప్పటి వరకు ఆర్మీ వైస్ చీఫ్‌గా ఉన్న జనరల్ పాండే, కార్ప్స్ ఆఫ్ ఇంజినీర్స్ విభాగం నుంచి ఈ అత్యున్నత పదవికి ఎంపికైన మొదటి వ్యక్తి. జనరల్ మనోజ్ పాండే నేషనల్ డిఫెన్స్ అకాడెమీలో శిక్షణ అనంతరం 1982లో కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్స్‌లో విధుల్లో చేరారు. 39 ఏళ్ల కెరీర్లో పలు కీలక బాధ్యతలు చేపట్టారు.పశ్చిమ ప్రాంతంలో ఇంజనీర్ బ్రిగేడ్‌కు, నియంత్రణ రేఖ వద్ద ఇన్ఫాంట్రీ బ్రిగేడ్‌కు, లదాఖ్ సెక్టార్లో మౌంటేన్ డివిజన్‌కు నేతృత్వం వహించారు. 2001లో పార్లమెంటుపై ఉగ్ర దాడి అనంతరం జమ్మూ కశ్మీర్‌లోని పల్లన్వాలా సెక్టార్లో ఆపరేషన్ పరాక్రమ్ సందర్భంగా ఇంజనీర్ రెజిమెంట్‌కు సారథ్యం వహించారు. తూర్పు కమాండ్ బాధ్యతలు చూశారు. -
సరిహద్దులు సురక్షితం.. కానీ కొంత సున్నితం
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లో వాస్తవాదీన రేఖ(ఎల్ఏసీ) వెంబడి భారత్–చైనా సరిహద్దుల్లో పరిస్థితులు ప్రస్తుతం సాధారణంగా, స్థిరంగానే ఉన్నప్పటికీ, కొంత సున్నితమైనవేనని భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే చెప్పారు. సరిహద్దుల్లో ఎప్పుడు ఎలాంటి సవాలు ఎదురైనా గట్టిగా తిప్పికొట్టడానికి మన సైనిక దళాలు సర్వసన్నద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఉన్నతస్థాయి సన్నద్ధతను పాటిస్తున్నాయని వెల్లడించారు. తగినన్ని సైనిక రిజర్వ్ దళాలు సరిహద్దుల్లో మోహరించాయని పేర్కొన్నారు. సరిహద్దుల్లో భద్రతాపరమైన వైఫల్యాలు తలెత్తకుండా పటిష్ట చర్యలు చేపట్టామని స్పష్టం చేశారు. సైనిక దినోత్సవం నేపథ్యంలో జనరల్ మనోజ్ పాండే గురువారం మీడియాతో మాట్లాడారు. సరిహద్దు వివాదం సహా ఇతర అంశాలకు పరిష్కారం కనుగొనడానికి భారత్, చైనా మధ్య సైనిక, దౌత్యవర్గాల స్థాయిలో చర్చలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఇక భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లో నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వెంబడి చొరబాట్లను కట్టడి చేస్తున్నామని తెలిపారు. జమ్మూకశీ్మర్‌లో హింసాకాండ తగ్గుముఖం పట్టిందని, రాజౌరీ–పూంచ్ సెక్టార్లో మాత్రం హింసాత్మక సంఘటనలు కొంతమేరకు పెరిగాయని వివరించారు. సరిహద్దుకు అవతలివైపు ఉగ్రవాద సంస్థలు చురుగ్గా కార్యకలాపాలు సాగిస్తున్నాయని చెప్పారు. జమ్మూకశీ్మర్‌లో కాల్పుల విరమణ కొనసాగుతోందన్నారు. సరిహద్దు అవతలి వైపు నుంచి భారత్‌లోకి ఆయుధాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా జరగకుండా పటిష్టమైన యాంటీ డ్రోన్ వ్యవస్థను తీసుకొచ్చినట్లు తెలిపారు. ఇండియా–మయన్మార్ సరిహద్దులో.. రెండు దేశాల నడుమ సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకొనే దిశగా భూటాన్–చైనా మధ్య కొనసాగుతున్న చర్చలపై జనరల్ మనోజ్ పాండే స్పందించారు. ఈ పరిణామాన్ని నిశితంగా గమనిస్తున్నామని చెప్పా రు. భూటాన్‌తో భారత్‌కు బలమైన సైనిక సంబంధాలు ఉన్నాయని గుర్తుచేశారు. ఇక ఇండియా–మయన్మార్ సరిహద్దులో పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉందని అంగీకరించారు. అక్కడి పరిస్థితిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామని అన్నారు. -
ఉగ్రదాడిలో అమరులైన జవాన్లు వీరే.. రంగంలోకి ఎన్ఐఏ
కశ్మీర్: అయిదుగురు భారత జవాన్లను హతమార్చిన ఉగ్రదాడిపై దర్యాప్తు చేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) రంగంలోకి దిగింది. ఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు ఎన్ఐఏ అధికారుల బృందం కాసేపట్లో జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాకు చేరుకోనున్నారు. ఢిల్లీకి చెందిన ఎనిమిది మంది ఫోరెన్సిక్ నిపుణులతోపాటు ఎన్ఐఏ బృందం మధ్యాహ్నం 12.30 గంటలకు సంఘటనా స్థలానికి చేరుకోనుంది. General Manoj Pande #COAS and All Ranks of #IndianArmy salute the supreme sacrifice of 05 #IndianArmy Bravehearts, Hav Mandeep Singh, L/Nk Debashish Baswal, L/Nk Kulwant Singh, Sep Harkrishan Singh & Sep Sewak Singh who laid down their lives in the line of duty at #Poonch Sector. https://t.co/7YSI1sEiEb — ADG PI - INDIAN ARMY (@adgpi) April 21, 2023 అమరులైన జవాన్లు వీరే ఉగ్రదాడిలో అమరులైన జవాన్లను హవల్దార్ మన్దీప్ సింగ్, లాన్స్‌నాయక్ దేవాశిష్ బస్వాల్, లాన్స్‌నాయక్ కుల్వంత్ సింగ్, హర్కిషన్ సింగ్, సేవక్ సింగ్‌గా గుర్తించారు. వీరులైన సైనికులకు ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే నివాళులు అర్పించారు. అమరుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. చదవండి: Char Dham Yatra: ‘ఛార్‌ధామ్’కు మంచు తిప్పలు అసలేం జరిగిందంటే.. పూంచ్ జిల్లాలో రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్‌కు చెందిన జవాన్లు ప్రయాణిస్తున్న ఆర్మీ ట్రక్‌పై గురువారం మధ్యాహ్నం ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. భింబెర్ గలి నుంచి సింగియోట్ వైపు వస్తుండగా గ్రనేడ్లు విసరడంతో వాహనానికి నిప్పంటుకుంది. ఈ ఘటనలో అయిదుగురు సైనికులు వీర మరణం పొందగా.. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. భారీ వర్షం, తక్కువ వెలుతురు మాటున ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడినట్లు అధికారులు తెలిపారు. ఉగ్రవాద కార్యకలాపాలను మట్టుబెట్టేందుకు వెళ్తున్న క్రమంలోనే ఈ దాడి జరిగినట్లుపేర్కొన్నారు. J&K | Visuals from Bhimber Gali in Poonch where five soldiers lost their lives in a terror attack yesterday. (Visuals deferred by unspecified time) pic.twitter.com/331XNOeQWj — ANI (@ANI) April 21, 2023 హై అలర్ట్ పిడుగుపాటు వల్ల ఈ ఘటన జరిగి ఉంటుందని తొలుత భావించినా, ఆ తర్వాత ఇది ఉగ్రవాదుల పనేనని సైన్యం నిర్ధారించింది. ఉగ్రదాడి నేపథ్యంలో జమ్ముకశ్మీర్‌లో ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. ఈ దాడి అనంతరం బటా-డోరియా ప్రాంతంలోని అడవులలో భద్రతా దళాలు భారీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఘటనా ప్రాంతాన్ని చుట్టిముట్టిన భద్రతా దళాలు.. ఉగ్రవాదుల జాడ కోసం డ్రోన్లు, స్నిఫర్ డాగ్‌లను ఉపయోగిస్తున్నారు. దాడిని పరిశీలించేందుకు బాంబు డిస్పోసల్ స్క్వాడ్, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) కూడా సంఘటనా ప్రాంతంలో ఉన్నాయి. మరోవైపు పూంచ్‌లో దాడికి పాల్పడింది తామేనని జైషే మహమ్మద్ అనుబంధ సంస్థ పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ (పీఏఎఫ్ఎఫ్) ప్రకటించింది. 2021 అక్టోబర్‌లో ఇదే ప్రాంతంలో ఉగ్రవాదులు 9 మంది భారత సైనికులను కాల్చి చంపారు. చదవండి: Karnataka: ఈశ్వరప్ప కుమారుడికి మొండిచేయి -
శతఘ్ని దళాల్లోకి మహిళా అధికారులు
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద సాయుధ దళం ‘ఆర్మీ’పోరాట విభాగంలోనూ మహిళలను చేర్చుకోవాలని నిర్ణయించింది. ముందుగా ఆర్టిలరీ (శతఘ్ని)దళాల్లో మహిళా అధికారులను చేర్చుకునేందుకు ఉద్దేశించి ప్రతిపాదనలను కేంద్రానికి పంపించినట్లు ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే చెప్పారు. ఈ ప్రతిపాదన ఆమోదం పొందుతుందని భావిస్తున్నామన్నారు. ఇది కార్యరూపం దాలిస్తే బోఫోర్స్ హౌవిట్జర్, కె–9 వజ్ర, ధనుష్ వంటి తుపాకులను ఇకపై మహిళలు కూడా ఉపయోగించగలుగుతారు. వీరు ఆర్టిలరీ పోరాట సహాయక విభాగంలో ఉంటారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. పదాతి దళం తర్వాత రెండో అతిపెద్ద రెజిమెంట్ శతఘ్ని దళమే. నిర్ణాయక విభాగంగా భావించే కీలకమైన ఈ దళంలో మిస్సైళ్లు, మోర్టార్లు, రాకెట్ లాంఛర్లు, డ్రోన్లు మొదలైనవి ఉంటాయి. పదాతి దళం, శతఘ్ని, మెకనైజ్డ్ శతఘ్ని రెజిమెంట్లలో ఇప్పటి వరకు మహిళా అధికారులకు పర్మినెంట్ కమిషన్లు లేవు. సుప్రీంకోర్టు తీర్పుతో ఆర్మీ మార్పులు తెచ్చింది. మహిళలకు పర్మినెంట్ కమిషన్ ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా 2022లో ఖడక్వాస్లాలోని డిఫెన్స్ అకాడమీలోకి 19 మంది మహిళా కేడెట్లతో మొదటి బ్యాచ్‌కు మూడేళ్ల శిక్షణ ప్రారంభించింది. అయితే, ఇన్ఫాంట్రీ, ఆర్మర్డ్ రెడ్ కార్ప్స్, మెకనైజ్డ్ ఇన్‌ఫాంట్రీల్లోకి మహిళా అధికారులను చేర్చుకోవాలన్న ప్రణాళికలేవీ లేవని రక్షణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. -
క్రమశిక్షణ, అంకితభావం ముఖ్యం
సాక్షి, హైదరాబాద్: భారత వైమానిక దళంలో చేరే అభ్యర్థులు నిరంతరం విజ్ఞాన సాధన కొనసాగించాలని, నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ (సీఓఏఎస్) జనరల్ మనోజ్ పాండే సూచించారు. క్రమశిక్షణ, అంకితభావం, వృత్తిపరమైన నైపుణ్యం ఏర్పరుచుకోవాలన్నారు. మన దేశ భద్రతా వ్యవస్థ చాలా విస్తృతమైందని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం కంప్యూటింగ్, రోబోటిక్స్, హైపర్‌సోనిక్స్ వంటి సాంకేతికతలు ఇకపై సిద్ధాంతాలకు మాత్రమే పరిమితం కావని, యుద్ధ ప్రదేశాల్లోనూ భౌతికంగా అవసరం అవుతాయని పేర్కొన్నారు. ‘ఆత్మనిర్భరత’లో భాగంగా సాయుధ దళాల్లోనూ పలు సంస్కరణలు చోటుచేసుకుంటున్నాయని చెప్పారు. ప్రతీ యువ అధికారులు ఇతరులకు మార్గదర్శకులుగా నిలిచేలా నైపుణ్యాలను పెంపొందించుకోవాలన్నారు. మహిళలు సాయుధ దళాల్లోకి ప్రవేశించడం స్ఫూర్తిదాయకమని వివరించారు. దుండిగల్‌లోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో శనివా రం కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ (సీజీపీ) జరిగింది. భారత వైమానిక దళంలోని ‘ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీ’లకు చెందిన 165 మంది ఫ్లయిట్ కెడెట్ల శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు మనోజ్ పాండే ప్రెసిడెంట్ కమిషన్లను ప్రదానం చేశారు. భారత నావికాదళం, ఇండియన్ కోస్ట్‌గార్డ్‌కు చెందిన అధికారులకు కూడా వింగ్స్ అవార్డులను అందించారు. అనంతరం పిప్పింగ్ సెరిమనీ, కవాతు, తేజస్, సూర్యకిరణ్, సారంగ్ బృందంతో ఏరోబాటిక్ ప్రదర్శనలు జరిగాయి. పైలెట్ల కోర్సులో మొదటి స్థానంలో నిలిచిన ఫ్లయింగ్ ఆఫీసర్ రాఘవ్ అరోరా.. రాష్ట్రపతి çపతకం, చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ స్వోర్డ్ ఆఫ్ హానర్ అవార్డులను అందుకున్నారు. -
చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్
న్యూఢిల్లీ: చైనాతో సరిహద్దు వెంబడి అంగుళం భూ భాగాన్ని కూడా పొరుగు దేశానికి వదలబోమని ఆర్మీ కొత్త చీఫ్ జనరల్ మనోజ్ పాండే స్పష్టం చేశారు. యథాతథ స్థితిని మార్చేందుకు జరిగే ప్రయత్నాలను దీటుగా తిప్పికొడతామన్నారు. దేశం ముందున్న సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు అత్యున్నత స్థాయి ప్రమాణాలతో కూడిన కార్యాచరణ సంసిద్ధతకు ప్రాధాన్యమిస్తానన్నారు. ఆదివారం సౌత్‌బ్లాక్‌లో గౌరవవందనం స్వీకరించిన అనంతరం ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌధరి, నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరికుమార్‌తో కలిసి జనరల్ పాండే మీడియాతో మాట్లాడారు. ‘ప్రపంచ భౌగోళిక రాజకీయ పరిస్థితులు వేగంగా మారుతుండటంతో మనకు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. అందుకే, సమకాలీన, భవిష్యత్ సంక్షోభాలను తిప్పికొట్టేందుకు అత్యున్నతస్థాయి ప్రమాణాలతో కూడిన కార్యాచరణ సంసిద్ధతే నా ప్రథమ ప్రాధాన్యం. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ కలిసికట్టుగా ఎటువంటి పరిస్థితులనైనా సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయి. రక్షణ విషయంలో స్వావలంబన సాధించడంతోపాటు ఆర్మీ కార్యాచరణ సన్నద్ధతను మరింత విస్తృతం చేసేందుకు సంస్కరణలు, పునరి్నర్మాణంపై దృష్టి సారిస్తాను’ అన్నారు. ప్రస్తుత త్రివిధ దళాధిపతులు ముగ్గురూ నేషనల్ డిఫెన్స్ అకాడమీ 61వ బ్యాచ్‌లో కలిసి చదువుకున్నవాళ్లే కావడం విశేషం. నేవీ, ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌లు తన క్లాస్‌మేట్లేనని జనరల్ పాండే అన్నారు. త్రివిధ దళాల సమష్టి కార్యాచరణకు, సహకారానికి ఇది శుభారంభమన్నారు. ఇది కూడా చదవండి: అప్పుడే మోదీకి సపోర్ట్ చేశాం: సీఎం ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు -
ఆర్మీ కొత్త చీఫ్ మనోజ్ పాండే
న్యూఢిల్లీ: దేశ 29వ ఆర్మీ చీఫ్‌గా జనరల్ మనోజ్ పాండే(60) బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుత చీఫ్ జనరల్ ఎంఎం నరవణే శనివారం రిటైర్ కావడంతో ఆయన స్థానంలో జనరల్ పాండే బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఆర్మీ వైస్ చీఫ్‌గా ఉన్న జనరల్ పాండే, కార్ప్స్ ఆఫ్ ఇంజినీర్స్ విభాగం నుంచి ఈ అత్యున్నత పదవికి ఎంపికైన మొదటి వ్యక్తి. చైనా, పాకిస్తాన్ సరిహద్దు ఉద్రిక్తతలు సహా దేశం భద్రతాపరమైన అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న వేళ జనరల్ పాండే చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా పగ్గాలు చేపట్టడం గమనార్హం. ప్రస్తుతం ఆయన కీలకమైన చైనాతో సరిహద్దు ఉన్న ఈస్టర్న్ ఆర్మీ కమాండ్‌కు నేతృత్వం వహిస్తున్నారు. ఆర్మీ చీఫ్‌గాను, నావిక, వైమానిక దళాలతో సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా థియేటర్ కమాండ్స్‌ను అమలు చేయాల్సి ఉంటుంది. దేశ మొట్టమొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ థియేటర్ కమాండ్స్ బాధ్యతలు నిర్వహించేవారు. ఆయన హెలికాప్టర్ దుర్ఘటనలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ స్థానంలో ప్రభుత్వం మరొకరిని నియమించాల్సి ఉంది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన పాండే.. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో శిక్షణ అనంతరం 1982లో కార్ప్స్ ఆఫ్ ఇంజినీర్స్‌లో చేరారు. సుదీర్ఘ కెరీర్లో పలు కీలక బాధ్యతలు చేపట్టిన ఆయనకు చైనా సరిహద్దులు, జమ్మూకశ్మీర్ సహా అన్ని రకాల ప్రాంతాల్లో పనిచేసిన అనుభవం ఉంది. దేశంలో ఏకైక త్రివిధ దళాల కమాండ్ ఉన్న అండమాన్ నికోబార్ కమాండ్‌కు చీఫ్‌గా కూడా వ్యవహరించారు. -
భారత ఆర్మీకి కొత్త చీఫ్ ఖరారు
న్యూఢిల్లీ: భారత ఆర్మీకి కొత్త చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే నియామకం అయ్యారు. ఇందుకు సంబంధించి రక్షణ మంత్రిత్వ శాఖ సోమవారం ఒక అధికారిక ప్రకటన చేసింది. ప్రస్తుతం ఆర్మీ చీఫ్‌గా ఉన్న జనరల్ ఎంఎం నవరణె స్థానంలో పాండే బాధ్యతలు చేపట్టన్నన్నారు. బిపిన్ రావత్ మరణంతో ఖాళీ అయిన సీడీఎస్ పోస్ట్‌ను ప్రస్తుత ఆర్మీ చీఫ్ నవరణెతో భర్తీ చేస్తారనే ప్రచారం నడిచింది. అయితే నవరణె ఏప్రిల్ చివరినాటికి రిటైర్ కానున్నారు. ఈ నేపథ్యంలో ఆర్మీ కొత్త చీఫ్‌గా.. ప్రస్తుతం వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా ఉన్న మనోజ్ పాండే నియామకం ఖరారు అయ్యింది. విశేషం ఏంటంటే.. ఆర్మీ చీఫ్‌గా నియమితులు కాబోతున్న మొదటి ఇంజనీర్ మనోజ్ పాండేనే కావడం. అంతకు ముందు మనోజ్ పాండే.. ఈశాన్య రాష్ట్రాల సరిహద్దు దేశాల కమాండింగ్ సెక్షన్లో విధులు నిర్వహించారు. సుమారు 39 ఏళ్ల ఆర్మీ అనుభవం ఉన్న మనోజ్ పాండే.. ఏప్రిల్ 30న బాధ్యతలు స్వీకరించనున్నారు. -
ఆర్మీ వైస్ చీఫ్‌గా మనోజ్ పాండే
న్యూఢిల్లీ: భారత ఆర్మీ నూతన వైస్ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. లెఫ్టినెంట్ జనరల్ సీపీ మహంతీ స్థానంలో ఆయన ఈ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఇప్పటివరకు మనోజ్ తూర్పు ఆర్మీ కమాండర్‌గా పనిచేస్తున్నారు. ఈ పదవికి తాజాగా లెఫ్టినెంట్ జనరల్ ఆర్పీ కలితాను నియమించారు. 1982లో పాండే ఆర్మీలో చేరారు. పలు కీలక పదవులు నిర్వహించడంతో పాటు అనేక కీలక యుద్ధాల్లో పాల్గొన్నారు. పరమ్ విశిష్ఠ సేవా మెడల్‌తో పాటు పలు అవార్డులు ఆయనకు దక్కాయి. ఏప్రిల్‌లో ఆర్మీ చీఫ్ నరవణె పదవీ విరమణ చేయనున్నారు. దీంతో సీనియర్ అధికారి మనోజ్ పాండే ఏప్రిల్ అనంతరం ఈ పదవి చేపట్టే అవకాశాలున్నాయి. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన అమరవీరుల స్మారక చిహ్నం వద్ద అమరజవాన్లకు నివాళులు అర్పించారు. -
రేప్‌కేసులో నటుడు అరెస్టు!
ముంబై: రేప్ కేసులో ప్రముఖ భోజ్‌పురి నటుడు మనోజ్ పాండేను ముంబై పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. మనోజ్ పాండే తనపై లైంగిక దాడి జరిపారని ఒక నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదుచేసిన చార్కోప్ పోలీసులు.. అప్పటినుంచి పరారీలో ఉన్న మనోజ్‌పాండే కోసం గాలిస్తున్నారు. మనోజ్ తనను మోసగించాడని, తనతో అనుబంధం కొనసాగిస్తూనే ఇతర మహిళలతో కూడా అతను సంబంధం పెట్టుకున్నాడని బాధిత నటి ఆరోపించింది. సినీ పరిశ్రమలో అవకాశాల కోసం వచ్చే అమ్మాయిలను మభ్యపెట్టి మనోజ్ మోసం చేశాడని, వారి ముందు తానో పెద్ద స్టార్‌గా అభివర్ణించుకొని.. వారితో స్నేహం పేరిట వలవేసేవాడని, ఇదేవిధంగా తనను కూడా మోసం చేశాడని ఆమె మీడియాతో తెలిపింది.