రేప్‌కేసులో నటుడు అరెస్టు!
ముంబై: రేప్ కేసులో ప్రముఖ భోజ్‌పురి నటుడు మనోజ్ పాండేను ముంబై పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. మనోజ్ పాండే తనపై లైంగిక దాడి జరిపారని ఒక నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదుచేసిన చార్‌కోప్ పోలీసులు.. అప్పటినుంచి పరారీలో ఉన్న మనోజ్‌పాండే కోసం గాలిస్తున్నారు. మనోజ్ తనను మోసగించాడని, తనతో అనుబంధం కొనసాగిస్తూనే ఇతర మహిళలతో కూడా అతను సంబంధం పెట్టుకున్నాడని బాధిత నటి ఆరోపించింది.
సినీ పరిశ్రమలో అవకాశాల కోసం వచ్చే అమ్మాయిలను మభ్యపెట్టి మనోజ్ మోసం చేశాడని, వారి ముందు తానో పెద్ద స్టార్‌గా అభివర్ణించుకొని.. వారితో స్నేహం పేరిట వలవేసేవాడని, ఇదేవిధంగా తనను కూడా మోసం చేశాడని ఆమె మీడియాతో తెలిపింది.