సాక్షి, న్యూఢిల్లీ : సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిన సైనికుడి వీరమరణానికి చెందిన చివరి వీడియోపై కేంద్రమంత్రి వీకే సింగ్ స్పష్టతను ఇచ్చారు. ఆ వీడియోను తాను యువ సైనికుల్లో ధైర్యాన్ని నింపేందుకే పోస్ట్ చేసినట్లు తెలిపారు. గత శనివారం పాకిస్థాన్ బలగాల కాల్పుల్లో నలుగురు భారత సైనికులు చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత పలు వీడియోలు బయటకు వచ్చాయి. అందులో భాగంగానే కేంద్రమంత్రి వీకే సింగ్ కూడా ఓ సైనికుడి చివరి వీడియో అంటూ విడుదల చేశారు.
అయితే, ఆ వీడియో అందరూ మొన్న పాక్ జరిపిన కాల్పుల్లో వీరమరణం పొందిన మేజర్ మోహర్కార్ ప్రఫుల్లా అంబదాస్‌ది అని అనుకున్నారు. కానీ, ఆ వీడియో 2009నాటిదని వీకే సింగ్ స్పష్టం చేశారు. ఛత్తీసగఢ్‌లోని బస్తర్‌లో మావోయిస్టులు దాడి చేసిన సమయంలో సీఆర్‌పీఎఫ్ అధికారి సత్వంత్ సింగ్ చివరి ఘడియలకు సంబంధించిన వీడియో అని భావిస్తున్నట్లు తెలిపారు. అయితే, ఈ వీడియోను తనకంటే దేశమే ముఖ్యమనుకొని సరిహద్దుల్లో ప్రాణాలు ఫనంగా పెడుతున్న యువ సైనికులకు ధైర్యాన్ని, మనో నిబ్బరాన్ని, నాయకత్వాన్ని నూరిపోసేందుకు పోస్ట్ చేసినట్లు వీకే సింగ్ స్పష్టం చేశారు.
I am well aware that the video I shared is an old video from the CRPF. The intent of sharing this video is to showcase to all the courage, valor and leadership of young officers who are always putting the nation before the self.
— Vijay Kumar Singh (@Gen_VKSingh) 27 December 2017
Comments
Please login to add a commentAdd a comment