జైళ్లల్లో అవినీతి లేదు: డీజీ వీకే సింగ్ | No corruption in Prisons department | Sakshi
Sakshi News home page

జైళ్లల్లో అవినీతి లేదు: డీజీ వీకే సింగ్

Published Wed, Jun 1 2016 11:00 PM | Last Updated on Mon, Sep 4 2017 1:25 AM

No corruption in Prisons department

మహబూబ్‌నగర్ క్రైమ్: రాష్ట్రంలోని జైళ్లలో అవినీతి ఏ మాత్రమూ లేదని, పూర్తిగా పారదర్శకంగా బాధ్యతతో విధులు నిర్వహిస్తున్నందుకు గర్వపడుతున్నామని రాష్ట్ర జైళ్ల శాఖ డీజీ వినయ్‌కుమార్ సింగ్ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా జైలుశాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని వన్‌టౌన్ సమీపంలో ఖైదీలతో నిర్వహించనున్న పెట్రోల్ బంకును బుధవారం ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో ఇది ఐదవ పెట్రోల్ బంక్ అని తెలిపారు. ఖైదీల్లో మార్పు., వారిలో ఆత్మస్థయిర్యం నింపడం కోసమే ఈ పెట్రోల్‌బంక్ తెరిచినట్లు తెలిపారు. ఇందులో వారే వర్కర్లుగా ఉంటారని, రోజువారి వేతనం ఇవ్వనున్నట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement